Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోగా అక్కినేని అఖిల్... ట్రైయిల్ షూట్ ఫినిష్
మరో ప్రక్క ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జున స్వయంగా రాజమౌళిని అడగటం, రాజమౌళి కూడా ఓకే చేసి రెండు స్టోరీ లైన్ లు వివరించటం జరిగిందని, అయితే ప్రాజెక్టు కన్ఫర్మ్ అయ్యేవరకు సీక్రెట్ గానే ఉంచాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. నాగాచైతన్యను కొత్త దర్శకుడు చేతిలో పెట్టి జోష్ వంటి ఫెయిల్యూర్ చిత్రంతో లాంచ్ చేయాల్సిరావటం గుర్తు చేసుకుని మరీ నాగార్జన అటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.
అఖిల్ కూడా రాజమౌళికి వీరాభిమాని అని, పట్టుబట్టి మరీ తన తండ్రి చేత రాజమౌళికి ప్రపోజల్ పెట్టేలా చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అనుకున్నవన్నీ సరిగ్గా కుదిరితే..మరో రెండు నెలల్లో ఈ చిత్రానికి సంభందించిన వార్త వినే అవకాశఁ ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి... ప్రభాస్ తో తాను చేయబోయే పీరియడ్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇక మరో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అఖిల్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ... "అక్కినేని అఖిల్‌తో నా సినిమా ఉండొచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడే అఖిల్‌తో నేను సినిమా చేయబోతున్నానన్న వార్త రూమరే. అయినా ముందు కథ దొరకాలి కదా. తనకు ఇప్పటికే ఓ స్టార్ సన్‌గా, క్రికెటర్‌గా ఓ క్రేజ్ ఉంది. చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేయాలి. తను ఆల్రెడీ క్రికెట్‌తో స్టార్ అయ్యాడు అన్నారు శేఖర్ కమ్ముల.