For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: పవన్ పెళ్లిళ్లపై నాగబాబు, బాలయ్య తాట తీశాడు, టి ఎన్నికల్లో సినీస్టార్ల ఓటమి

  |

  'సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది'... లేడీ ప్రొడ్యూసర్ దూకుడు, వజ్రాల వ్యాపారి హత్య: పోలీసుల అదుపులో ప్రముఖ నటి, ఏమిటి లింకు?, ఆ ఇద్దరు మా ఫ్యామిలీతో కలవలేదు, మూడో ఆవిడ కళ్యాణ్ బాబుకు బెస్ట్ జోడీ: నాగబాబు, చాలా మంది తాట తీశాడు: బాలకృష్ణపై పోసాని సంచలన కామెంట్స్, అర్ధరాత్రి అదిరింది.. నీతో సాయంత్రం.. ప్రముఖ గాయకుడితో రాయ్ లక్ష్మీ, తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు సినీ స్టార్ల ఓటమి... ఆ ఇద్దరికి డిపాజిట్ కూడా దక్కలేదు...ఇలా పలు వార్తలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.

  ‘సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది'... లేడీ ప్రొడ్యూసర్ దూకుడు!

  ‘సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది'... లేడీ ప్రొడ్యూసర్ దూకుడు!

  బాలీవుడ్ లేడీ నిర్మాత ఏక్తా కపూర్ తను తీసే సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తరచూ విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నిర్మించే వాటిలో సెక్స్, శృంగార ప్రేరేపితంగా ఉండే కంటెంటుతో పాటు ప్రేక్షకులను మూఢ నమ్మకాల వైపు నడిపించే 'నాగిని' లాంటి సీరియల్స్ ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి వాటిని రూపొందిస్తున్న తనపై వచ్చే ఆరోపణలను ఏక్తా కపూర్ తనదైన శైలిలో తిప్పి కొడుతున్నారు. సమస్య తను తీసే సినిమాల్లో, సీరియల్స్‌లో లేదని, సమస్య అంతా మన దేశంలో, కొందరి ఆలోచనల్లో ఉంది అంటూ దూకుడుగా సమాధానం ఇస్తోంది

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వజ్రాల వ్యాపారి హత్య: పోలీసుల అదుపులో ప్రముఖ నటి, ఏమిటి లింకు?

  వజ్రాల వ్యాపారి హత్య: పోలీసుల అదుపులో ప్రముఖ నటి, ఏమిటి లింకు?

  ప్రముఖ టీవీ నటి దేవొలీనా భట్టాచార్జీని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ముంబైకి చెందిన ఓ వజ్రాల వ్యాపారి మరణంతో ఆమెకు కనెక్షన్ ఉందని భావించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. 'సాథ్‌ నిభానా సాథియా' (తెలుగులో 'కోడలా కోడలా కొడుకు పెళ్లమా') లాంటి పాపులర్ సీరియళ్లలో దేవొలీనా నటిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ ఇద్దరు మా ఫ్యామిలీతో కలవలేదు, మూడో ఆవిడ కళ్యాణ్ బాబుకు బెస్ట్ జోడీ: నాగబాబు

  ఆ ఇద్దరు మా ఫ్యామిలీతో కలవలేదు, మూడో ఆవిడ కళ్యాణ్ బాబుకు బెస్ట్ జోడీ: నాగబాబు

  రాజకీయాల్లోకి వెళ్లిన సినీ నటుడు పవన్ క‌ళ్యాణ్‌ను రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను నేరుగా ఎదురుకోలేక వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం ఈ మధ్య తరచూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తన ఫేస్ బుక్ పేజీ ద్వారా లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా బ్రదర్ నాగబాబు ఇందుకు సంబంధించిన అంశాలపై స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చాలా మంది తాట తీశాడు: బాలకృష్ణపై పోసాని సంచలన కామెంట్స్

  చాలా మంది తాట తీశాడు: బాలకృష్ణపై పోసాని సంచలన కామెంట్స్

  టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య చాలా పవర్ ఫుల్ అని, ఇప్పటి వరకు ఆయన చాలా మంది తాట తీశాడంటూ తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కేసీఆర్ గెలుపు నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ మీడియాతో మాట్లాడిన పోసానికి... ఈ సందర్భంగా పాత్రికేయుల నుంచి బాలయ్య చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావన ఎదురైంది. దీంతో పోసాని స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు సినీ స్టార్ల ఓటమి... ఆ ఇద్దరికి డిపాజిట్ కూడా దక్కలేదు!

  తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు సినీ స్టార్ల ఓటమి... ఆ ఇద్దరికి డిపాజిట్ కూడా దక్కలేదు!

