For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: స్వామీజీపై సునీత ఫైర్, నగ్నంగా దర్శకుడి మనవరాలు, శ్రీరెడ్డి చనిపోయాక అక్కడికే...

|

స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతిపై సింగర్ సునీత ఫైర్.. ఆలీ సీట్ కొట్టేసిన నాగబాబు షాకవుతున్న జనం.. ఒకప్పుడు జాకెట్ ధరించేవారు కాదంటూ బ్లౌజ్ లెస్ సారీ వివాదానికి యాంకర్ రష్మి సపోర్ట్.. చిరంజీవి నెత్తినేసుకుని ఇబ్బంది పడ్డారు, ఫ్యాన్స్ రూ.500 చందా వేసుకుంటే అదిరిపోద్దంటున్న తమ్మారెడ్డి.. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగిందంటూ రహస్యం బయట పెట్టిన జేడీ, నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా హద్దులు దాటిన దర్శకుడి మనవరాలు, షాకవుతున్న జనం.. ఎవడితో అయినా సంవత్సరమే, నో పెళ్లి అంటూ నర్మగర్భంగా మాట్లాడిన శ్రీరెడ్డి... ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

వాడు నా ఛాతి భాగాన్ని టచ్ చేశాడు.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కంగన

వివాదాస్పద వ్యాఖ్యల్లో ఎప్పుడూ ముందుంటూ సంచలనాలకు కేంద్రబిందువుగా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. అది సినిమాల పరంగా గానీ, వ్యక్తిగత విషయాల పరంగా గానీ ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయడం ఈమె నైజం. ఆమె చెప్పిన మాటలకు ఒకవేళ వివాదాలు చుట్టుముట్టినా సరే బే షరతుగా, వీరోచితంగా సమాధానం చెబుతుంటుంది కంగనా. సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగన ఈ సారి తన పర్సనల్ విషయం ఒకటి చెప్పి ఆవేదన చెందింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇంట్రెస్టింగ్: ఆలీ సీట్ కొట్టేసిన నాగబాబు.. షాకవుతున్న జనం

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ అంటేనే అదో రకమైన క్రేజ్. ఫ్యామిలీ అంతా ఒకేచోట కూర్చొని మస్త్ జబర్దస్త్‌గా ఎంజాయ్ చేసే బుల్లితెర ట్రీట్ ఇది. యాంకర్ అనసూయ అందాల విందు, న్యాయనిర్ణేతల నవ్వులు, స్కిట్లు చేసేవారి వేషాలు అన్నీ ఈ షోలో దేనికవి ప్రత్యేకమే. ముఖ్యంగా తనదైన పంచ్ డైలాగులతో ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో నాగబాబు తీరే వేరు. ఆయన నవ్వు లోనే ఆడో రకమైన వైబ్ ఉంటుంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఈ వైబ్ మిస్ అయ్యారు బుల్లితెర ప్రేక్షకులు. ఆయన స్థానంలో ఆలీ వచ్చి జబర్దస్త్ నడిపించారు. అయితే తాజాగా ప్రసారమవుతున్న ప్రోమో వీడియోలో మరోసారి నాగబాబు దర్శనం అందరికీ షాకిచ్చింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనసూయకు బంపర్ ఆఫర్.. ఏకంగా చిరంజీవితో.. మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారిందిగా!

బుల్లితెర యాంకర్‌గా అందరికీ సుపరిచమే యాంకర్ అనసూయ. తన ఒంపు సొంపులతో బుల్లితెరకు కొత్త శోభ తీసుకొచ్చిన ఈ సుందరి.. వెండితెరపై కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. విలక్షణ పాత్రలు పోషిస్తూ తన అందం, అభినయం రెండింటితో ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెర అన్నట్లుగా సాగుతున్న ఆమె ప్రస్థానం మెల్లగా మెగా హీరోల కంట పడింది. దీంతో మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారింది అనసూయ. తాజా సమాచారం మేరకు అమ్మడికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందట.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఒకప్పుడు జాకెట్ ధరించేవారు కాదు... బ్లౌజ్ లెస్ సారీ వివాదానికి యాంకర్ రష్మి సపోర్ట్!

అమెరికాకు చెందిన 'ఇన్ స్టైల్' అనే మేగజైన్ ఫోటో షూట్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చీరకట్టు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. జాకెట్ లేకుండా టాప్ లెస్‌గా ఆమె ఫోజులు ఇవ్వడంతో 'భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీకట్టును అవహేళన చేస్తున్నావు' అంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రియాంకకు యాంకర్ రష్మి మద్దతు తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి నెత్తినేసుకుని ఇబ్బంది పడ్డారు, ఫ్యాన్స్ రూ.500 చందా వేసుకుంటే అదిరిపోద్ది : తమ్మారెడ్డి

సంజయ్ కిషోర్ రూపొందించిన ఎస్‌.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి "మహానటుడు" పుస్తక ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌రై పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. తొలిప్రతిని ప్రముఖ వ్యాపారవేత్త పెండ్యాల హరనాథ్‌ బాబు ఒక లక్షా వెయ్యినూటపదహార్లు చెల్లించి అందుకున్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎవడితో అయినా సంవత్సరమే, నో పెళ్లి... నర్మగర్భంగా మాట్లాడిన శ్రీరెడ్డి!

