For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: శ్రీముఖి చెంపచెల్లుమనిపించిన కమెడియన్, కియారాకు చెప్పుకోలేని చోట టాటూ.. చిరంజీవి మూవీలో గద్దర్!

  |

  దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవితోపాటు గద్దర్ నటిస్తున్నారనే విషయం వైరల్‌గా మారాయి. అలాగే కియారా ప్లాస్టిక్ సర్జరీ వ్యవహారం.. కార్తీకదీపం సీరియల్‌లో అవినాష్, శ్రీముఖి టిక్ టాక్ వీడియో టాప్‌ న్యూస్‌గా మారాయి. ఆ వివరాలోకి వెళితే..

  రాజమౌళికి అంటు రోగం కాదు అదో వ్యాధి.. నరకాసురుడు.. ఎన్టీఆర్, రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

  రాజమౌళికి అంటు రోగం కాదు అదో వ్యాధి.. నరకాసురుడు.. ఎన్టీఆర్, రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఎవరు మీలో కోటీశ్వరులు ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైంది. తొలివారంలో కర్టెన్ రైజర్‌లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి, RRR సినిమా విశేషాల గురించి రాంచరణ్‌, ఎన్టీఆర్ ఆసక్తిగా చర్చించుకొన్నారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించబడిన మొట్టమొదటి భారతీయ చిత్రం బాహుబలి: ది బిగినింగ్ చిత్రం గురించి రాంచరణ్, ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ.. జక్కన హార్డ్ వర్క్, ఫర్‌ఫెక్షన్ గురించి మాట్లాడుతూ..

  God Father లో గద్దర్!.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ప్రజా యుద్ధనౌక!

  God Father లో గద్దర్!.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ప్రజా యుద్ధనౌక!

  మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటించగా, ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ చిత్రంలో గద్దర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారనే విషయం అత్యంత చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ చిత్ర వివరాల్లోకి వెళితే..

   హీరో శ్రీకాంత్ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ .. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి!

  హీరో శ్రీకాంత్ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ .. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి!

  తెలుగు సినీ పరిశ్రమలో తారల కుమార్తెలు మాత్రం వారసులుగా వచ్చిన వారు చాలా తక్కువే అనే చెప్పాలి. ఆ విధంగా వచ్చిన వారిలో మంచు లక్ష్మి ప్రసన్న, మంజుల ఘట్టమనేని, నిహారిక కొణిదెల, శివాత్మిక, శివాని వంటి వారిని గురించి చెప్పుకోవచ్చు. కాగా వీరిలో ప్రస్తుతం ఎవరికి వారు తమ టాలెంట్స్ తో ముందుకు కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే మరొక సీనియర్ హీరో వారసురాలు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.

  ఆ వివరాలోకి వెళితే..

  ఒక్క రోజు లేటైనా చచ్చిపోయేవాడిని.. ఆ హీరో నాకు ప్రాణం పోశాడు: బండ్లగణేష్

  ఒక్క రోజు లేటైనా చచ్చిపోయేవాడిని.. ఆ హీరో నాకు ప్రాణం పోశాడు: బండ్లగణేష్

  బండ్ల గణేష్ నిర్మాతగా మొదట్లోనే అగ్రహీరోలతో వర్క్ చేశాడు. దీంతో అతనికి స్టార్ ప్రొడ్యూసర్ గా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కింది. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలు నిర్మించేందుకు వెనుకడుగు వేస్తున్న బండ్లగణేష్ మళ్లీ పవర్ ఫుల్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అయితే సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ కొన్ని ఇంటర్వ్యూలతో జనాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఒక చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు అందుకు సంబంధించిన ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
  ఆ వివరాలోకి వెళితే..

  యాంకర్ సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. మెగాస్టార్ వల్లే కాలేదు: లైవ్ లోనే త్రివిక్రమ్ హెచ్చరిక

  యాంకర్ సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. మెగాస్టార్ వల్లే కాలేదు: లైవ్ లోనే త్రివిక్రమ్ హెచ్చరిక

  సినిమా ఈవెంట్స్ కు ఎంతమంది వచ్చినా కూడా త్రివిక్రమ్ స్పీచ్ కోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సందర్భం ఏదైనా సరే దానికి తగ్గట్టుగా ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచింపజేసే విధంగా మాటల బాణాలను వదులుతుంటారు. ఇక రీసెంట్ గా సుశాంత్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో మరోసారి తన స్పీచ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈ వేడుకలో యాంకర్ సుమపై కొన్ని పంచులు వేసే అందర్నీ నవ్వించారు. ఆమెను తట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవి వల్ల కూడా కాలేదు అని . కాబట్టి ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా స్టేజ్ పైన ఓపెన్ గా చెప్పేశారు.
  ఆ వివరాలోకి వెళితే..

   200 కోట్ల కుంభకోణం ఉచ్చులో హీరోయిన్.. కొరడా విదిలిస్తున్న ఈడీ

  200 కోట్ల కుంభకోణం ఉచ్చులో హీరోయిన్.. కొరడా విదిలిస్తున్న ఈడీ

  ఢిల్లీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అతిపెద్ద దోపిడీ రాకెట్‌ న్యూస్ ఇటీవల హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తీవ్ర స్థాయిలో విచారణను జరుపుతున్నారు. ఏ మాత్రం పట్టు విడువకుండా టాప్ సెలబ్రేటీలను సైతం ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
  ఆ వివరాలోకి వెళితే..

