For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: పవన్‌‌తో షాకిచ్చిన వర్మ, రాజ్ తరుణ్ అరెస్ట్, ప్రభాస్‌పై సంపూ 2 లక్షల ఎఫెక్ట్!

  |

  కర్నాటక వరద బాధితులకు సంపూ లాంటి చిన్న హీరో 2 లక్షలు ఇచ్చారు బాధితులకు మీరేం ఇచ్చారు అంటూ ప్రభాస్‌కు రిపోర్టర్ ఝలక్.. కారు ప్రమాదంపై స్పందించిన రాజ్ తరుణ్.. ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్లు 200 శాతానికి పైగా లాభం.. కుట్రలు ఎదురించిన ధీరుడు అంటూ చిరంజీవికి పవన్ ఎమోషనల్ విషెస్.. అందుకే నా పెళ్లి ఆగిపోయింది అంటున్న జబర్ధస్త్ వినోద్.. హీరో విశాల్ వివాహం ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది? సాహోను ఎదురించలేకపోయిన సైరా.. ఊహించని షాక్ పవన్ కళ్యాణ్‌ని పట్టుకొచ్చిన వర్మ, నెటిజన్లు పరేషాన్.. ఇలా పలు అంశాలు ఈ వారం బాగా పలు అంశాలు బాగా ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

  అందుకే పారిపోయాను: కారు ప్రమాదంపై స్పందించిన రాజ్ తరుణ్.. దయచేసి అలా చేయండంటూ లేఖ

  అందుకే పారిపోయాను: కారు ప్రమాదంపై స్పందించిన రాజ్ తరుణ్.. దయచేసి అలా చేయండంటూ లేఖ

  మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని వార్తలు వచ్చాయి. వీటిని అతడు ఖండించడంతో, తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. తాజాగా ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్లు: 200 శాతానికి పైగా లాభం.. ఎన్ని కోట్ల వసూళ్లంటే!

  ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్లు: 200 శాతానికి పైగా లాభం.. ఎన్ని కోట్ల వసూళ్లంటే!

  టాలీవుడ్ సినీ, ట్రేడ్ వర్గాలను, ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద రాణించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్‌‌కు అవసరమైన సమయంలో సక్సెస్‌ను అందించిన సినిమాగానే కాకుండా టాలీవుడ్‌లో 2019 ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలువడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రేక్షకుల్లో ఓ రకమైన క్రేజ్‌ను నింపిన ఇస్మార్ట్ శంకర్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కుట్రలు ఎదురించిన ధీరుడు.. జీవితం స్ఫూర్తిదాయకం.. చిరంజీవికి పవన్ ఎమోషనల్ విషెస్

  కుట్రలు ఎదురించిన ధీరుడు.. జీవితం స్ఫూర్తిదాయకం.. చిరంజీవికి పవన్ ఎమోషనల్ విషెస్

  తెలుగు సినీ పరిశ్రమలో అతి చిన్న స్థాయి నుంచి విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో మెగాస్టార్‌గా ఎదిగిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి 64వ జన్మదినోత్సవాన్ని ఆగస్టు 22న జరుపుకోవడం తెలిసిందే. మెగాస్టార్ జన్మదినాన్ని కోట్లాది మంది తమ జన్మదినంగా భావిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గురువారం బర్త్ డే జరుపుకోనున్న చిరంజీవి కోసం ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అభిమానిగా మారి సోషల్ మీడియాలో తన గుండె చప్పుడును వినిపించారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ రాసిన ఎమోషనల్ లెటర్ మీ కోసం..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఈ నెలలోనే నా పెళ్లి జరగాల్సింది.. దాని వల్ల ఆగిపోయింది.. అమ్మాయి ఎవరంటే: జబర్ధస్త్ వినోద్

  ఈ నెలలోనే నా పెళ్లి జరగాల్సింది.. దాని వల్ల ఆగిపోయింది.. అమ్మాయి ఎవరంటే: జబర్ధస్త్ వినోద్

