For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: హోటల్‌తో హరికృష్ణకు లింకు, కలిసిరాని నెంబర్, కౌశల్ ఆర్మీ సంచలనం, పూజ విడాకులు!

  By Bojja Kumar
  |

  భర్తతో విడిపోయా, బాయ్ ఫ్రెండుతో రిలేషన్లో ఉన్నానని చెప్పిన బిగ్‌బాస్ 2' పూజా రామచంద్రన్... హరికృష్ణ మరణంతో విషాదం, హరికృష్ణకు ఆ హోటల్ రూముకు లింకేంటి? ముందే కీడు శంకించారా?... వెంట్రుక కూడా పీకలేరంటున్న కౌశల్ ఆర్మీ.. చిరంజీవి పోస్టర్ వేస్తే నష్టం తగ్గేదేమో? ఆస్తులన్నీ అమ్ముకున్నామని చెప్పిన జయసుధ.. నేను వెళ్తున్నా జాగ్రత్తగా చూసుకో కంటతడి పెట్టిస్తున్న హరికృష్ణ మాటలు.. ఎన్టీఆర్ ఎదురించాడు, హరికృష్ణ తలవంచాడు, కలిసిరాని ఆ నెంబర్.. మరణించిన మైఖేల్ జాక్సన్ సంపాదన చూస్తే షాకే రికార్డుస్థాయిలో ఆదాయం!... ఇలా పలు అంశాల గడిచిన వారంలో బాగా ట్రెండ్ అయ్యాయి. అందుకు సంబంధించిన అంశాలు మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

  భర్తతో విడిపోయా, బాయ్ ఫ్రెండుతో రిలేషన్లో ఉన్నా: ‘బిగ్‌బాస్ 2' పూజా రామచంద్రన్

  భర్తతో విడిపోయా, బాయ్ ఫ్రెండుతో రిలేషన్లో ఉన్నా: ‘బిగ్‌బాస్ 2' పూజా రామచంద్రన్

  'బిగ్ బాస్ 2' రియాల్టీ షో ద్వారా తెలుగు వారికి మరింత దగ్గరైంది చెన్నై బ్యూటీ పూజా రామచంద్రన్. గతవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన ఈ బ్యూటీ మీడియా ఇంటర్వ్యూలో బిజీ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు పెళ్లి, విడాకుల గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందిస్తూ... తనకు గతంలో పెళ్లయిందని, అయితే విడాకులై దాదాపు రెండున్నరేళ్లు దాటిందని అన్నారు. ప్రస్తుతం తన జీవితంలో కొత్త వ్యక్తి ఉన్నారని తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హరికృష్ణకు ఆ హోటల్ రూముకు లింకేంటి? ముందే కీడు శంకించారా?

  హరికృష్ణకు ఆ హోటల్ రూముకు లింకేంటి? ముందే కీడు శంకించారా?

  నందమూరి హరికృష్ణ మరణం తర్వాత అబిడ్స్‌లోని 'ఆహ్వానం' హాటల్ చర్చనీయాంశం అయింది. ఇక్కడ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకు కారణం... ఈ హోటల్‌లోని రూమ్ నెం. 1001లో హరికృష్ణ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వెళ్లి 10 గంటల వరకు అక్కడ గడపటం, మళ్లీ భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు గడపటం ఆయనకు అలవాటు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వెంట్రుక కూడా పీకలేరు: బిగ్‌బాస్ 2 నిర్వాహకులపై విరుచుకుపడ్డ కౌశల్ ఆర్మీ!

  వెంట్రుక కూడా పీకలేరు: బిగ్‌బాస్ 2 నిర్వాహకులపై విరుచుకుపడ్డ కౌశల్ ఆర్మీ!