  తెలంగాణ ఎన్నికల్లో హోరా హోరీ పోరాటం ఉంటుందని భావించి అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి తేవడానికి ప్రజలు మొగ్గు చూపడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో సినీ పరిశ్రమ నుంచి కూడా ముగ్గురు సెలబ్రిటీలు బరిలో నిలిచారు. అయితే వీరిలో ఏ ఒక్కరినీ తెలంగాణ ప్రజలు శాసన సభకు పంపడానికి ఇష్టపడలేదు. వీరిలో ఎవరికీ కూడా టీఆర్ఎస్ నుంచి టికెట్ లభించక పోవడం గమనార్హం. ఒకరు తెలుగు దేశం పార్టీ నుంచి, ఇద్దరు బీజేపీ నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ‘అతిగా ముద్దులు.. అర్ధనగ్నంగా సీన్లు.. ఐశ్వర్యరాయ్ అందుకే సక్సెస్ కాలేదు'

  ‘అతిగా ముద్దులు.. అర్ధనగ్నంగా సీన్లు.. ఐశ్వర్యరాయ్ అందుకే సక్సెస్ కాలేదు'

  బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక జీవితంలోని విశేషాలు, ఎత్తు పల్లాలు అనేక విషయాలు వెల్లడించే ఆత్మకథ తాజాగా రిలీజైంది. ప్రియాంక చోప్రా - ఇంక్రెడిబుల్ స్టోరి ఆఫ్ ఏ గ్లోబల్ సూపర్‌స్టార్ అనే పేరుతో ఆత్మకథ విడుదలైంది. ఈ బయోగ్రఫిని అసీమ్ ఛబ్రా రాశారు. ఐశ్వరరాయ్ కంటే ప్రియాంక ఎక్కువగా సక్సెస్ కావడం వెనుక కారణాలను రచయిత వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రేప్ చేయబోయారు.. ఛాతీపై చేతులు వేసి.. అక్కడ గట్టిగా పిండారు..

  రేప్ చేయబోయారు.. ఛాతీపై చేతులు వేసి.. అక్కడ గట్టిగా పిండారు..


  కమెడియన్ అలీ అస్గర్ అంటే హిందీలోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎప్పుడూ ఆడ వేషాల్లోనే కనిపిస్తుంటాడనే సంగతి తెలిసిందే. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో దాదీ పాత్రతో, ఇతర కామెడీ షోలతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో ప్రదర్శన ఇస్తుండగా కొందరు మద్యం సేవించి వ్యక్తులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని విషయాన్ని అలీ అస్గర్ వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అర్ధరాత్రి అదిరింది.. నీతో సాయంత్రం.. ప్రముఖ గాయకుడితో రాయ్ లక్ష్మీ!

  అర్ధరాత్రి అదిరింది.. నీతో సాయంత్రం.. ప్రముఖ గాయకుడితో రాయ్ లక్ష్మీ!

  దక్షిణాది సినీ తార రాయ్ లక్ష్మీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికా పాప్ సింగ్ అకాన్‌ను కలుసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో 2017లో అకాన్‌ను రాయ్ లక్ష్మీ కలుసుకొన్న విషయం తెలిసిందే. అకాన్‌తో కలిసిన ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా దానికి భారీగా రెస్పాన్స్ లభించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   కొరటాల శివ, రాజమౌళి అలా ఉండమన్నారు.. 2020 వరకు భరించాల్సిందే: రాహుల్ రామక‌ృష్ణ

  కొరటాల శివ, రాజమౌళి అలా ఉండమన్నారు.. 2020 వరకు భరించాల్సిందే: రాహుల్ రామక‌ృష్ణ

  అర్జున్ రెడ్డితో స్టార్ కమెడియన్‌గా మారిన రాహుల్ రామకృష్ణ టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల వచ్చిన చిలసౌ, భరత్ అనే నేను ఆయన నటనా ప్రతిభకు అద్దపట్టాయి. ప్రస్తుతం హుషారుతోపాటు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీలో నటిస్తున్నారు. హుషారు సినిమా డిసెంబర్ 14న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రాహుల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   సుదీర్ఘమైన అనుబంధం.. దూరమయ్యే సమస్యే లేదు.. ఇన్స్‌టాగ్రామ్‌లో సమంత

  సుదీర్ఘమైన అనుబంధం.. దూరమయ్యే సమస్యే లేదు.. ఇన్స్‌టాగ్రామ్‌లో సమంత

  పెళ్లి తర్వాత కూడా సమంత అక్కినేని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. 2018లో నాలుగు బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేసింది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ చిత్రాలు ఆమె కెరీర్‌లోనే భారీ విజయాలుగా నమోదు చేసుకొన్నాయి. పెళ్లి అయితే హీరోయిన్లుగా పనికిరారనే అపోహను సమంత కొట్టిపారేసింది. తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టును ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టగా నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అదేమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బస్ డ్రైవర్ కొడుకు అని చెప్పగానే.. ఆర్ఆర్ఆర్ కోసం వెళ్ళా, మతిపోయింది.. రాజమౌళి!

