For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: హీరోయిన్ ఆత్మహత్య.. ఆ హీరో నలిపేశాడంటూ... కొడుకులపై నాగార్జున బెంగ!

|

యంగ్ హీరోయిన్ ఆత్మహత్య,... బాయ్ ఫ్రెండ్ కాల్, కారణం అదేనా?.. 2.0: ఆ ట్వీట్ చూసి తెలుగు ఫ్యాన్స్‌కి మండుతోంది... ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా!.. రాజమౌళి కుమారుడి పెళ్లి సందడి: బ్రహ్మాజీ ఆసక్తికరమైన ట్వీట్.. కొడుకులపై నాగార్జున బెంగ: ఇప్పటికీ గట్టిగా కొట్టింది లేదు, లైట్ తీస్కోవద్దని సూచన!.. ప్రతీరోజు నన్ను నలిపేస్తాడు.. పడకగదిలో అర్థనగ్నంగా హీరో.. మీడియా రచ్చ!.. యువ హీరోతో అమలా పాల్ పెళ్లి.. తమిళ పరిశ్రమను కుదిపేసిన వార్త... జోరుగా RRR షూట్ కేకపుట్టించేలా ఫైట్... సర్కార్ చిత్రాన్ని టార్గెట్ చేయకుండా ఊరుకుంటారా.. ఈ వారం ఇలా పలు అంశాలు బాగా ట్రెండ్ అయ్యాయి.

 దిగిపోద్ది.... హీరో నాని నిజం స్వరూపం ఇదే, ట్విట్టర్ పోస్ట్ వైరల్!

దిగిపోద్ది.... హీరో నాని నిజం స్వరూపం ఇదే, ట్విట్టర్ పోస్ట్ వైరల్!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు మంచి పొజిషన్లో కొనసాగుతున్నాడు హీరో నాని. అయితే ఈ నేచురల్ స్టార్ ఒకప్పుడు సాధారణ ప్రేక్షకుడిలా క్యూ లైన్లో నిల్చుని చొక్కాలు చించుకుని మరీ సినిమాలు చూసిన వ్యక్తే. తనకు నచ్చిన సినిమా చూస్తే సగటు ప్రేక్షకుడిలా ఎగ్జైట్ అవ్వడంతో పాటు తనలోని ఆ సంతోషాన్ని, నచ్చకపోతే ఆ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాలని నానికి కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం అతడు సెలబ్రిటీ కాబట్టి అలాంటివి చేయలేని పరిస్థితి. కానీ 2.0 సినిమా చూసిన తర్వాత తన సెలబ్రిటీ స్టేటస్ పక్కన పెట్టి తనలోని అసలైన సినీ అభిమాని నిజస్వరూపం చూపడంతో పాటు ఆనందంతో బరస్ట్ అయిపోయాడు నాని.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 యంగ్ హీరోయిన్ ఆత్మహత్య,... బాయ్ ఫ్రెండ్ కాల్, కారణం అదేనా?

యంగ్ హీరోయిన్ ఆత్మహత్య,... బాయ్ ఫ్రెండ్ కాల్, కారణం అదేనా?

తమిళ హీరోయిన్ రియామికా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని వలసరవాక్కమ్‌లోని తన నివాసంలో బుధవారం (నవంబర్ 28) ఆమె ఉరివేసుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. రియామికా తమిళంలో 'కుంద్రాతిలే కుమారానుకు కొండట్టం', 'అఘోరి యిన్ అట్టమ్ ఆరంభం' లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆమె ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 2.0: ఆ ట్వీట్ చూసి తెలుగు ఫ్యాన్స్‌కి మండుతోంది... ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా!

2.0: ఆ ట్వీట్ చూసి తెలుగు ఫ్యాన్స్‌కి మండుతోంది... ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా!

బాహుబలి ముందు వరకు ఇండియాలో భారీ సినిమాలు తీసేది ఎవరు? అంటే శంకర్ పేరు మాత్రమే వినిపించేది. అయితే రాజమౌళి బాహుబలితో వచ్చి టాలీవుడ్ దర్శకుల్లోనూ హాలీవుడ్ స్థాయి సినిమాలు తీసే సత్తా ఉందని నిరూపించాడు. ఆ సమయంలో సోషల్ మీడియాలో తెలుగు, తమిళ సినీ అభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం జరిగింది. రాజమౌళి, శంకర్‌లను కంపేర్ చేస్తూ ఇదరు వర్గాల అభిమానులు వాదించుకున్నారు. తెలుగు అభిమానులు మా రాజమౌళి గొప్పోడని.... తమిళ అభిమానులు శంకర్ త్వరలోనే మీ నోరు మూయిస్తాడంటూ ఒకరిపై ఒకరు కామెంట్లు గుప్పించుకున్నారు. తాజాగా 2.0 సినిమా విడుదలైన నేపథ్యంలో మరోసారి ట్విట్టర్లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజమౌళి కుమారుడి పెళ్లి సందడి: బ్రహ్మాజీ ఆసక్తికరమైన ట్వీట్

