For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: చిరుకి సంబంధం లేదు, ఎన్టీఆర్‌తో గొడవపై రాజీవ్ కనకాల, పవన్ కళ్యాణ్ షాక్, డబ్బు కోసం అనసూయ

|

బూతులతో సంచలనం రేపుతున్న రొమాంటిక్ క్రిమినల్స్.. నాకు తిండి పెడుతున్నావా? నాతో సంసారం చేస్తున్నావా? అంటూ ఇషా గుప్తా ఫైర్.. ఆ హీరో, హీరోయిన్ల ప్రేమ పెళ్లికి నేనే కారణం అంటున్న నిత్య మీనన్.. రివ్యూ మీటింగులో అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ బాధతో చనిపోవద్దు, ఆమె మానసికంగా హింసించింది. డైరీ చింపేశానని చెప్పిన శివశంకర్ మాస్టర్.. చూసేవాళ్లకు కూడా నచ్చదు, ఎన్టీఆర్‌తో గొడవలపై రాజీవ్ కనకాల కామెంట్స్.. అనసూయ లైఫ్‌లో ఇన్ని కష్టాలున్నాయా?.. యాంకర్ రవికి షాక్.. పటాస్‌కు శ్రీముఖి గుడ్‌బై.. ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. ఏమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

నాకు తిండి పెడుతున్నావా? నాతో సంసారం చేస్తున్నావా? మీ లైఫ్ దొబ్బిందని.. ట్రోల్స్‌పై ఫైర్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు వ్యక్తిగత స్వేచ్ఛ కరువు అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. తారలు ధరించే దస్తులు విషయంపై నెటిజన్ల కామెంట్లు వారిని తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నాయనే విషయం బయటపడింది. తాజాగా అందాల నటి ఇషా గుప్తా ఇటీవల ఫారిన్‌లో వెకేషన్‌కు వెళ్లింది. బీచ్‌లో బికినీలో దర్శనమివ్వడంతో నెటిజన్లు నోరు పారేసుకొన్నారు. నెటిజన్ల ట్రోలింగ్‌పై ఇషా గుప్తా మండిపడ్డారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాగార్జున నిర్ణయం వెనుక ఆంతర్యమేంటో! చిరంజీవి, ప్రభాస్‌తో పెట్టుకోవడం ఎందుకనే ఇలా చేస్తున్నారా..?

సీనియర్ హీరో నాగార్జున ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆ నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరచడమే గాక పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లతో పోటీకి దిగడం ఎందుకని నాగార్జునకు ఓ ఆలోచన వచ్చిందట. కానీ ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో అని నాగార్జున అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అన్నీ బూతులే: సంచలనం రేపుతున్న ‘రొమాంటిక్ క్రిమినల్స్'

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి.సునిల్ కుమార్ రెడ్డి త్వరలో మరో సంచలన మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'రొమాంటిక్ క్రిమినల్స్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్లు ఇంటర్నెట్లో సంచలనం రేపుతున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ హీరో, హీరోయిన్ల పెళ్లికి కారణం నేనే.. వారిద్దరూ నా వల్లే ప్రేమలో.. నిత్య మీనన్

అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడమే కాదు.. తోటి నటీనటులు ప్రేమలో ప్రేమలో పడటానికి నిత్యమీనన్‌ కారణమనే ఆలస్యంగా బయటపడింది. వెండితెర మీద ప్రేమలో పడటమే కాకుండా నిజజీవితంలో ప్రేమలో పడటానికి, వారికి ఈ టాలెంటెడ్ యాక్టర్ అండగా నిలిచిన విషయం బయపడింది. మలయాళ ఇండస్ట్రీలో టాప్ హీరో ఫాహద్ ఫాజిల్, నాజ్రియా నాజిమ్ ప్రేమ ఫలించడానికి కారణం నిత్య మీనన్ అట. అంతేకాకుండా వారి పెళ్లి జరగడానికి కూడా తానే కారణమని ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల నిత్య మీనన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రివ్యూ మీటింగులో అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్!

