For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: శ్రీహరి మరణం వెనక నిజం, జగన్‌పై హీరోయిన్ కామెంట్, ఆస్తులు వదులుకున్న నయనతార

|

బావకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు, ఛీ కొట్టి వదిలేశా నన్న డిస్కో శాంతి, పోర్న్‌స్టార్‌ అందాలకు ఫిదా... ఆమె లోపలి అందాలు వర్ణించిన వర్మ, నీ కూతురు.. భర్త రొమాన్స్ చేయడం లేదా అంటూ ఎగతాలిపై భగ్గుమన్న జీవిత, మంచు లక్ష్మిపై శ్రీ రెడ్డి అటాక్, సుధీర్‌ని బాధపెట్టిన జబర్దస్త్ ఇమేజ్, తన వల్ల కావడం లేదు అందుకే అన్నయ్యకు రంగంలోకి దింపుతున్న పవన్ కళ్యాణ్, డ్రగ్స్ ఇచ్చి, కార్లో రేప్ చేశాడు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడంటూ స్టార్ హీరోయిన్ ఫిర్యాదు, వైఎస్ జగన్ గురించి మాజీ తెలుగు హీరోయిన్, మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కామెంట్, ఆస్తులు కూడా వదులుకుంది... నయనతార గురించి సంచలన విషయాలు ఈ వారం ట్రెండింగులో ఉన్నాయి.

బావకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు, ఛీ కొట్టి వదిలేశా: డిస్కో శాంతి

బావకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు, ఛీ కొట్టి వదిలేశా: డిస్కో శాంతి

దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరికి ఇండస్ట్రీలో చాలా మంది డబ్బులు ఎగ్గొట్టేవారని, ఆయన మరణించిన తర్వాత అప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు సంబంధించి రెమ్యూనరేషన్‌గా రావాల్సిన డబ్బు చాలా మంది ఇవ్వకుండా ముఖం చాటేశారనే వాదన ఉంది. ఈ అంశంపై శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పోర్న్‌స్టార్‌ అందాలకు ఫిదా... ఆమె లోపలి అందాలు వర్ణించిన వర్మ!

పోర్న్‌స్టార్‌ అందాలకు ఫిదా... ఆమె లోపలి అందాలు వర్ణించిన వర్మ!

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇలాంటి న్యూడ్ సినిమా తీయడంపై ఆయన విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఇండియాలో నగ్న చిత్రాలకు అనుమతి లేక పోవడంతో ఆన్ లైన్ ద్వారా దీన్ని 2018 జనవరిలో విడుదల చేసి తన పంతం నెగ్గించుకున్నారు. తాజాగా ట్విట్టర్లో మరోసారి వర్మ మియా మాల్కోవా ప్రస్తావన తెచ్చారు. జులై 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ శృంగార తారను తలుచుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నీ కూతురు.. భర్త రొమాన్స్ చేయడం లేదా? ఎగతాలిపై భగ్గుమన్న జీవిత

నీ కూతురు.. భర్త రొమాన్స్ చేయడం లేదా? ఎగతాలిపై భగ్గుమన్న జీవిత

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, జీవిత రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. సినిమాలో అసభ్య సన్నివేశాలపై ఫైర్ అయ్యారు. ఆమె ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మంచు లక్ష్మిపై శ్రీ రెడ్డి అటాక్.. ఇంగ్లీ పుత్రీ అంటూ

మంచు లక్ష్మిపై శ్రీ రెడ్డి అటాక్.. ఇంగ్లీ పుత్రీ అంటూ

పబ్లిక్‌‌గా మాట్లాడేటపుడు ముందూ వెనుక ఆలోచించి మాట్లాడాలని అంటుంటారు పెద్దలు. సమయం, సందర్భం లేకుండా నోటికేదొస్తే అది అనేయడం ద్వారా లేనిపోని చిక్కులొస్తాయే తప్ప ఒరిగేదేమీ ఉండదని చెబుతుంటారు. అది అక్షరాలా నిజమని రుజువు చేశాయి మంచు లక్ష్మి మాటలు. ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అటెండైన మంచు వారి బిడ్డ.. ట్రోలింగ్ పాలవడమే గాక శ్రీ రెడ్డి చేత కూడా మాట పడింది. ఇంతకీ ఏం జరిగింది? అసలు సంగతులు ఏంటి? వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సుధీర్‌ని బాధపెట్టిన జబర్దస్త్ ఇమేజ్.. స్నేహితుల వద్ద ఓపెన్ కాక తప్పలేదు