రాజమౌళి కుమారుడి పెళ్లి సందడి: బ్రహ్మాజీ ఆసక్తికరమైన ట్వీట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహం జనవరి 5, 2019న జరుగబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి శుభలేఖల పంపిణీలో రామా రాజమౌళి బిజీగా గడుపుతున్నారు. ఆమె స్వయంగా వెళ్లి సినీ ప్రముఖులకు తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తున్నారు. తాజాగా రమారాజమౌళి నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకున్న ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతే కాదు ఈ రోజుల్లో కొందరు పెళ్లి ఇన్విటేషన్ పంపుతున్న తీరును గుర్తు చేసుకుంటూ... రమా రాజమౌళికి థాంక్స్ చెప్పారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 కొడుకులపై నాగార్జున బెంగ: ఇప్పటికీ గట్టిగా కొట్టింది లేదు, లైట్ తీస్కోవద్దని సూచన!

కొడుకులపై నాగార్జున బెంగ: ఇప్పటికీ గట్టిగా కొట్టింది లేదు, లైట్ తీస్కోవద్దని సూచన!

నిన్నటి తరం తీసుకుంటే తెలుగులో అగ్రహీరోలుగా వెలుగొందిన నలుగురిలో నాగార్జున ఒకరు. ఏఎన్ఆర్ వారసుడిగా తెరంగ్రేటం చేసి అనతికాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మన్మధుడిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను, బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నారు. నాగార్జున వారసులుగా తన ఇద్దరు కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారితో పోటీ పడుతూ నాగార్జున సినిమాలు చేస్తున్నారంటే ఆయనకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెరీర్ పరంగా నాగార్జునకు ఎలాంటి బెంగలేదు. అయితే ఇద్దరు వారసులు ఇంకా ఇండస్ట్రీలో సరైన ట్రాక్‌లో పడలేదనే బాధ ఆయనలో ఉందట.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 ప్రతీరోజు నన్ను నలిపేస్తాడు.. పడకగదిలో అర్థనగ్నంగా హీరో.. మీడియా రచ్చ!

ప్రతీరోజు నన్ను నలిపేస్తాడు.. పడకగదిలో అర్థనగ్నంగా హీరో.. మీడియా రచ్చ!

బాలీవుడ్ పెళ్లిళ్లకు, లవ్ అఫైర్లకు అడ్డగా మారతున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవలే రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి చేసుకోగా, ప్రియాంక చోప్రా వివాహానికి రెడీ అవుతున్నారు. అదే బాటలో కమెడియన్ కపిల్ శర్మ కూడా సిద్దంగా ఉన్నాడు. కపిల్ శర్మ పెళ్లి డిసెంబర్ 12న జరుగునున్న సంగతి తెలిసిందే. ఇక ప్రేమ వ్యవహారాలకు వస్తే.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అఫైర్ ఇప్పుడు బజారున పడింది. అర్జున్ రాంపాల్ అర్ధనగ్న ఫొటోను ప్రియురాలు గ్యాబ్రిల్లా డీమిట్రియాడెస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వారి అఫైర్ చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 యువ హీరోతో అమలా పాల్ పెళ్లి.. తమిళ పరిశ్రమను కుదిపేసిన వార్త

యువ హీరోతో అమలా పాల్ పెళ్లి.. తమిళ పరిశ్రమను కుదిపేసిన వార్త

తమిళనాడులో యువ హీరో విష్ణు విశాల్ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన రాట్సాసన్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. రామ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ ఏడాదిలోనే అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రంగా విష్ణు విశాల్‌ కెరీర్‌లో నిలిచింది. అయితే ఇలాంటి సక్సెస్ జోష్‌లో ఉన్న విశాల్ విష్ణు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తమిళ పరిశ్రమను కుదిపేసింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 జోరుగా RRR షూట్.. కేకపుట్టించేలా ఫైట్.. మాస్‌గా ఎన్టీఆర్.. చెర్రీ లుక్ ఎలా ఉందంటే

జోరుగా RRR షూట్.. కేకపుట్టించేలా ఫైట్.. మాస్‌గా ఎన్టీఆర్.. చెర్రీ లుక్ ఎలా ఉందంటే

బాహుబలి మూవీ తర్వాత దర్శక ధీర రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్‌పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా సీన్లకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

విశాల్‌కు ఆ అమ్మాయితో అక్రమ సంబంధం.. మహిళ అత్యుత్సాహం.. అరెస్ట్‌కు..!

