For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending: రోజా ముందే అర్ధనగ్నంగా..నా చేయి పట్టుకుని అలా అనేసింది.. హీరోయిన్‌కు ఫ్యాన్ ముద్దు పెట్టబో

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సంక్రాంతి సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్లు, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  రోజా ముందే షర్ట్ విప్పేసిన సీనియర్ హీరో.. అనసూయ ఫీలింగ్స్! వైరల్ వీడియో

  రోజా ముందే షర్ట్ విప్పేసిన సీనియర్ హీరో.. అనసూయ ఫీలింగ్స్! వైరల్ వీడియో

  జబర్దస్త్ కామెడీ షో.. ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తున్న ఈ షో టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చిన్ని తెరపై ఇంటింటా జబర్దస్తీ చేస్తూ భారీ టీఆర్ఫీ రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. ప్రతీ పండగకు ఏదో ఒక స్పెషల్ ఎపిసోడ్‌తో కిక్కిచ్చే ఈ కామెడీ షో.. సంక్రాంతికి సరిపోయేంత ఫన్ క్రియేట్ చేయబోతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. వివరాల్లోకిపోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రష్మిక మందన్న సడెన్ ఎంట్రీ.. ఆడియన్స్ రియాక్షన్.. చివరకు 'సరిలేరు నీకెవ్వరు'!

  రష్మిక మందన్న సడెన్ ఎంట్రీ.. ఆడియన్స్ రియాక్షన్.. చివరకు 'సరిలేరు నీకెవ్వరు'!

  విడుదల రోజే సినిమా చూడటమంటేనే ఓ కిక్కు. అలాంటిది ఆ సినిమా హీరోయిన్‌తో అలా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే ఆ కిక్కు మారేలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్నారు హైదరాబాదీ ప్రేక్షకులు. సిటీలోని ఓ థియేటర్‌లో సడెన్ ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న. కాకపోతే ఆమె ఎంట్రీ కొందరు అభిమానులకు నిరాశ కలిగించింది. వినడానికి విడ్డురంగా ఉంది కదూ! ఈ స్టోరీ చూడండి మీకే తెలుస్తుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆమె నా చేయి పట్టుకుని అలా అనేసింది.. దీంతో ఆ రోజంతా.. హీరోయిన్‌పై రాహుల్‌ రామకృష్ణ కామెంట్

  ఆమె నా చేయి పట్టుకుని అలా అనేసింది.. దీంతో ఆ రోజంతా.. హీరోయిన్‌పై రాహుల్‌ రామకృష్ణ కామెంట్

  అతితక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ తెచ్చుకున్నాడు కమెడియన్ రాహుల్‌ రామకృష్ణ. తనదైన మాటలతో, యాక్టింగ్‌తో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ఆయన ప్రస్తుతం వరుస అవకాశాలు పట్టేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఆయన సీనియర్ హీరోయిన్‌తో జరిగిన ఆసక్తికర సంఘటన పంచుకున్నాడు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మహేష్ టీమ్‌కి ఊహించని షాక్.... ఆన్‌లైన్‌లో 'సరిలేరు నీకెవ్వరు' పైరసీ! సూపర్ స్టార్ రిక్వెస్ట్

  మహేష్ టీమ్‌కి ఊహించని షాక్.... ఆన్‌లైన్‌లో 'సరిలేరు నీకెవ్వరు' పైరసీ! సూపర్ స్టార్ రిక్వెస్ట్

  సినీ పరిశ్రమను ఎప్పటినుంచో పట్టి పీడిస్తోన్న అంశం పైరసీ. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంటారు పైరసీ రాయుళ్లు. ఈ పైరసీ ఇష్యూపై ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా ఆ కేటుగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా పైరసీ ఉచ్చులో చిక్కుకోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన నింపుతోంది. పూర్తి వివరాలు చూస్తే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రీమియర్స్‌తోనే ఆ ఫీట్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా సూపర్ స్టార్ రేంజ్

  ప్రీమియర్స్‌తోనే ఆ ఫీట్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా సూపర్ స్టార్ రేంజ్

  సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. వరుసగా బాక్సాఫీస్‌పై దాడి చేస్తున్న మహేష్ బాబు.. రికార్డులను తరిమి తరిమి కొడుతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు.. ఓవర్సీస్‌లోనూ మార్కెట్ పెంచుకున్నాడు. ఓవర్సీస్‌లో అత్యధిక మార్కెట్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో మహేష్ ఒకడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  స్థానం ఇవ్వగలం.. స్థాయిని తెచ్చుకోవాలి.. అదే అల వైకుంఠపురములో థీమ్.. త్రివిక్రమ్ కామెంట్స్

  స్థానం ఇవ్వగలం.. స్థాయిని తెచ్చుకోవాలి.. అదే అల వైకుంఠపురములో థీమ్.. త్రివిక్రమ్ కామెంట్స్

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి చేసిన చిత్రం అల వైకుంఠపురములో. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి రెండు హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు అల వైకుంఠపురములోతో రాబోతోన్నారు. ఇప్పటికే పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసింది అల వైకుంఠపురములో. ఇక టీజర్, ట్రైలర్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి 12న రాబోతోన్న ఈ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్న త్రివిక్రమ్.. అనేక ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  l

  భారీ అంచనాలతో సరిలేరు.. ఫస్ట్ డే మహేష్ ఎంత కొల్లగొడతాడంటే..?

  భారీ అంచనాలతో సరిలేరు.. ఫస్ట్ డే మహేష్ ఎంత కొల్లగొడతాడంటే..?

  సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఎంతటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్‌తో హిట్ కొట్టగా మహేష్ బాబును సరిలేరు నీకెవ్వరులా చూపించేందుకు వచ్చాడు. గతేడాది సంక్రాంతికి ఎఫ్2తో వచ్చిన అనిల్ రావిపూడి.. ఈసారి సరిలేరు అంటూ వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్లు అంటూ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   హీరోయిన్‌కు షాకిచ్చిన యువకుడు.. ఫొటో దిగడానికని వచ్చి ముద్దివ్వబోయాడు.!

  హీరోయిన్‌కు షాకిచ్చిన యువకుడు.. ఫొటో దిగడానికని వచ్చి ముద్దివ్వబోయాడు.!

  స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. తన తండ్రి పేరును నిలబెట్టేందుకు ఆమె ఎంతగానో శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటోంది. అందంతో పాటు అభినయం ఉన్న నటి కావడంతో సారా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో ఆమెకు ఓ అభిమాని మరిచిపోలేని షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది.?

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాబోయ్ ఇదేం డ్రెస్: స్టార్ హీరోయిన్‌ను అందులో చూసి అవాక్కవుతున్న సినీ ప్రియులు

  బాబోయ్ ఇదేం డ్రెస్: స్టార్ హీరోయిన్‌ను అందులో చూసి అవాక్కవుతున్న సినీ ప్రియులు

  భారతదేశంలోని ఉన్న చాలా ఇండస్ట్రీల్లో సినిమాలు చేసింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ సినిమాలో తనదైన ముద్రను వేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో చాలా కాలం పాటు కొనసాగింది. అందంతో పాటు అభినయంలోనూ ఆకట్టుకునే నటి కావడంతో ఈమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా సుపరిచితురాలు అయిపోయింది. కొన్నేళ్ల నుంచి ప్రియాంక ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ప్రియాంక వేసుకున్న డ్రెస్సే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Sri Reddy Open Offer Goes Viral || మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తా
  ఇంట్రెస్టింగ్: ‘ఢీ' షో నుంచి యాంకర్ ప్రదీప్ ఔట్.. అక్కడ ఎంట్రీ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం.!

  ఇంట్రెస్టింగ్: ‘ఢీ' షో నుంచి యాంకర్ ప్రదీప్ ఔట్.. అక్కడ ఎంట్రీ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం.!

  తెలుగు బుల్లితెర హిస్టరీలో కొంత మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో చాలా కాలం నుంచి యాంకరింగ్‌లో తనదైన ముద్రను వేస్తున్న ప్రదీప్ మాచిరాజు ఒకడు. తెలుగు రాష్ట్రాల్లో అతడికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్లుగా ఎన్నో టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ టీవీ రంగంలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు చాలా షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఫేమస్ షో నుంచి ప్రదీప్ తప్పుకున్నాడు. దీంతో మరోసారి అతడు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగింది.?

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X