సుధీర్‌ని బాధపెట్టిన జబర్దస్త్ ఇమేజ్.. స్నేహితుల వద్ద ఓపెన్ కాక తప్పలేదు

బుల్లితెర కామెడీ షోల్లో 'జబర్దస్త్' ని మించిన కామెడీ కిక్కు ఏదీ ఇవ్వదనడంలో అతిశయోక్తి లేదు. యాంకర్ అనసూయ మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు అందరూ పంచులతో పరేషాన్ చేసే వారే. తమపై తామే పంచులేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయింది జబర్డస్త్ టీమ్. ఈ ఒక్క షో ద్వారానే అందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ మంచి పాపులారిటీ దక్కింది. తమ తమ స్కిట్స్ ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ట్యాగ్‌తో క్రేజ్ కొట్టేశారు. అయితే అదే ట్యాగ్ ఇప్పుడు సుడిగాలి సుధీర్ కి సమస్యగా మారిందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తన వల్ల కావడం లేదు.. అందుకే అన్నయ్యకు రంగంలోకి దింపుతున్న పవన్ కళ్యాణ్?

తన వల్ల కావడం లేదు.. అందుకే అన్నయ్యకు రంగంలోకి దింపుతున్న పవన్ కళ్యాణ్?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దరించడానికి, వారికి మంచి చేయడానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చపెట్టే సినిమా రంగాన్ని సైతం వదులుకుని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. 'జనసేన' పార్టీ స్థాపించిన ఆయన గతేడాది నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

డ్రగ్స్ ఇచ్చి, కార్లో రేప్ చేశాడు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు: స్టార్ హీరోయిన్ ఫిర్యాదు

డ్రగ్స్ ఇచ్చి, కార్లో రేప్ చేశాడు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు: స్టార్ హీరోయిన్ ఫిర్యాదు

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి తనను రేప్ చేశాడని ఓస్టార్ హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ చిత్ర సీమలో 'క్వీన్'గా పాపులర్ అయిన ఆ నటి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ సంఘటన గురించి తాను 2004-2006 మధ్యలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి వెల్లడించానని, అయితే అతడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని అందులో ఆమె పేర్కొన్నారు. బైలోని వెర్సోవా పోలీసులకు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన రెండున్నర పేజీల లేఖను ఓ ఆంగ్లపత్రిక బయట పెట్టింది. ఇందులో సదరు నటి చాలా విషయాలు ప్రస్తావించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వైఎస్ జగన్ గురించి మాజీ తెలుగు హీరోయిన్, మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కామెంట్

వైఎస్ జగన్ గురించి మాజీ తెలుగు హీరోయిన్, మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కామెంట్

తెలుగులో హీరోయిన్‌గా రాణించిన నవనీత్ కౌర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. నవనీత్ కౌర్‌ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు రవి రాణాను 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భర్త ద్వారా రాజకీయ పాఠాలు నేర్చుకున్న నవనీత్ కౌర్.... గత ఐదేళ్లుగా రాజకీయాల్లో చుకురుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇపుడు ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తుక్కు తుక్కు చేస్తా.. మాజీ భర్త రెండో పెళ్లి తర్వాత.. అమలాపాల్ సెన్సేషనల్ ట్వీట్

తుక్కు తుక్కు చేస్తా.. మాజీ భర్త రెండో పెళ్లి తర్వాత.. అమలాపాల్ సెన్సేషనల్ ట్వీట్

గ్లామర్ తారగా దుమ్మురేపిన అమలాపాల్ కొద్దికాలంగా స్టార్ రేసులో వెనుకబడిపోయారు. తాజాగా నటిగా పరిణతి చెందిన ఈ బ్యూటీ భారమైన పాత్రలను ఎంచుకొంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇటీవల విడుదలనై ఆడై సినిమ ట్రైలర్‌పై సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అమలాపాల్‌కు ఇటీవల ఓ గట్టి దెబ్బే తగిలింది. చేతిలో నుంచి ఆఫర్ జారిపోవడంతో ఎమోషనల్‌గా స్పందించారు. ఆమె ఏమని స్పందించారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నీ మొగుడు ఆ టైపేనా? గంగవ్వ ప్రశ్నలకు బెదిరిపోయిన సమంత!

నీ మొగుడు ఆ టైపేనా? గంగవ్వ ప్రశ్నలకు బెదిరిపోయిన సమంత!

