ఆమె బాహుబలి హీరోయినా? అన్ని ఆస్తులు ఎక్కడివి? అలాగే సంపాదించింది.. హేమపై తమన్నా ఫైర్

బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన సినీ నటి హేమ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పోలీసులకు పట్టుబడి కూడా నేను ఫాంహౌస్‌లో ఉన్నాను, కిచెన్‌లో వంట చేసుకుంటున్నాను అంటూ కట్టుకథలు చెప్పి జనాన్ని, మీడియాను తప్పుదోవ పట్టించింది. తవ్వేకొద్దీ ఆమె నాటకాలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. చివరికి పార్టీకి హాజరైన వారికి టెస్టులు నిర్వహించడంతో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరిలో హేమ కూడా ఉంది. అన్నివైపుల నుంచి పక్కా ఆధారాలు ఉండటంతో ఇక సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇంటా బయటా హేమపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా హేమపై మండిపడ్డారు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. మన అక్క బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరిందని, అలా ఎన్నో పార్టీలో దొరికిపోద్ది, గుంటూరులో కూడా దొరికింది, రికమెండేషన్లతో బయటకు వచ్చి .. చెట్ల దగ్గర నిల్చుని వీడియోలు పోస్ట్ చేసి హైదరాబాద్‌లో ఉన్నానని చెబుతుంది అంటూ తమన్నా సింహాద్రి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె అసలు ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతుంది.. అక్క చేసేది బాహుబలి హీరోయిన్ క్యారెక్టర్లేం కాదు, చిన్న చిన్న పాత్రలే. మరి ఇన్ని ప్రాపర్టీలు, ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది.. అక్క చేసేదే అలాంటి పనులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొత్త ఆర్టిస్టులు, అందమైన అమ్మాయిలను ఎరగా వేసి సంపాదిస్తుందని.. అక్క బతుకు ఇదే అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది తమన్నా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

transgender tamanna simhadri made sensational comments on actress hema on bangalore rave party issue

నిజానికి టాలీవుడ్‌లో హేమ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అక్క , వదిన , పిన్ని, అమ్మ హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు తప్పించి ఓ పెద్ద క్యారెక్టర్ వేసిన దాఖలాలు లేవు. ఎక్కువగా స్టార్ కమెడియన్లకు భార్య రోల్స్‌లో నటిస్తూ.. మొగుడిని కనుసన్నల్లో పెట్టి చిటికెన వేలిపై ఆడించే పాత్రల్లో హేమ పరకాయ ప్రవేశం చేస్తారన్న పేరుంది. ఎప్పుడో మూడు దశాబ్ధాల క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఆమె చిన్నా చితకా రోల్స్ చేస్తూ బండి నెట్టుకొచ్చింది మధ్యలో వివాహం కావడంతో కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే నువ్వు నాకు నచ్చావ్ , సొంతం, వసంతం, మల్లిశ్వరి, అతడు, స్టాలిన్ , కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ.

అలాంటిది హేమకు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ తన సంపాదన , ఆస్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకున్నట్లు తనకు ఆ రేంజ్‌లో ఆస్తులు లేవని, తన బిడ్డని సెటిల్ చేసేవరకు సంపాదించానని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికీ తాను సంపాదిస్తున్నానని.. ఎవరైనా అవకాశాలు ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తూనే ఉంటానని హేమ స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి చేతిలో పెద్దగా సినిమాలు కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉండటంతో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన 'జై సమైక్యాంధ్ర పార్టీ' తరపున మండపేట నుంచి పోటీ చేసి చేతులు కాల్చుకుంది. మరి తమన్నా సింహాద్రి చెప్పినట్లుగా హేమకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా.. లేక అవి ఆరోపణలు మాత్రమేనా అన్నది త్వరలోనే తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X