For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టబు అదుర్స్‌: హిందీ 'దృశ్యం' రీమేక్ ట్రైలర్‌ (వీడియో)

  By Srikanya
  |

  ముంబై‌: వెంకటేష్, మీనా కాంబినేషన్ లో వచ్చి తెలుగులో విజయవంతమైన చిత్రం 'దృశ్యం' . ఈ చిత్రం ఇప్పుడు హిందీలో నూ రెడీ అయ్యి...విడుదలకు సిద్దమవుతోంది. నిషికాంత్‌ కమత్‌ దర్శకత్వంలో అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ చిత్రం రూపొందింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ చిత్ర ట్రైలర్‌ ఈ రోజు (గురువారం) సాయింత్రం విడుదలైంది. మూడు నిమిషాలపాటు సాగే ఈ ట్రైలర్‌లో తన కుటుంబాన్ని రక్షించేందుకు తపన పడే సాధారణవ్యక్తి పాత్రలో అజయ్‌దేవగణ్‌ ఒదిగిపోయారు. అజయ్‌దేవగణ్‌ సరసన శ్రియ నటిస్తోంది. అలాగే తెలుగులో నదియా చేసిన పోలీస్ అధికారి పాత్రలో టబు కనిపించింది. మీరూ ఈ ట్రైలర్ చూడండి..

  Drishyam - Official Trailer | Starring Ajay Devgn, Tabu & Shri...

  Visuals Can Be Deceptive. Presenting the much awaited trailer of Drishyam, starring Ajay Devgn, Tabu and Shriya Saran. Releasing 31st July, 2015. Watch Now!

  Posted by Drishyam on 4 June 2015

  మోహన్‌లాల్‌, మీనా కీలక పాత్రధారులుగా జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘దృశ్యం'. అక్కడ ఘనవిజయం సాధించిన చిత్రమిది. వెంకటేశ్‌, మీనా జంటగా అదే టైటిల్‌తో శ్రీప్రియ తెలుగులో, వి.రవిచంద్రన్‌ హీరోగా పి.వాసు కన్నడలో రీమేక్‌ చేయగా ఇరు ప్రేక్షకులను అమితంగా అలరించిందీ చిత్రం. తమిళంలో కమలహాసన్‌ తెరకెక్కిస్తున్నారు. దక్షిణాది భాషలన్నింటిలోనూ రూపొందిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించబోతోంది. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ‘దృశ్యం' హిందీ రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకుని నిర్మించింది. అజయ్ దేవగన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

  ఈ చిత్రం ఇప్పటికే మళయాళం, తమిళం, తెలుగు భాషల్లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క కమల్ 'దృశ్యం' రీమేక్ రిలీజ్ డేట్ ఇచ్చేసారు. ఆ వివరాల్లోకి వెళితే... 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'పాపనాశం'. మలయాళంలో పెద్ద హిట్‌ సొంతం చేసుకున్న 'దృశ్యం' చిత్రానికి రీమేక్‌ ఇది. తెలుగులో వెంకటేశ్‌, మీనా నటనలో అదే పేరుతో విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై 17న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  Trailer of Ajay Devgn's 'Drishyam' released

  తమిళంలో కమల్‌కు భార్యగా గౌతమి నటిస్తున్నారు. తిరునెల్వేలి సమీప ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఆఖరుకు చేరుకున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇందులో కమల్‌ కేబుల్‌ ఆపరేటర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

  ఇక మరో ప్రక్క ఈ చిత్రానికి మూలమైన నవల 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని అక్కడ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో కత్రినా కైఫ్‌ నటించబోతున్నట్లు బాలీవుడ్‌ సమాచారం. 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌'. ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన నవల. కేగో హిగాషినో రచించిన ఈ నవల జపాన్‌లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు అందుకొంది. ఈ కథను బాలీవుడ్‌ వెండితెరపై చూపించాలనుకుంటున్నారు దర్శకుడు సుజయ్‌ ఘోష్‌. దీన్ని ఏక్తా కపూర్‌ నిర్మిస్తారు.

  Trailer of Ajay Devgn's 'Drishyam' released

  ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు కత్రినా కైఫ్‌ని సంప్రదించడంతో పాటు ఆమెకు ఈ పుస్తకాన్నీ పంపించారట. కత్రినాకు ఈ కథ నచ్చడంతో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది. ఇక ఇప్పటికే దక్షిణాదిన 'దృశ్యం' సినిమా రిలీజై ఆకట్టుకుంటోంది. తొలుత మలయాళంలో జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.

  మలయాళంలో యాభైకోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న ఒక కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే పాయింట్‌తో తీసిన ఈ చిత్రం రీమేక్‌ హక్కులు తీసుకుని కన్నడ, తెలుగు భాషల్లో రూపొందించారు. తెలుగు చిత్రంలో వెంకటేశ్‌, మీనా నటించగా సీనియర్‌ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు.

  తెలుగు 'దృశ్యం' ఇటీవలే విడుదలై సక్సెస్‌బాటలో ఉంది. ఇప్పుడు 'దృశ్యం' కథపై వివాదం మొదలైంది. జపాన్‌ భాషలో వచ్చిన 'ది డివోషన్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' అనే నవలా హక్కులను ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తాకపూర్‌ తీసుకున్నారు. హిందీలో చిత్రం నిర్మించే ఆలోచనతో ఉన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణ ఏమంటే నవలలోని ప్రధానాంశాలను ఆధారంగా చేసుకుని 'దృశ్యం' సినిమా తీశారనేది.

  English summary
  The much-awaited trailer of Ajay Devgn's Drishyam was unveiled today. The thriller-drama, directed by Nishikant Kamat, is a remake of a 2013 Mohanlal-starrer Malayalam film of the same name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X