Bigg Boss Telugu 7 Winner: పల్లవి ప్రశాంత్ అభిమానుల అరాచకం.. అస్సలే ఊరుకోమంటున్న వీసీ సజ్జనార్.. అసలేమైందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాల్ చాలా గ్రాండ్ నిర్వహించారు. అద్భుతమైన ఆట పాటలు, అంతకు మించిన టాస్క్ లతో విన్నర్ నేమ్ రివీల్ చేశారు. అయితే విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ యే గెలుస్తాడని.. అతడిని కలిసేందుకు ఆయన ఫ్యాన్స్ అంతా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. నిన్న రాత్రి షో అయిపోగానే... అంతా అతడి కోసం గేటు వద్ద నిల్చొని చూశారు. కనీసం కంటెస్టెంట్లు, గెస్టులను కూడా బయటకు రానివ్వకుండా రచ్చ చేశారు. ఇంత రచ్చ చేసినా వారిని ఆపేందుకు పోలీసుల తరం కాలేదు. కంటెస్టెంట్లకు చెందిన కార్లతో పాటు కొన్ని ఆర్టీసీ బస్సులపై కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు.
ముఖ్యంగా అశ్విని శ్రీ కారుపై రాళ్లు విసరడంతో బ్యాక్ సైడ్ గ్లాస్ అంతా పగిలిపోయింది. ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టింది. అలాగే రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ కారుపై కూడా దాడికి దిగారు. అందులో అమర్ దీప్ కు కాస్త గాయాలు అయ్యయాని కూడా టాక్ నడించింది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఆగమాగం చేస్తూ రచ్చ చేసిన అభిమానలుపై చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది చెబుతున్నారు. ముఖ్యంగా ఓ బస్సుపై కూడా విరుచుకుపడి దాడి చేసినట్లు మనకు తెలిసు. కానీ వీళ్లు దాడి చేసింది ఒక బస్సు కాదు.. ఆరు బస్సులపై వీళ్లు రాళ్లు విసిరినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలపై ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ కూడా స్పందించారు. ట్విట్టర్ వేధికగా ఇదేం అభిమానం అంటూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్-7 గ్రాండ్ ఫైనాలే సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారని వివరించారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారని కూడా వెల్లడించారు.
బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని వీసీ సజ్జనార్ వివరించారు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టేనని అన్నారు. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని చెప్పుకొచ్చారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి అని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మరోసారి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