  'జబర్ధస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని ఒకడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న అతడు.. బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హాట్ హాట్‌గా బాడీ చూపిస్తూ అదిరిపోయే డ్యాన్స్.. నువ్వో సింగర్‌వి కదా ఇలా అంటావా? రాహుల్‌తో శ్రీముఖి

  హాట్ హాట్‌గా బాడీ చూపిస్తూ అదిరిపోయే డ్యాన్స్.. నువ్వో సింగర్‌వి కదా ఇలా అంటావా? రాహుల్‌తో శ్రీముఖి

  గత సీజన్ల లాగే 'బిగ్ బాస్' మూడో సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మొదటి ఎపిసోడ్ నుంచే ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడూ గొడవలే ఉంటే బాగోదనుకున్నారో ఏమో హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్లాన్ చేశారు. ఇందులో వాళ్లు రచ్చ రచ్చ చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మరోసారి సత్తా చాటిన చిరంజీవి.. ఇండియాలో మొదటి స్థానం.. ప్రపంచంలో 23వ ర్యాంకు

  మరోసారి సత్తా చాటిన చిరంజీవి.. ఇండియాలో మొదటి స్థానం.. ప్రపంచంలో 23వ ర్యాంకు

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన మరోసారి దేశ వ్యాప్తంగా సత్తా చాటారు. దీంతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరో విశాల్ వివాహం ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది?

  హీరో విశాల్ వివాహం ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది?

  తమిళనాడులో సెటిలైన తెలుగు కుటుంబంలో పుట్టిన విశాల్.... కోలీవుడ్లో తనదైన టాలెంటుతో హీరోగా ఎదిగాడు. స్టార్‌గా ఓ వెలుగు వెలగడంతో పాటు నిర్మాతగా రాణించాడు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి లాంటి కీలక పదవులు చేపట్టారు. నడిగర్ సంఘం భవనం నిర్మించే వరకు పెళ్లి చేసుకోను అంటూ శపథం చేసి ఈ యంగ్ హీరో అనుకున్నది సాధించాడు. భవన నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి అనీషారెడ్డితో విశాల్ పెళ్లి ఫిక్స్ అవ్వడం, మార్చి 10న ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సాహోను ఎదురించలేకపోయిన సైరా.. జాతీయస్థాయిలో ఏ హీరోకు ఎక్కువ క్రేజంటే!

  సాహోను ఎదురించలేకపోయిన సైరా.. జాతీయస్థాయిలో ఏ హీరోకు ఎక్కువ క్రేజంటే!

  జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటేందుకు రెండు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి సాహో కాగా, రెండోవది సైరా నర్సింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు కూడా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందాయి. ఒకటి అత్యంత సాంకేతిక విలువలతో హాలీవుడ్ ప్రమాణాలను తలదన్నేలా ఉంటే.. మరోటి చారిత్రాత్మక నేపథ్యంతోపాటు అత్యున్నత టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు భారతీయ సినిమాపై ప్రత్యేక ముద్రను వేసుకోవడానికి ఒకదానికొకటి పడుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్లు వాటి సత్తాను చాటుకొన్నాయి. టీజర్లకు వచ్చిన అనూహ్య స్పందన గురించి మరిన్నీ వివరాలు..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రభాస్ ఇంటర్వ్యూ: ‘సాహో' వర్కౌట్ అయితే నెక్ట్స్ ప్లాన్ ఏమిటంటే...

  ప్రభాస్ ఇంటర్వ్యూ: ‘సాహో' వర్కౌట్ అయితే నెక్ట్స్ ప్లాన్ ఏమిటంటే...

