twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోగా అక్కినేని అఖిల్‌... ట్రైయిల్ షూట్ ఫినిష్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున, అమలల ముద్దుల కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా కెమెరా ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలో చదువుకొంటున్న అఖిల్‌ వీలుని బట్టి షార్ట్ ఫిల్మ్ లలో నటిస్తున్నారు. ఇటీవలే కొందరు దర్శకులు ఆయనపై కొన్ని సన్నివేశాల్ని, వివిధ హావభావాల్నీ ట్రయల్‌ షూట్‌గా చిత్రించారని సమాచారం. ఈ ట్రయిల్ షూట్ ని ఓ ప్రముఖ తెలుగు దర్శకుడు కుమారుడు దర్శకత్వంలో షూట్ చేసారని సమాచారం. అలాగే మెగా కుటుంబానికి చెందిన అమ్మాయి ఈ ట్రయిల్ షూట్ లో హీరోయిన్ గా నటించిందని తెలుస్తోంది.

    మరో ప్రక్క ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జున స్వయంగా రాజమౌళిని అడగటం, రాజమౌళి కూడా ఓకే చేసి రెండు స్టోరీ లైన్ లు వివరించటం జరిగిందని, అయితే ప్రాజెక్టు కన్ఫర్మ్ అయ్యేవరకు సీక్రెట్ గానే ఉంచాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. నాగాచైతన్యను కొత్త దర్శకుడు చేతిలో పెట్టి జోష్ వంటి ఫెయిల్యూర్ చిత్రంతో లాంచ్ చేయాల్సిరావటం గుర్తు చేసుకుని మరీ నాగార్జన అటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

    అఖిల్ కూడా రాజమౌళికి వీరాభిమాని అని, పట్టుబట్టి మరీ తన తండ్రి చేత రాజమౌళికి ప్రపోజల్ పెట్టేలా చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అనుకున్నవన్నీ సరిగ్గా కుదిరితే..మరో రెండు నెలల్లో ఈ చిత్రానికి సంభందించిన వార్త వినే అవకాశఁ ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి... ప్రభాస్ తో తాను చేయబోయే పీరియడ్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

    ఇక మరో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అఖిల్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ... "అక్కినేని అఖిల్‌తో నా సినిమా ఉండొచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడే అఖిల్‌తో నేను సినిమా చేయబోతున్నానన్న వార్త రూమరే. అయినా ముందు కథ దొరకాలి కదా. తనకు ఇప్పటికే ఓ స్టార్ సన్‌గా, క్రికెటర్‌గా ఓ క్రేజ్ ఉంది. చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేయాలి. తను ఆల్రెడీ క్రికెట్‌తో స్టార్ అయ్యాడు అన్నారు శేఖర్ కమ్ముల.

    English summary
    
 It has been a while since the talk is on about the debut of Akhil Akkineni into cinema and many are eagerly waiting to know what is going to be his debut film like. Well, few sources from the Akkineni camp reveal that the film is almost finalized and it is only a matter of time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X