  బిగ్ బాస్ తెలుగు 2 షోకు సంబంధించిన ఓటింగ్ విషయంలో ఇటీవల సాంకేతిక సమస్య తలెత్తడంతో కౌశల్ అభిమానులు ఫైర్ అయ్యారు. కౌశల్‌ను టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఎవరు ఏం చేసినా వెంట్రుక కూడా పీకలేరు... అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చిరంజీవి పోస్టర్ వేస్తే నష్టం తగ్గేదేమో? ఆస్తులన్నీ అమ్ముకున్నాం: జయసుధ

  చిరంజీవి పోస్టర్ వేస్తే నష్టం తగ్గేదేమో? ఆస్తులన్నీ అమ్ముకున్నాం: జయసుధ

  ఇపుడు నటిగా మాత్రమే కొనసాగుతున్న జయసుధ గతంలో పలు చిత్రాలు నిర్మించారు. వాటి ద్వారా చాలా నష్టపోయారు. ఆమె చివరగా నిర్మించిన చిత్రం ‘హ్యాండ్సప్'లో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. ఆయన పోస్టర్ వేసినా సినిమా ఆడేదేమో? వేయ పోవడంతో ఓపెనింగ్స్ రాలేదు. ఇలా ప్రతి సినిమాకు ఒక్కొక్క ప్రాపర్టీ ఎగిరిపోతూ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇన్వెస్టిగేషన్ చేస్తే కౌశల్ ఆర్మీ బండారం బయట పడుతుంది: బాబు గోగినేని

  ఇన్వెస్టిగేషన్ చేస్తే కౌశల్ ఆర్మీ బండారం బయట పడుతుంది: బాబు గోగినేని

  బిగ్‌బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన హేతువాది బాబు గోగినేని కౌశల్ ఆర్మీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కౌశల్ ఆర్మీ అభిమానులతో ఏర్పడింది కాదని, దాన్ని క్రియేట్ చేశారి, ఇన్వెస్టిగేషన్ చేస్తే వారి బండారం మొత్తం బయట పడుతుందన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నేను వెళ్తున్నా.. జాగ్రత్తగా చూసుకో.. కంటతడి పెట్టిస్తున్న హరికృష్ణ మాటలు!

  నేను వెళ్తున్నా.. జాగ్రత్తగా చూసుకో.. కంటతడి పెట్టిస్తున్న హరికృష్ణ మాటలు!

  గత 17 ఏళ్ల నుంచి ఆహ్వానం హోటల్‌లో సేవలందిస్తున్న రమణయ్య.. హరికృష్ణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సార్‌కు ప్రతీది నేనే చూసుకొనే వాడిని అని చెప్పారు. సిబ్బందితో హరికృష్ణ చెప్పిన విషయాలు ఉద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి. అవేమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ ఎదురించాడు.. హరికృష్ణ తలవంచాడు!.. కలిసిరాని ఆ నెంబర్!

  ఎన్టీఆర్ ఎదురించాడు.. హరికృష్ణ తలవంచాడు!.. కలిసిరాని ఆ నెంబర్!

  నందమూరి జానకి రాం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ 2014 డిసెంబర్ 6వ తేదీన నల్గొండలోని ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో జానకిరాం మృత్యువాత పడ్డారు. తాజాగా హరికృష్ణను మృత్యువు వెంటాడింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హంతకురాలు గీతా మాధురి..

  హంతకురాలు గీతా మాధురి..

  బిగ్‌బాస్ రియాలిటీ షో ముగింపుకు చేరుకుంటున్న నేపథ్యంలో సెలబ్రిటీల మధ్య పోటీ పెరిగింది. ఆయా వ్యక్తుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. తమను తాము రక్షించుకొనేందుకు ఇంటి సభ్యులు ఎవరికి వారే వ్యూహాలు పన్నుతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మరణించిన మైఖేల్ జాక్సన్ సంపాదన చూస్తే షాకే.. రికార్డుస్థాయిలో ఆదాయం!

  మరణించిన మైఖేల్ జాక్సన్ సంపాదన చూస్తే షాకే.. రికార్డుస్థాయిలో ఆదాయం!