  లెజెండ్ విషయంలో మోసం చేశారు..నేను ఎందుకు ఎక్కి తొక్కించుకోవాలి?.. జగపతిబాబు

  లెజెండ్ విషయంలో మోసం చేశారు..నేను ఎందుకు ఎక్కి తొక్కించుకోవాలి?.. జగపతిబాబు

  ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు కెరీర్ అర్ధంతరంగా ముగిసిన పరిస్థితి. మళ్లీ ఆయన లెజెండ్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నిలదొక్కుకున్నాడు.. అయితే జగపతిబాబు లెజెండ్ సినిమాలో చేసిన పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లెజెండ్ లాంటి సినిమా మళ్లీ చేయను అని ఆయన చెబుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. అసలు ఈ ఉదంతం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  అల్లు అర్జున్ హీరో కావడమే చిరంజీవికి పెద్ద షాక్.. సినీ చరిత్రలోనే బన్నీ గ్రేట్.. RGV షాకింగ్‌ కామెంట్స్

  అల్లు అర్జున్ హీరో కావడమే చిరంజీవికి పెద్ద షాక్.. సినీ చరిత్రలోనే బన్నీ గ్రేట్.. RGV షాకింగ్‌ కామెంట్స్

  మెగా ఫ్యామిలీలోని వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ వాళ్లంతా చిరంజీవి మీద ఆధారపడే హీరోలు. చిరంజీవి కారణంగానే వాళ్లకు సక్సెస్ లభించింది. కానీ అల్లు అర్జున్ స్వయంగా హీరోగా ఎదిగాడు. చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు అల్లు అర్జున్ దూరంగా ఉండటం ఆయన తెలివికి నిదర్శనం అంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఇండస్ట్రీలోను, సోషల్ మీడియాలోను దుమారం సృష్టించాయి. తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా టెలివిజన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ తన వ్యాఖ్యల్లో తప్పు లేదని వెల్లడించారు. ఆర్జీవి చెప్పిన మాటలు ఏమిటంటే..

   Kiara Advani కి చెప్పలేని చోట ప్లాస్టిక్ సర్జరీ.. ఆ విషయం చెప్పాలంటే భయం అంటూ..

  Kiara Advani కి చెప్పలేని చోట ప్లాస్టిక్ సర్జరీ.. ఆ విషయం చెప్పాలంటే భయం అంటూ..

  బాలీవుడ్ నటి కియారా అద్వానీ తాజాగా నటించిన సినిమా షేర్‌షా రిలీజ్ కావడంతో ఆమె కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సూపర్‌హిట్ సినిమాల్లో భాగం అయిన ఆమె బాలీవుడ్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కియారా అద్వానీ తన చిన్న బాలీవుడ్ కెరీర్‌లో అక్షయ్ కుమార్‌తో పాటు షాహిద్ కపూర్‌తో రెండుసార్లు పని చేసింది. కానీ ఇంత విజయవంతం అయిన తర్వాత కూడా, కియారా అద్వానీ తనను తీవ్రంగా ట్రోల్ చేసే ట్రోలర్‌ల బారిన పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఈ అంశం మీద నోరు విప్పింది ఆ వివరాల్లోకి వెళితే

  Shama Sikander.. ఫోటోషూట్ కోసం న్యూడ్‌గా హీరోయిన్.. తట్టుకోలేనంత దిగంబరంగా? అంటూ కామెంట్స్

  Shama Sikander.. ఫోటోషూట్ కోసం న్యూడ్‌గా హీరోయిన్.. తట్టుకోలేనంత దిగంబరంగా? అంటూ కామెంట్స్

  బాలీవుడ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్న అందాల తార షామా సికందర్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. టెలివిజన్, సినీ పరిశ్రమలో తనదైన శైలిలో రాణించేందుకు ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగమ్మ ప్రతిభ కంటే గ్లామర్‌నే నమ్ముకొన్నట్టు కనిపిస్తున్నది. తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలతో హంగామా సృష్టిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా దిగంబరంగా మారిన ఫోటోషూట్ ఇంటర్నెట్‌ను హీటెక్కించింది. షమా సికందర్ తాజా ఫోటోషూట్, సినీ కెరీర్ గురించిన విషయాల్లోకి వెళితే..

  Sreemukhi చెంప చెళ్లుమనిపించిన అవినాష్.. ఆ తరువాత ఎమోషనల్ హగ్!

  Sreemukhi చెంప చెళ్లుమనిపించిన అవినాష్.. ఆ తరువాత ఎమోషనల్ హగ్!

  బుల్లితెరపై నిత్యం సందడి చేసే వారిలో శ్రీముఖి ఒకరు. యాంకర్ గానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు అందుకున్న శ్రీముఖి ఎలాంటి షో చేసినా కూడా టెలివిజన్ వరల్డ్ లో ఒక ప్రత్యేకమైన బజ్ క్రియేట్ చేస్తుంది.
  శ్రీముఖికి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో ముక్కు అవినాష్ కూడా ఉన్నారు. ముక్కు అవినాష్ - శ్రీముఖి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో ప్రత్యేకమైన షోలు మంచి రేటింగ్స్ అందుకున్నాయి. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీరు చేసే సందడి మామూలుగా ఉండదు. రీసెంట్ గా వీరు ఇన్స్టాగ్రామ్ లో చేసిన రీల్ ఒకటి వైరల్ గా మారింది.

  ఆ వివరాలోకి వెళితే..

  Suryasthamayam Movie Impresses Producer Raj Kandukuri
  అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

  అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన అతడు.. పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో స్టార్ స్టేటస్‌ను సైతం దక్కించుకున్నాడు.

  English summary
  Surekha Vani, Ananya Nagalla, Nayanathara, Sreemukhi, Pooja Hegde in top news are in top news Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X