For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: తండ్రి ఫిర్యాదుతో హీరోయిన్ అరెస్ట్.. పెళ్లి లేదు సెక్స్ ఎలా?.. బాలకృష్ణ పెద్ద కమెడియన్

|

భారతీయ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్స్‌తో పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రధానంగా దక్షిణాది సినిమాకు చెందని తాజా సినిమా వార్తలు, గాసిప్స్, రికార్డు కలెక్షన్లు ట్రెండింగ్‌గా నిలిచాయి. హిందీలో ప్రియాంక చోప్రా, తెలుగులో కుర్ర హీరోలు, తమిళంలో రజనీకాంత్ సినిమా వార్తలు పాఠకులను ఉర్రూతలూగించాయి. గడిచిన ఏడు రోజుల్లో టాప్, ట్రెండింగ్‌గా నిలిచిన వార్తలు మీ కోసం..

అది కుక్కతో కూడా ఉండొచ్చు, పెళ్లి లేదు సెక్స్ ఎలా?... సుమంత్ రియాక్షన్ ఇదీ!

తన తాజా చిత్రం 'సుబ్రహ్మణ్యపురం' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న హీరో సుమంత్‌ తన పర్సనల్ లైఫ్ గురించి ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. గతంలో నటి కీర్తి రెడ్డిని పెళ్లాడి విడిపోయిన సుమంత్ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ... కీర్తి రెడ్డితో విడిపోయినా తనతో ఇప్పటికీ మంచి ప్రెండ్షిప్ ఉండటం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు. కీర్తి రెడ్డి మరో పెళ్లి చేసుకుని సెటిలయ్యారు.. మరి మీరెప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సుమంత్ స్పందిస్తూ.... 'ఏమో తెలియదండీ. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు' అని సమాధానం ఇచ్చారు. Read more at

శాసిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. సైరాకు షాక్, ఆ హీరో గెటప్ ఇదే.. ఫోటోలు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వస్తోంది. వచ్చే ఏడాది సైరా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. స్వాతంత్ర సమరం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు సైరా చిత్రానికి లీకేజి బెడద తప్పలేదు. విజయ్ సేతుపతి పాత్రకు సంబందించిన ఫోటోలు లీక్ అయ్యాయి. Read more at:

రేప్ చేయబోయారు.. ఛాతీపై చేతులు వేసి.. అక్కడ గట్టిగా పిండారు..

కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో దాదీ పాత్రతో, ఇతర కామెడీ షోలతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో ప్రదర్శన ఇస్తుండగా కొందరు మద్యం సేవించి వ్యక్తులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని విషయాన్ని అలీ అస్గర్ వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

Read more at:

బాలకృష్ణ పెద్ద కమెడియన్.. అలాంటి వ్యక్తి గురించి తెలియదని చెప్పడం పొరపాటే.. నాగబాబు!

మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వివాహాల గురించి రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై నాగబాబు మరోమారు క్లారిటీ ఇచ్చారు. Read more at:

దటీజ్ పవన్ కల్యాణ్.. కళ్లు చెదిరే ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన పవర్ స్టార్!

గత కొద్దికాలంగా సినిమాలకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటూ ప్రజా క్షేత్రంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ సామాజిక అంశాలతో కూడిన ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాలని వచ్చిన ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. Read more at:

నెం.1 పొజిషన్లో ప్రియా వారియర్, సన్నీ లియోన్‌ ఔట్

ప్రియా ప్రకాష్ వారియర్... నెటిజన్లకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ఈ మలయాళ బ్యూటీ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. 2018 సంవత్సరం ముగుస్తున్న వేళ మరోసారి ప్రియా వారియర్ పేరు తెరపైకి వచ్చింది. గత రెండు మూడేళ్లుగా గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన లిస్టులో సన్నీ లియోన్ టాప్ పొజిషన్ అందుకుంటూ ఉండగా... ఈ సారి ఆమెను పక్కకు నెట్టేసి ఆ స్థానం ప్రియా ప్రకాష్ వారియర్ దక్కించుకుంది. తాజాగా గూగుల్ విడుదల చేసిన మోస్ట్ సెర్డ్చ్ పర్సనాలిటీల లిస్ట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. Read more at:

ఇషా అంబానీ పెళ్లి: పాప్ స్టార్ బియాన్స్‌ అదిరిపోయే పెర్పార్మెన్స్, ఎంత చార్జ్ చేసిందో తెలుసా?

