దాడి టైంలో తీస్తున్న'దూకుడు' సీనేంటి
మొన్న ఆదివారం నాడు మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు' షూటింగ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ దాడి చోటు చేసుకుంది.అయితే ఆ సమయంలో సినిమాలో షూట్ చేస్తున్న సీన్ ఏమిటి అని అందరూ ఆసక్తి కనపరుస్తున్నారు.ఆ సీన్ ఏమిటంటే.. ముంబై ట్రైన్‌లో విలన్ సోనూసూద్ వెళుతుండగా, హీరో మహేష్‌బాబు వెంటాడే సన్నివేశం షూట్ చేసారు. అంతా పూర్తయి, సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ బయలు దేరడానికి షూటింగ్ బృందం సిద్ధమవగా, విద్యార్థి జేఏసీ నాయకులు 'జై తెలంగాణ' నినాదాలతో మహేష్ బాబు కూర్చున్న వాహనాన్ని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఆయన అభిమానులు ఎదురు తిరిగి పోలీసుల సహకారంతో మహేష్ బాబు వాహనాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు.
మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దూకుడు". సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు. తమన్ తోలిసారి మహేష్ సినిమాకు పాటలు అందిస్తున్నాడు. దూకుడు గతంలో టర్కీ, గుజరాత్, ముంబై, స్విట్జర్లాండ్ లలో షూటింగ్ జరుపుకుంది. మహేష్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.


Click it and Unblock the Notifications











