For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: అతడిని చంపేసి, బన్నీతో చెక్కేస్తా.. ఆ ఇద్దరి తర్వాతే చిరు.. డైరెక్టర్‌పై శ్రీరెడ్డి షాక్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, చిరంజీవి, జగన్ లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  జగన్‌తో చిరంజీవి భేటీ.. క్లారిటీ వచ్చేసింది.. అదే నిర్ణయం తీసుకోనున్నారా..?

  జగన్‌తో చిరంజీవి భేటీ.. క్లారిటీ వచ్చేసింది.. అదే నిర్ణయం తీసుకోనున్నారా..?

  ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  సైరాకు కలిసొచ్చేలా ముఖ్యమంత్రి డిసీజన్.. సై సైరా అంటూ మెగా డిస్ట్రిబ్యూటర్లు!

  సైరాకు కలిసొచ్చేలా ముఖ్యమంత్రి డిసీజన్.. సై సైరా అంటూ మెగా డిస్ట్రిబ్యూటర్లు!

  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' జోష్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సరిగ్గా ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోబోతున్న ఓ నిర్ణయం 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు బాగా కలిసొస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంతకీ ముఖ్యమంత్రి తీసుకోనున్న ఆ నిర్ణయం ఏంటి? సైరాకు ఎలా ప్లస్ అవుతుంది? వివరాల్లోకి పోతే..


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  తమన్నా క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన చిరంజీవి.. అందరూ అలా అనుకుంటారు కానీ!

  తమన్నా క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన చిరంజీవి.. అందరూ అలా అనుకుంటారు కానీ!

  మిల్క్ బ్యూటీ తమన్నాపై చిరంజీవి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవలే విడుదలైన చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరోసారి ఎలుగెత్తి చాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కళా బంధు టీ. సుబ్బిరామిరెడ్డి సైరా యూనిట్ పై అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి.. తమన్నా క్యారెక్టర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  టాలీవుడ్ డైరెక్టర్‌పై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

  టాలీవుడ్ డైరెక్టర్‌పై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

  సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి విరుచుపడింది. తన రెగ్యులర్ స్టైల్ లోనే ఓ పోస్ట్ పెట్టి మరోసారి హాట్ హాట్ చర్చలకు కారణమైంది. అదును దొరికితే చాలు అడ్డంగా బుక్ చేసేద్దాం అన్నట్లుగా దూసుకుపోతున్న శ్రీ రెడ్డి.. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసింది అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం సెన్సేషన్‌గా మారింది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  చిరంజీవి అంటే జెలసీ ఎందుకు?.. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి.. తమ్మారెడ్డి ఫైరింగ్ కామెంట్స్

  చిరంజీవి అంటే జెలసీ ఎందుకు?.. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి.. తమ్మారెడ్డి ఫైరింగ్ కామెంట్స్

  సైరా నరసింహా రెడ్డి సినిమా విషయమై దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ చూసిన కొందరు తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయనను ట్రోల్ చేశారు. దీంతో తాజాగా మరో వీడియో రూపంలో ఈ విషయంపై మాట్లాడుతూ తనను ట్రోల్ చేసిన వారికి చురకలంటించారు తమ్మారెడ్డి. ఆ వివరాలు చూస్తే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  రంగంలోకి పవన్ వారసుడు.. రామ్ చరణ్ చేతిలో అకీరా నందన్ బాధ్యతలు

  రంగంలోకి పవన్ వారసుడు.. రామ్ చరణ్ చేతిలో అకీరా నందన్ బాధ్యతలు

  మెగా ఫ్యామిలీ నుంచి మరో యువ కెరటం సినీ రంగంలోకి రానుందని తెలుస్తోంది. ఇందుకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ వెండితెర ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉందట మెగా ఫ్యామిలీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు కాబట్టి ఆయన సినీ వారసత్వాన్ని అకీరాతో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ పని చేయడం నా వల్ల కాదు.. ఇలా కావడానికి కారణం.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  ఆ పని చేయడం నా వల్ల కాదు.. ఇలా కావడానికి కారణం.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై గ్లామర్ రోల్స్ పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తనలో అందం, అభినయం రెండూ ఉన్నాయని నిరూపించుకుంటూ వరుస సినిమాలకు కమిట్ అవుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  చిరంజీవి, రామ్ చరణ్‌పై అనుష్క కామెంట్స్.. ఆయనది ప్రయత్నం, ఈయనది శక్తి అంటూ