దేశంలోనే అతిపెద్ద కుబేరుడు ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లి వేడుకను తన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా వైభవంగా నిర్వస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఉదయ్‌పూర్ వేదికగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవ్వగా బాలీవుడ్ ప్రముఖులతో పాటు అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు హిల్లరీ క్లింటన్ కూడా హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు అమెరికన్ పాప్ సింగర్ భియాన్స్ కూడా తన బృందంతో ఇండియా వచ్చారు. ఆమె కోసం ప్రత్యేక విమానం కేటాయించి ఇక్కడకు రప్పించారు. ఆదివారం రాత్రి బియాన్స్ ప్రదర్శన ఇషా అంబానీ పెళ్లి వేడుకలో హైలెట్‌గా చెప్పుకుంటున్నారు. Read more at:

ఘాటుగా ఫైర్ అయిన నమ్రత.. వైరల్ వీడియోపై ఇంటర్నెట్‌లో దుమారం!

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటారు. కానీ ఆమె తన కుటుంబ విషయాలు మినహా మిగిలిన విషయాలని పెద్దగా పట్టించుకోరు. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఘాటుగా స్పందించారు. ఆ వీడియో చూసి తాను షాక్ అయ్యానని నమ్రత తెలిపారు. ఇది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జుమాటోకి సంబంధించిన వీడియో. కేవలం నమ్రత మాత్రమే కాదు.. సదరు సంస్థ చేసిన నిర్వాకానికి నెటిజన్లు అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. Read more at:

హీరోయిన్ తొలి సంపాదన అలా... నగ్నంగా ఆ పనులు చేస్తుందట!

హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ ఆనిస్టన్ ఇటీవల ఓ టాక్ షోలో తన అలవాట్లు గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన కొన్ని విషయాలు అభిమానులను ఆశ్చర్య పరిచాయి. ముఖ్యం ఆమె నగ్నంగా చేసే కొన్ని విషయాల గురించి విని అంతా బిత్తరపోయారు. అనిస్టిన్ ప్రస్తుతం తన తాజా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ 'డంప్లిన్' ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా పఖ్యాత ది ఎలెన్ డిజెనెరెస్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలెన్ అడిగిన ప్రశ్నలకు జెన్నిఫర్ నిజాయితీగా సమాధానాలు ఇచ్చారు.

తండ్రి ఫిర్యాదు.. హీరోయిన్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు

ప్రభాస్‌‌కు ఎక్కువవుతున్న సమస్య.. ఏకంగా 50 ఉన్నాయట, అవి లేకుండా కష్టం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ హీరోలకు సమానమైన క్రేజ్ ప్రభాస్ కు ఉంది. బాహుబలి రెండు భాగాలు తెచ్చిపెట్టిన క్రేజ్ తో ప్రభాస్ రాస్తుతం దూసుకుపోతున్నాడు. ఇక పై తాను నటించే చిత్రాలని నార్త్ లో కూడా విడుదల చేయబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల తాకిడి ప్రతి హీరోకు ఉండే సమస్యే. చాలా మంది హీరోలు అభిమానుల తాకిడి ఎదురవుతున్నా ఓపిగ్గా భరిస్తారు. ప్రభాస్ కు ఈ సమస్య మరింతగా ఎక్కువవుతోంది. Read more at:

సుదీర్ఘమైన అనుబంధం.. దూరమయ్యే సమస్యే లేదు.. ఇన్స్‌టాగ్రామ్‌లో సమంత

పెళ్లి తర్వాత కూడా సమంత అక్కినేని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. పెళ్లి అయితే హీరోయిన్లుగా పనికిరారనే అపోహను సమంత కొట్టిపారేసింది. తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టును ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టగా నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అదేమిటంటే..

Read more at:

ఇంత దారుణమా అని ఇప్పుడే తెలిసింది.. వైరల్ అవుతున్న రష్మిక ఫోటో షూట్!

ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి రష్మిక సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం చిత్రంతో సౌత్ లోనే సంచలనంగా మారిపోయింది. యువతలో రష్మికకు ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దక్షనాదిలో కొన్ని భారీ చిత్రాలలో రష్మిక అవకాశాలు అందుకుంటోంది. ఆ మధ్యన రష్మిక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక ఓ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందాలు ఆరబోయడానికి చేసిన ఫోటో షూట్ కాదు. Read more at:

నాగబాబు వర్సెస్ బాలయ్య .... ఈ కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం ఎందుకో?

మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నాకు తెలిసిన బాలయ్య ఒక్కరే, ఆయన బాగా కామెడీ చేస్తారు అంటూ సీనియర్ కమెడియన్ బాలయ్య ఫోటోను చూపి మరీ ఓ వీడియో పోస్టు చేశారు నాగబాబు. నాగబాబు నుంచి ఆ కామెంట్స్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఇరు వర్గాలకు చెందిన అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ కల్పించుకుని వారికి ఆపే ప్రయత్నం చేశారు.

English summary
Priyanka Chopra, Balakrishna, Namrata, Nagababu like celebrities become top news makers. Telugu Filmibeat complied Last seven days top stories for regular, Irreguler users.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more