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అందరి దృష్టి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అని మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎదురు చూసేది కేవలం ఎన్నికల ఫలితాల కోసం మాత్రమే కాదు... పవర్ స్టార్ నుంచి తీయని కబురు వస్తుందని వారు వేయి కళ్లతో వేచిఉన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మహేష్.. ఆడపిల్లగా పుడితే ఒప్పుకొనే వరకు వెంటపడేదానిని.. అందంగా లేవని పెళ్లాలు ప్రశ్నిస్తున్నారు

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సీ అశ్వినీదత్, పీవీపీ నిర్మాణ సారథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం విడుదలై మంచి స్పందనను కూడగట్టుకొంటున్నది. భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, అల్లరి నరేష్, దిల్ రాజు, అశ్వినీదత్, పోసాని, రాజీవ్ కనకాల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హల్‌చల్ చేస్తున్న మరో ఎన్టీఆర్.. ఆశ్చర్యపోతున్న తారక్ ఫ్యాన్స్

టెక్నాలజీ బాగా విస్తరిస్తున్న ఈ తరుణంలో సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలు, విశేషాలు మన ముంగిటకొస్తున్నాయి. ఈ కోవలోనే అందుబాటులోకి వచ్చిన యాప్ టిక్ టాక్. ఈ యాప్‌లో పొందుపర్చిన టూల్స్ ఉపయోగించి తమకు తోచిన, నచ్చిన వీడియోలు రూపొందించి అందరి ముందుంచే అరుదైన అవకాశం లభించింది. అయితే ఈ యాప్ ద్వారా ఓ వీడియో చేశాడు షమీందర్ సింగ్ అనే ఓ యువకుడు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయన ఎన్టీఆర్‌ని పోలిఉండటం చూసి షాకవుతున్నారంతా.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరుకి గానీ ఆయన ఫ్యామిలీకి గానీ వాటితో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్

ఇన్నాళ్లు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు నడిపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విద్యా వ్యవస్థ లోకి అడుగు పెడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఓ పాఠశాలను ఆయన ప్రారంభించబోతున్నట్లు వార్తలు రాసుకొచ్చారు. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు మెగా అభిమానులు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

విజయ్ దేవరకొండ సుదీర్ఘమైన లిప్‌లాక్.. హీరోయిన్‌ కూడా రెడీ.. సౌత్‌లోనే రికార్డట..

టాలీవుడ్‌లో అతి కొద్దికాలంలోనే విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయారు. అర్జున్ రెడ్డి తర్వాత ప్రతీ మూవీలోనూ సింబాలిక్‌గా లిప్‌లాక్ సర్వసాధారణమైంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీని తలపించేలా ముద్దులతో వెండితెరను ముంచెత్తుతున్నాడు. గత చిత్రాలు గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా సినిమాల్లో విజయ్ దేవరకొండ ముద్దులతో ప్రేక్షకులను రంజింప చేశాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రాల్లో కూడా ముద్దులకు కొదవలేదంటున్నాయి సినీ వర్గాలు.. విజయ్ దేవరకొండ ముద్దుల వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అన్నీ ఆ మెసేజ్‌లే.. చెత్త కామెంట్లు ఆపండి.. క్లాస్ పీకిన యంగ్ హీరోయిన్

సోషల్ మీడియా బాగా విస్తరించడం నేటి తరం హీరోయిన్స్ ని ఓ వరంగా మారింది. ఈ వేదికగా ఎప్పటికప్పుడు తమ ఫిట్ నెస్, అందం వగైరా తాలూకు ఫొటోలను అందరి ముందుంచి అందాల విందులిస్తున్నారు. అయితే ఈ పిక్స్ చూసి మురిసి పోయేవారు కొందరైతే.. వాటిపై తమకు తోచిన కామెంట్స్ చేస్తూ సదరు హీరోయిన్లకు చిర్రెత్తేలా చేసివారు ఇంకొందరు. ఏదేమైనా ఎలాంటి కామెంట్స్ వచ్చినా ముద్దుగుమ్మల అందాల విందు మాత్రం అస్సలు తగ్గటం లేదు. తాజాగా ముంబై భామ మాళవిక శర్మ ఓ హాట్ ఫొటోతో కవ్విస్తూనే నెటిజన్లకు చురకలంటించడం హాట్ టాపిక్ అవుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ బాధతో చనిపోవద్దు.. ఆమె మానసికంగా హింసించింది.. డైరీ చింపేశా.. శివశంకర్ మాస్టర్

