‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లేటెస్ట్ ట్రైలర్(వీడియో)
హైదరాబాద్ : మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారని ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేస్తోంది.
సక్రాంతి కానుకగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆడియో డిసెంబర్ 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తారా? లేక సింపుల్ గా చేస్తారా? అనేది విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
మహేష్ బాబు, వెంకటేష్ ల సినీ కేరీర్‌లోనే ఈచిత్రం విభిన్న చిత్రంగా నిలవనుందని, ఈచిత్రం విజయవంతమైతే తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల జోరందుకోనుంది. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లేటెస్ట్ ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