  మైఖేల్ జాక్సన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. ఆయన మరణించక ముందు కంటే చనిపోయిన తర్వాత ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగిందట. యూట్యూబ్, తదితర మాధ్యమాలలో ఆయన క్రేజ్ ఇప్పటికీ ఆకాశమంత ఉందట. కళ్లు చెదిరేలా ఉన్న మైఖేల్ సంపాదన గురించి తెలుసుకొందాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ ఇంటికి విద్యాబాలన్.. సెంటిమెంట్ కోసం అక్కడికి.. బాలయ్య ఎమోషనల్!

  ఎన్టీఆర్ ఇంటికి విద్యాబాలన్.. సెంటిమెంట్ కోసం అక్కడికి.. బాలయ్య ఎమోషనల్!

  క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని కలిగించింది. అదేమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఒక్క ఫోటోతో జీవితమే మారిపోయింది.. ఆటోలో వచ్చి చులకనగా, లెజెండ్ ఛాన్స్.. జగపతి బాబు!

  ఒక్క ఫోటోతో జీవితమే మారిపోయింది.. ఆటోలో వచ్చి చులకనగా, లెజెండ్ ఛాన్స్.. జగపతి బాబు!

  విలన్ పాత్రల్లో జగపతి బాబు ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఆయనకు ఇది సెకండ్ ఇన్నింగ్స్. కెరీర్ ఆరంభంలో కుటుంబకథా చిత్రాలతో అలరించిన జంగపతి బాబు ఇలా విలన్ గా మెప్పిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు విలన్ గా తన అవకాశాలు గురించి వివరించారు. చాలా కాలం పాటు అవకాశాలు లేక తన పరిస్థితి ఎలా మారిందో తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  నూతన్ సీక్రెట్స్ లీక్ చేసిన శ్యామల

  నూతన్ సీక్రెట్స్ లీక్ చేసిన శ్యామల

  నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 లో ప్రతివారం ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ అంత్యంత రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు. ఆడియన్స్ కు వినోదంతో పాటు ఆసక్తిని రేకెత్తించేలా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ నిర్వహించారు. ఈవారం నామినేషన్ ఎలా జరిగింది. ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇపుడు తెలుసుకుందాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  తండ్రిని మోస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

  తండ్రిని మోస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

  నందమూరి కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. బుధవారం ఉదయం హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఇలాంటి విషాదకర వార్త వినాల్సి వస్తుందని ఊహించి ఉండరు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే వివాహ కార్యక్రమానికి బయలుదేరిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్య కామినేని ఆసుపత్రికి వెళ్లి హరికృష్ణ మృత దేహానికి నివాళులు అర్పించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  డ్రైవర్‌కు షరతులు పెట్టిన హరికృష్ణ

  డ్రైవర్‌కు షరతులు పెట్టిన హరికృష్ణ

  నందమూరి హరికృష్ణ అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్నే మిగిల్చింది. హైదరాబాద్ ముంచి నెల్లూరుకు వెళుతూ నల్గొండ సమీపంలో ప్రమాదానికి గురై హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. నేడు ఆయన అంత్య క్రియలు ప్రభుత్వలాంఛనాలతో జరగనున్నాయి. ఇదిలా ఉండగా తనకు అత్యంత ఇష్టమైన డ్రైవింగ్ వలనే ఆయన ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఇది కౌశల్ అంటే

  ఇది కౌశల్ అంటే

  బిగ్ బాస్ షోలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో తిరుగులేదనుకున్న కౌశల్ గీత వలన ఈ సీజన్ మొత్తం నామినేషన్ కు గురయ్యాడు. ఈ పరిణామాన్ని ఆడియన్స్ ఊహించలేదు. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరుగుతోంది. టైటిల్ బరిలో నిలిచేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు జరగబోయే ఎపిసోడ్ మరింత ఉత్కంఠ భరితంగా సాగనుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజగా విడుదుల చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  English summary
  Harikrishna death, NTR, Kalyan Tam, Bigg Boss 2, Jayasudha, Koushal Army, Jagapathi Babu, Babu Gogineni and others are became in top news . Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X