'ఓ బేబీ' సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి...యూట్యూబ్ స్టార్(మై విలేజ్ షో ఫేం) గంగవ్వకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గంగవ్వ ఎవరూ ఊహించని, సాధారణంగా మీడియా వారు సమంతను అడగటానికి భయపడే ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేయటం నవ్వులు పూయించింది. ఇంటర్వ్యూ అనంతరం సమంతకు పలు రకాల పరీక్షలు పెట్టిన గంగవ్వ... ఈ స్టార్ హీరోయిన్‌తో ఉల్లిపాయలు తరిగించడం, చపాతీలు చేయించడం, పప్పు దినుసులను గుర్తించాలంటూ టెస్ట్ పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. యూట్యూబ్‌లో గంగవ్వకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్‌ని చూసి షాకైన జనం.. పవన్‌లో ఇంత మార్పా!

ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్‌ని చూసి షాకైన జనం.. పవన్‌లో ఇంత మార్పా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తాజా లుక్ తెలుగు ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నాళ్లు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మద్యే కాస్త రిలాక్స్ అవుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆయన రాజకీయాలు వదిలేదే లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి జనంలోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకపోతే ఇదివరకటి లుక్‌లో కాకుండా కొత్త లుక్‌లో ఆయన కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

గొడవలు జరిగింది నిజమే, కానీ బయట పరిస్థితి వేరు: సింగర్ గీతా మాధురి

గొడవలు జరిగింది నిజమే, కానీ బయట పరిస్థితి వేరు: సింగర్ గీతా మాధురి

బిగ్‍బాస్ సీజన్ 1తో పోలిస్తే... గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2లో చాలా వివాదాలు, గొడవలు చోటు చేసుకున్నాయి. కొందరు కంటెస్టెంట్ల మధ్య విద్వేషాలు సైతం చోటు చేసుకున్నాయి. దీనికి తోడు బిగ్ బాస్ షో బయట నుంచి కౌశల్ ఆర్మీతో పాటు ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ కూడా అప్పట్లో ఈ షోను మరింత హైలెట్ చేశాయి. త్వరలో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతున్న నేపథ్యంలో సింగర్ గీతా మాధురి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. చాలా మంది నన్ను 'బిగ్ బాస్' షోకు సంబంధించిన విషయాలు అడుగుతున్నారు. వారికి చెప్పేది ఒకటే... బిగ్ బాస్ షో చూసి, అందులో వారి బిహేవియర్ చూసి వారిని జడ్జ్ చేయకూడదు.' అని గీతా మాధురి తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆస్తులు కూడా వదులుకుంది... నయనతార గురించి సంచలన విషయాలు!

ఆస్తులు కూడా వదులుకుంది... నయనతార గురించి సంచలన విషయాలు!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార... ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అనే తమిళ దర్శకుడితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నయనతార గత జీవితంలోకి వెళితే అనేక ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో శింబుతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ ఆ తర్వాత అతడితో విడిపోయింది. శ్రీరామరాజ్యం సినిమా తర్వాత ప్రభుదేవాను పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకున్న ఆమె చివరి నిమిషంలో అతడితో విడిపోయింది. నయనతార గురించి సినీ విశ్లేషకుడు ఇమంది రామారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఏం చేయాలో అంతా చేసేసింది... యాంకర్ ఝాన్సీ గురించి జోగినాయుడు

ఏం చేయాలో అంతా చేసేసింది... యాంకర్ ఝాన్సీ గురించి జోగినాయుడు

యాంకర్, యాక్టర్ జోగి నాయుడు అంటే ఠక్కున జోగి బ్రదర్స్ షో గుర్తుస్తుంది. నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అటు సినిమాల్లోనే కొనసాగుతూ.. రాజకీయాల్లో కూడా సేవ చేస్తున్నారు. యాంకర్ ఝాన్సీ మాజీ భర్తగా జోగి నాయుడు ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన సినీ, వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఝాన్సీ గురించి, మిగితా విషయాల గురించి జోగి నాయుడు ఏం చెప్పారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శ్రీహరి ఎలా చనిపోయారు? ఆ రోజు ఏం జరిగింది?... డిస్కో శాంతి చెప్పిన నిజం!

శ్రీహరి ఎలా చనిపోయారు? ఆ రోజు ఏం జరిగింది?... డిస్కో శాంతి చెప్పిన నిజం!

రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం తెలుగు సినిమా అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే శ్రీహరి మరణం వెనక కారణం ఏమిటనే విషయంలో అభిమానుల్లో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీహరి భార్య డిస్కో శాంతి ఆ రోజు ముంబైలో ఏం జరిగిందనే విషయం వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending news from Filmibeat July first week 30th. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. disco shanti, mahesh babu, sri reddy, pawan kalyan, ram gopal varma, jeevitha, rajasekhar, sudigali sudheer, aditya pancholi news in top list.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more