ఆమె గుడ్డలు విప్పేసి రోడ్డెక్కిన సమయంలో బరితెగించింది, ఇండస్ట్రీ పరువు తీసిందని చాలా మంది విమర్శించారు. అయితే ఆమె అలా చేసింది కాబట్టే 'కాస్టింగ్ కౌచ్' అంశంపై మీడియాలో తీవ్రమైన చర్చసాగింది అనేది కాదనలేని నిజం. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఆ పరిణామాలే 'క్యాష్' కమిటీ లాంటివి ఏర్పాటు కావడానికి దోహదం చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాలయ్య వారసుడిపై షాకింగ్ న్యూస్... మోక్షజ్ఞ అందరి నోరు మూయిస్తాడా?

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసత్వంతో ఆయన తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య కూడా పలు సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావించారు. ఫ్యాన్స్ సైతం మోక్షు తెరంగ్రేటం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ నందమూరి వారసుడి గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రూ. 150 కోట్లే కారణమా? పవన్ కళ్యాణ్ మీద వర్మ సంచలన ట్వీట్!

ఓటమి తర్వాత జనసేన శ్రేణులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్.... మనం ఓడి పోవడానికి ఇతర పార్టీల వారు భారీగా డబ్బు పంచడం కూడా ఓ కారణమనే వార్తలు తన దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేను చచ్చిపోయాక జరిగేది ఇదే... శ్రీరెడ్డి చేస్తున్న పనికి అంతా షాక్!

కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో రోడ్డు మీద గుడ్డలిప్పి హల్ చల్ చేయడమో? లేక తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్న సందర్భాలో? కారణాలేవైనా నటి శ్రీరెడ్డి మీద చాలా మందిలో మంచి అభిప్రాయం కంటే చెడ్డ అభిప్రాయమే ఎవగా ఉంది. అయితే తాను చెడ్డదాన్ని కాదు, మంచిదాన్ని అంటోంది ఈ కాంట్రవర్సల్ బ్యూటీ.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది.. రహస్యం బయట పెట్టిన జేడీ!

తాజాగా నటుడు జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ సంచలన విషయం బయట పెట్టారు. 'హిప్పీ' మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి తల్లి తన దగ్గరకు వచ్చి నా కూతురును పెళ్లి చేసుకోవాలని అడిగినట్లు వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా... హద్దులు దాటిన దర్శకుడి మనవరాలు, షాకవుతున్న జనం!

సాక్షి చోప్రా... బాలీవుడ్‌లో రామాయణం తీసిన లెజెండరీ దర్శకుడు రామానంద్ సాగర్ ముని మనవరాలు. ఇపుడు ఈ చిన్నది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో సంచలనంగా మారిపోయారు. నిన్న మొన్నటి వరకు కేవలం బికినీ పోస్టులకే పరిమితమైన ఈ యంగ్ గర్ల్... తాజాగా పూర్తి నగ్నంగా ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆందోళనలో మందు బాబులు... మెగా బ్రదర్ నాగబాబు సర్వే, జనం రియాక్షన్ ఇలా!

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మద్యపాన నిషేధంపై రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు ఈ విషయంలో ఆన్ లైన్ సర్వే నిర్వహించారు. ‘వైఎస్ జగన్ నవరత్నాల్లో ముఖ్యమైన 'మద్యపాన నిషేధం' హామీ అమలు సాధ్యమేనా ?' అంటూ సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జూ ఎన్టీఆర్ తల్లి కళ్లెంట నీళ్లు పెట్టుకున్నారు, మోహన్ బాబు కూడా భయపడ్డారు: సమీర్

ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో అద్భుతంగా డైలాగులు చెప్పగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరు? ఎలాంటి డైలాగులైనా, ఎంత పెద్దగా ఉన్నా సింగిల్ టేక్‌లో ఫినిష్ చేసే టాలెంట్ ఎవరికి ఉంది? అంటే ప్రతి ఒక్కరూ సందేహం లేకుండా వెంటనే చెప్పే పేరు... జూ ఎన్టీఆర్. జూ ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మెలిగే నటుల్లో ఒకరైన సమీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూ ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగులు అయినా ఒక్కసారి చదివేసి చెప్పేస్తారు. ఈ విషయంలో ఆయన్ను బీట్ చేసే వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరూ లేరన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అమితాబ్ బచ్చన్ మనవరాలితో ఎఫైర్... నిజం ఒప్పుకున్నాడు, ఇదీ జరిగింది...

బాలీవుడ్ నటుడు జావేద్ జాఫెరి కుమారుడు మీజాన్ త్వరలో 'మలాల్' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో మీజాన్ సరసన ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు షార్మిన్ సెగల్ హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీజాన్... నవ్య నవేలితో ఎపైర్ రూమర్లపై స్పందించారు. మేము ఒకే ఫ్రెండ్ సర్కిల్‌కు చెందిన వారం. నా సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్స్‌లో నవ్య ఒకరు. నాకు కూడా గుడ్ ఫ్రెండ్. నేను ఎవరితోనూ రిలేషన్ షిప్‌లో లేనని మీజాన్ స్పష్టం చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతిపై.... సింగర్ సునీత ఫైర్!

ప్రముఖ తెలుగు సింగర్ సునీతపై తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడం, అందంగా ఉండటం, ఇండస్ట్రీలో పాపులర్ పర్సన్ కావడం ఇందుకు కారణం అయుండొచ్చు. సునీత కూడా తనపై వచ్చే రూమర్స్ పెద్దగా పట్టించుకోదు. తన మనసుకు చాలా బాధ కలిగించే అశాలపై తప్ప ఆమె రియాక్ట్ అవ్వరు. ఆ మధ్య తాను మరో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాజాగా ఆమె స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాటలను ఖండిస్తూ పోస్ట్ పెట్టారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending news from Filmibeat Telugu June 3rd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Pawan Kalyan, sri reddy, mohan babu, tharun bhascker, ka paul, renu desai, vijay deverakonda news in top list.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more