  బస్ డ్రైవర్ కొడుకు అని చెప్పగానే.. ఆర్ఆర్ఆర్ కోసం వెళ్ళా, మతిపోయింది.. రాజమౌళి!

  కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం హిందీతో పాటు దక్షణాది భాషలన్నింటిలో విడుదలకు సిద్ధం అవుతోంది. యష్ గురించి అంతటా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. యష్ లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగే లక్షణాలు ఉన్నాయంటూ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కెజిఎఫ్ ట్రైలర్స్ విడుదలై అదరగొడుతున్నాయి. ఆదివారం రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  'అతడు' సినిమాకు బ్లాంక్ చెక్ ఇచ్చా.. కుదరదని చెప్పారు, ఆయన గొప్పతనం అదే!

  'అతడు' సినిమాకు బ్లాంక్ చెక్ ఇచ్చా.. కుదరదని చెప్పారు, ఆయన గొప్పతనం అదే!

  తెలుగు చలనచిత్ర రంగంలో సోగ్గాడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శోభన్ బాబు మాత్రమే. అప్పట్లోనే మహిళల్లో ఎక్కువ క్రేజ్ పొందిన హీరో శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలకు శోభన్ బాబు పెట్టింది పేరు. ఒక దశలో శోభన్ బాబు సినిమాల నుంచి తనకు తానుగా రిటర్మెంట్ ప్రకటించుకున్నారు. ఆ తరువాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంత బలమైనవో దీనిని బట్టే అర్థం అవుతుంది. శోభన్ బాబు సేవ సమితి పేరుతో ఆయన అభిమానులు సినీ పురస్కారాలు అందించాలని నిర్ణయించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లో తొలిసారి ఘనంగానిర్వహించబోతున్నారు. ఈ వేడుక గురించి చర్చించడానికి మురళి మోహన్ హాజరయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆ పనికి తప్ప మగాళ్లు మాకు అవసరం లేదు.. ప్రియాంక చోప్రాపై ఘాటు వ్యాఖ్యలు!

  ఆ పనికి తప్ప మగాళ్లు మాకు అవసరం లేదు.. ప్రియాంక చోప్రాపై ఘాటు వ్యాఖ్యలు!

  ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్నప్పటి నుంచి ఎదో ఒక రూపంలో విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. డిసెంబర్ 1న ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు అధికారికంగా ఒక్కటయ్యారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాలలో ప్రియాంక వివాహం జరిగింది. ప్రియాంక, నిక్ వివాహం జరగగానే ఓ అంతర్జాతీయ సంస్థ జర్నలిస్ట్ ప్రియాంకపై విషం కక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎప్పటికైనా చిరంజీవే కింగ్.. మళ్ళీ ప్రూవ్ అయింది.. బాలయ్యని వెనక్కు నెట్టిన నాని!

  ఎప్పటికైనా చిరంజీవే కింగ్.. మళ్ళీ ప్రూవ్ అయింది.. బాలయ్యని వెనక్కు నెట్టిన నాని!

  తెలుగు వెండి తెరపై ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి రారాజే. 8 ఏళ్ల గ్యాప్ తరువాత వచ్చిన చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంతో రికార్డులు తిరగరాశారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అభిమానుల్లో మెగాస్టార్ కు ఉండే క్రేజ్ ఏంటో మరోమారు రుజువైంది. ఇయర్ ఎండింగ్ కావడంతో ఈ ఏడాది నమోదైన రికార్డులన్నీ పరిశీలనలోకి వస్తున్నాయి. ఈ ఏడాది సౌత్ ఇండియాలో సినీ స్టార్స్ కేటగిరిలో ఎక్కువమంది గూగుల్ లో వెతికిన స్టార్ గా చిరంజీవి నిలిచారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్లి కాకముందే.. బావ మోసం చేశాడని కేసు పెట్టిన తార చౌదరి!

  పెళ్లి కాకముందే.. బావ మోసం చేశాడని కేసు పెట్టిన తార చౌదరి!

  సినీనటి తారా చౌదరి గతంలో అనేక వివాదాల్లో చిక్కుకుంది. సెక్స్ రాకెట్ నడిపిందనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో తనకు సంబంధాల ఉన్నట్లు చెప్పిన తారా చౌదరి వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు. ఈ కేసు వ్యవహారాలు సద్దుమణిగాక తారా చౌదరి తన జీవితాన్ని తాను సాగిస్తోంది. మరోమారు తారా చౌదరి పోలీసు కేసు వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కింది. ఇది పూర్తిగా తారా చౌదరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. తనకు బావ వరసయ్యే వ్యక్తి ఒకరు మోసం చేశాడని తారా చౌదరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  I am very happy showing sex said ekta kapoor, devoleena bhattacharjee murder case, naga babu opens up about pawan kalyan marriages, posani krishna murali satirical comments on balakrishna, bhavya anand prasad babu mohan reshma rathod lost telangana elections.. Trending articles December 3rd week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X