సుమారు ఐదు దశాబ్దాలుగా వెండి తెరపై స్టార్ హీరోలకు నృత్యాలు సమకూర్చిన డాన్స్ డైరెక్టర్లలో శివశంకర్ మాస్టార్ ఒకరు. మూడు జనరేషన్ల హీరోలకు డ్యాన్స్ డైరెక్ట్ చేసిన ఘనత ఆయనది. ఎన్టీఆర్, ఏఎణ్నాఆర్, చిరంజీవి లాంటి అగ్రహీరోలకు బంపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన రికార్డు ఆయనకే సొంతం. వెండి తెరపైనే కాకుండా బుల్లితెర మీద డ్యాన్స్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివశంకర్ మాస్టర్ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని అనేక విషయాలు వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా పైభాగం రెచ్చగొట్టేలా.. వయసుతో పనేంటి? టాప్‌లెస్‌గా టాప్ హీరోయిన్ ఫొటోషూట్

హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ మరోసారి అందాల ఆరబోతకు తెగించింది. జీవితంలో వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే.. దానికి మనసుకు సంబంధం లేదని చాటిచెప్పే ప్రయత్నం జెన్నీఫర్ చేసింది. తాజాగా బ్రాడ్ ప్రిట్‌తో డేటింగ్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ 50 ఏళ్ల సుందరి ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్‌ కోసం టాప్‌లెస్‌గా మారింది. ప్రస్తుతం జెన్నీఫర్‌కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ రవికి షాక్.. పటాస్‌కు శ్రీముఖి గుడ్‌బై.. వీడియో రిలీజ్

బుల్లితెర రియాలిటీ షోలలో పటాస్‌కు మంచి ప్రజాదరణ ఉంది. జబర్తస్త్ షో మాదిరిగానే అవసరమైనంత అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ను ఈ షో పిచ్చెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సక్సెస్ వెనుక యాంకర్లు రవి, శ్రీముఖి టాలెంట్ ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. యాంకర్లుగా రవి, శ్రీముఖి కెమిస్ట్రీ బుల్లితెరకు మంచి రేటింగ్ తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్్యంలో పటాస్ షో నుంచి తప్పుకొంటున్నట్టు శ్రీముఖి వీడియో రిలీజ్ చేయడం షాకింగ్‌గా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనసూయ లైఫ్‌లో ఇన్ని కష్టాలున్నాయా? డబ్బుల్లేక చివరకు ఆ పని కూడా!

ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలంటూ కొన్ని ఉంటాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి ఓ స్టేజ్‌కి వచ్చాక ఆ కష్ట సుఖాలు తలచుకుంటేనే భయమేస్తుంటుంది. అప్పట్లో అలా ఉండేవాళ్లం ఈ రోజుకు ఈ స్థాయికి వచ్చామా? అని తమలో తాము ఆనందపడుకుంటూ వాటిని నెమరు వేసుకోవడం సాధారణంగా అందరిలో చోటుచేసుకునే సంఘటనే. ఇలాంటి వాటికి సినీ తారలేం అతీతులు కాదు. వారికి కూడా కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి కొన్ని జ్ఞాపకాలను తన పుట్టిన రోజు సందర్బంగా గుర్తు చేసుకుంది అనసూయ.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చూసేవాళ్లకు కూడా నచ్చదు.. ఎన్టీఆర్‌తో గొడవలపై రాజీవ్ కనకాల కామెంట్స్

తెలుగు సినిమా నటీనటుల్లో కొందరి మధ్య స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అది హీరోల మధ్య కావచ్చు.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు మధ్య కావచ్చు. ఆ స్పెషల్ బాండింగ్ ఆ ఇద్దరు నటుల ఫ్యాన్స్‌కి కన్నుల పండుగగా అనిపిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఆ బాండింగ్‌లో తేడా వచ్చిందనే వార్తలు వారి వారి ఫ్యాన్స్‌ని తెగ బాధపెట్టేస్తాయి. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్- రాజీవ్ కనకాల బాండింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టించారు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వీటిపై క్లారిటీ ఇచ్చారు రాజీవ్ కనకాల.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending news from Filmibeat Telugu May 3rd week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. anasuya, posan krishna murali, esha gupta, nagarjuna, chiranjeevi, prabhas, nithya menen, pawan kalyan, vijay deverakonda, rajiv kanakala, NTR news in top list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more