  చిరంజీవి, రామ్ చరణ్‌పై అనుష్క కామెంట్స్.. ఆయనది ప్రయత్నం, ఈయనది శక్తి అంటూ

  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి సారి చారిత్రక సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. చిరంజీవి సహా చిత్రంలో నటించిన తారాగణం మొత్తానికి మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అనుష్క తనదైన శైలిలో స్పందించింది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  కాబోయే మొగుడు ఎలా ఉండాలంటే.. రహస్యం చెప్పేసిన రకుల్‌ప్రీత్ సింగ్

  కాబోయే మొగుడు ఎలా ఉండాలంటే.. రహస్యం చెప్పేసిన రకుల్‌ప్రీత్ సింగ్

  టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై గ్లామర్ రోల్స్ పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. అందాలు ఆరబోసి మత్తెక్కిస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పలు బాషా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ సరైన విజయం దక్కించుకోలేక పోయింది. కాగా తాజాగా జరిగిన 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షోలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్. ఆ వివరాలు చూస్తే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  మనిద్దరం కలిసి చేయాల్సింది చాలా ఉంది.. నాకు కావాల్సిందిదే.. రకుల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

  మనిద్దరం కలిసి చేయాల్సింది చాలా ఉంది.. నాకు కావాల్సిందిదే.. రకుల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

  ఎవరైనా తమ పుట్టిన రోజును మరిచిపోకుండా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తుల మధ్య, నచ్చిన ప్రదేశంలో ఉండాలని కోరుకుంటాడు. అయితే రకుల్ కూడా.. అలానే ప్లానే వేసుకుంది.. పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  రూ.100 పుచ్చుకుని.. సైరా రివ్యూ రాయలేదా?.. ప్రముఖ రివ్యూ రైటర్‌పై సెటైర్లు

  రూ.100 పుచ్చుకుని.. సైరా రివ్యూ రాయలేదా?.. ప్రముఖ రివ్యూ రైటర్‌పై సెటైర్లు

  మన దక్షిణాది సినిమాలన్నా, ఇక్కడివారన్నా ఉత్తరాది వారికి అంతగా పడదు. అయితే ఇక్కడి కథలను మాత్రం ఎత్తుకుపోయి అక్కడ సొమ్ము చేసుకుంటారు. అందులో మాత్రం ఏమీ మొహమాట పడరు. కానీ మనవాళ్లు అక్కడికి వెళ్లి.. ఏదైనా సాధిస్తే మాత్రం ఒప్పుకోరు. ఎలాగైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత చిరంజీవే.. భర్త‌‌పై జీవిత షాకింగ్ కామెంట్స్

  ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత చిరంజీవే.. భర్త‌‌పై జీవిత షాకింగ్ కామెంట్స్

  మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్‌లకు అప్పట్లో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మెగాఅభిమానుల రాజశేఖర్‌పై ఎంతగా విరుచుకపడ్డారో అందరికీ తెలిసిందే. సినిమా వాళ్ల మధ్య ఆ గొడవలనేవి వస్తుంటాయి.. పోతుంటాయి.. అది వేరే విషయం. మళ్లీ ఎప్పటిలానే కలిసిపోతుంటారు.


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఎన్టీఆర్‌ను చంపేసి.. బన్నీతో చెక్కేస్తా.. షాకింగ్ విషయాలు చెప్పిన శ్రుతీ హాసన్

  ఎన్టీఆర్‌ను చంపేసి.. బన్నీతో చెక్కేస్తా.. షాకింగ్ విషయాలు చెప్పిన శ్రుతీ హాసన్

  ఒకప్పుడు ప్రేమతో లక్ష్మీ అనే ప్రోగ్రామ్ చేసిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మీ.. ప్రస్తుతం సినీ తారలతో ఓ ఇంటర్వ్యూ చేస్తోంది. అయితే ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ మాత్రం పూర్తిగా మసాలాతో కూడుకున్నదే. తారల సీక్రెట్స్, బెడ్రూమ్ ముచ్చట్లు అంటూ ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే ఈ షో వూట్ అనే యాప్లో ప్రసారం అవుతోంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  మహేష్ చెప్పిందే నిజమవుతుందా? అసలు బిగ్ బాస్ హౌస్లో అతని కథేంటి..?

  మహేష్ చెప్పిందే నిజమవుతుందా? అసలు బిగ్ బాస్ హౌస్లో అతని కథేంటి..?

  బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎలా ఉంటారు? ఎప్పుడెలా ప్రవర్తిస్తారు? కంటెస్టెంట్ల గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం ఈ మూడో సీజన్లో.. మహేష్ కూడా అలానే ఉంటున్నాడు. అయితే మొదట్లో చాలా ఆవేశంగా ఉన్న మహేష్.. రానురాను కాస్త చల్లబడ్డాడు. అయితే గేమ్ ఆడే విధానాన్ని కూడా మార్చుకున్నాడు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Y. S. Jaganmohan Reddy, Chiranjeevi meet is hot topic in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X