  'సాహో' సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ ఫిల్మీబీట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫిల్మీ బీట్ బాలీవుడ్ ప్రతినిధి ఆయన నుంచి ఆసక్తికర ప్రశ్నలు రాబట్టారు. 'సాహో' బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయితే తన తర్వాతి ప్లాన్ ఏమిటి? బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తారా? అనే అంశాలపై ఆయన స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఊహించని షాక్.. పవన్ కళ్యాణ్‌ని పట్టుకొచ్చిన వర్మ! నెటిజన్లు పరేషాన్

  ఊహించని షాక్.. పవన్ కళ్యాణ్‌ని పట్టుకొచ్చిన వర్మ! నెటిజన్లు పరేషాన్

  రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాక్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న ఓ యాక్టర్‌ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నన్ను గదికి రమ్మని అడిగారు, తప్పు చేయనని చెప్పా: జబర్దస్త్ సాయి తేజ్

  నన్ను గదికి రమ్మని అడిగారు, తప్పు చేయనని చెప్పా: జబర్దస్త్ సాయి తేజ్

  జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేయడం ద్వారా పాపులర్ అయిన సాయి తేజ్ ఆపరేషన్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ తర్వాత తన పేరును కూడా ప్రియాంక సింగ్‌గా మార్చుకున్నారు. తనకు బై బర్త్ ఆ ఫీలింగ్స్ ఉండటం వల్లనే ఇలా మారిపోయానని గతంలోనే ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక సింగ్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గరించి తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరోయిన్ సెమీ న్యూడ్ ఫొటోను షేర్ చేసిన వర్మ.. దీనిపై ఆమె రియాక్షన్ చూస్తే అవాక్కవుతారు.!

  హీరోయిన్ సెమీ న్యూడ్ ఫొటోను షేర్ చేసిన వర్మ.. దీనిపై ఆమె రియాక్షన్ చూస్తే అవాక్కవుతారు.!

  తెలుగు సినీ పరిశ్రమ ద్వారా పరిచయమై దేశ వ్యాప్తంగా సుపరిచితం అయ్యాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. కొన్నేళ్లుగా ఆయన ఏది చేసినా చర్చనీయాంశమే అవుతోంది. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేసిన ఈ దర్శకుడు.. కొద్దిరోజులుగా తన పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద అంశాలపై సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో మందిపై కామెంట్లు చేస్తూ నిరంతరం వార్తల్లో ఉంటాడు. తాజాగా ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘బిగ్ బాస్'లో సైకో బిహేవియర్.. నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు అంటూ అన్నీ పగలగొట్టేసింది

  ‘బిగ్ బాస్'లో సైకో బిహేవియర్.. నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు అంటూ అన్నీ పగలగొట్టేసింది

  బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా హౌస్‌లో మరోసారి రచ్చ జరిగింది. అయితే, ఈ సారి ఎవరూ ఊహించని కంటెస్టెంట్ చేయడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్.. ఏం చేశారు..?

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాజ్ తరుణ్ అరెస్ట్.. కారు యాక్సిడెంట్ కేసులో పోలీసుల ఝలక్

  రాజ్ తరుణ్ అరెస్ట్.. కారు యాక్సిడెంట్ కేసులో పోలీసుల ఝలక్

  యువ హీరో రాజ్ తరుణ్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి రాజ్ తరుణ్ పోరిపోయినట్టు సీసీ పుటేజీల్లో స్పష్టమైంది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులు శుక్రవారం ఉదయం రాజ్ తరుణ్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సంపూ 2 లక్షలు ఇచ్చారు.. బాధితులకు మీరేం ఇచ్చారు.. ప్రభాస్‌కు రిపోర్టర్ ఝలక్

  సంపూ 2 లక్షలు ఇచ్చారు.. బాధితులకు మీరేం ఇచ్చారు.. ప్రభాస్‌కు రిపోర్టర్ ఝలక్

  ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'సాహో' ఆగస్టు 30న విడుదలవుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివిధ రాష్ట్రాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం ఆయన బెంగుళూరులో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending news August 4th week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Raj tarun, RGV, Chiranjeevi, Pawan Kalyan, Srimikhi, bigg boss 3,rashmi gautam news in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X