twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కంటెంట్' అంటే ఇదీ..: నీది నాది ఒకే కథ ట్రైలర్..(వీడియో)

    |

    Recommended Video

    'కంటెంట్' అంటే ఇదీ..: నీది నాది ఒకే కథ ట్రైలర్..!

    సెల్యూలాయిడ్ మీద ఎన్నో కథలు వస్తుంటాయి, పోతుంటాయి. థియేటర్ నుంచి బయటకు రాగానే.. ఏం కథరా బాబు? అని తల బాదుకునే సినిమాలే అందులో ఎక్కువగా ఉంటాయి. చెప్పుకోదగ్గవి గుర్తుంచుకోదగ్గవి మాత్రం అతికొద్దివి మాత్రమే ఉంటాయి. చూస్తుంటే.. 'నీది నాది ఒకే కథ' కూడా ఇప్పుడా జాబితాలో చేరేలా ఉంది. ట్రైలర్ విడుదలయ్యిందో లేదో.. ఇది కంటెంట్ ఉన్న కథ అని తీర్మానించేశారు ఆడియెన్స్.

     ట్రైలర్ అదిరింది..:

    ట్రైలర్ అదిరింది..:

    ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ లాగే 'నీది నాది ఒకే కథ' ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. చదువంటే నిరాసక్తి.. ఆత్మ న్యూనత నుంచి బయటపడి ఎలాగైనా విజయం సాధించాలనే కసి ఉన్న పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాల్లో శ్రీవిష్ణు ఎమోషన్స్ పలికించిన తీరుకు మంచి మార్కులే పడుతున్నాయి.

     హీరో క్యారెక్టరైజేషన్ సూపర్బ్..:

    హీరో క్యారెక్టరైజేషన్ సూపర్బ్..:

    హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయ్యేలా దర్శకుడు వేణు ఊడుగుల ఈ ట్రైలర్ కట్ చేశారని చెప్పవచ్చు. హీరో పాత్ర చుట్టూ ఉండే ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా.. ప్రధానంగా తండ్రి-కొడుకుల మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌లో.. సగ భాగం సరదాగా సాగిపోగా.. మిగతా సగం కథలోని సీరియస్‌నెస్‌ను ఎలివేట్ చేసింది.

    కెమిస్ట్రీ కుదిరింది:

    కెమిస్ట్రీ కుదిరింది:

    హీరో-హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా రొటీన్ కు భిన్నంగా.. కొత్తగా తెరకెక్కించినట్టున్నారు వేణు ఊడుగుల. 'చూడు సాగర్.. నేనేదో గ్రేట్ అని కాదుకానీ నీలాంటి వేస్ట్ ఫెలోస్ ని మార్చడంలో నాకేదో తృప్తి ఉంటుంది' అని హీరోయిన్ చేత చెప్పించిన డైలాగ్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    అదిరిపోయిన డైలాగ్స్:

    ట్రైలర్ మొత్తంలో దర్శకుడు వేణు ఊడుగుల రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. సందర్భానికి తగ్గట్టు సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా బలమైన సంభాషణలు అందించారాయన. అందులో మచ్చుకు కొన్ని..

    విద్యా విహీన: పశువు అని పదిమందికి పాఠాలు చెప్పే టీచర్‌ను నేను.. అటువంటిది నా ఇంట్లో నుంచే ఒక పశువు బయటకు వస్తున్నాడంటే..

    నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పరా.. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క క్షణం మాకోసం ఆలోచించావా..,

    ఎప్పుడు చస్తామో తెలియని ఈ బొంగు లైఫ్ కోసం ఏంట్రా మీ సోదంతా..

    నవ్వు రావడం.. కోపం రావడం.. బాధ కలగడం.. ఇవన్నీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ కదండీ..

    మార్చి 23న రిలీజ్..:

    మార్చి 23న రిలీజ్..:

    నారా రోహిత్‌ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 23న నీది నాది ఒకే కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ విష్ణు సరసన బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాకు సంగీతం సురేష్ బొబ్బిలి అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా రాజు తోట, ఎడిటర్‌గా బొంతల నాగేశ్వర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్‌గా టిఎన్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

    English summary
    Hero Sri Vishnu's new movie Needi Naadi Oke Katha trailer was released on Friday morning, trailer getting huge response from comman audience
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X