విశాల్‌కు ఆ అమ్మాయితో అక్రమ సంబంధం.. మహిళ అత్యుత్సాహం.. అరెస్ట్‌కు..!

దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం కొనసాగుతున్నది. అన్యాయానికి గురైన సీనీ తారలు.. తమపై దౌర్జన్యం చేసిన వ్యక్తులను బజారుకీడ్చుస్తున్నారు. గాయని చిన్మయి, హీరోయిన్ శృతిహరిహరన్ లాంటి వారు సినీ ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. ఇలాంటి నేపథ్యంలో హీరో విశాల్‌పై ఆరోపణలు చేసి ఓ యువతి సమస్యల్లో ఇరుక్కుపోయింది. అసలేం జరిగిందంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

భయపడుతున్నాను.. చాలా నెర్వెస్‌గా ఉంది.. సమంత షాకింగ్ ట్వీట్

భయపడుతున్నాను.. చాలా నెర్వెస్‌గా ఉంది.. సమంత షాకింగ్ ట్వీట్

బహుభాషా నటి సమంత అక్కినేని వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. 2018 సంవత్సరంలో తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయాలను అందుకొని సూపర్ స్టార్‌గా మారింది. చేతిలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నది. తాజాగా ఆమె నటించిన చిత్రం సూపర్ డీలక్స్‌ విడుదలకు సిద్దమైంది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో సమంత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్ హాట్ కామెంట్.. ఉదయం లేవగానే, కరణ్ జోహార్ ప్రశ్న!

విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్ హాట్ కామెంట్.. ఉదయం లేవగానే, కరణ్ జోహార్ ప్రశ్న!

శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ తన డెబ్యూ మూవీతో ఆకట్టుకుంది. ఇషాన్ ఖట్టర్ తో జంటగా నటించిన దఢక్ చిత్రంతో జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లుక్, నటన పరంగా జాన్వీ సినీ విమర్శకులని, ప్రేక్షకులని మెప్పించింది. ప్రస్తుతం జాన్వీ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. ఇటీవల అర్జున్ కపూర్, జాన్వీ కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సర్కార్ చిత్రాన్ని టార్గెట్ చేయకుండా ఊరుకుంటారా.. సినిమాలపై హింట్ ఇచ్చిన పవన్!

సర్కార్ చిత్రాన్ని టార్గెట్ చేయకుండా ఊరుకుంటారా.. సినిమాలపై హింట్ ఇచ్చిన పవన్!

రాజకీయ కార్యక్రమాలతో బిజీగా పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా గోదావరి జిల్లాలని చుట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తారా చేయరా అనే చర్చ జరుగుతూనే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని పక్కన పెట్టి సినిమాలు చేయడం సాధ్యం కాదు. తనకు సినిమాలు చేసే తీరిక లేదంటూ పవన్ అధికారికంగా ప్రకటించారు కూడా. చెన్నై వెళ్లిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. అదేవిధంగా నిన్న పి గన్నవరం బహిరంగ సభలో భవిష్యత్తులో సినిమాలు చేసే విషయంపై పవన్ హింట్ ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మెగా 'అల్లుడి' సినిమా.. మెహ్రీన్‌పై నిర్మాత ఫిర్యాదు, ఏం జరిగిందంటే!

మెగా 'అల్లుడి' సినిమా.. మెహ్రీన్‌పై నిర్మాత ఫిర్యాదు, ఏం జరిగిందంటే!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా విషయంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం విజయం సాధించకపోయినా కళ్యాణ్ దేవ్ పెర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తరువాత నటనలో పరిణితి కోసం కళ్యాణ్ దేవ్ శిక్షణ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రోబో మొత్తం వసూళ్లు ఒక్కరోజులో ఉఫ్.. చిట్టి 2.0 రికార్డుల వేట, తొలిరోజు అక్కడ ఎంతంటే!

రోబో మొత్తం వసూళ్లు ఒక్కరోజులో ఉఫ్.. చిట్టి 2.0 రికార్డుల వేట, తొలిరోజు అక్కడ ఎంతంటే!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. సినీ జనాల్లో ఎక్కడ చూసినా శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ గురించే చర్చ. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మరే ఇండియన్ మూవీకి సాధ్యం కాని విధంగా 10 వేల స్క్రీన్స్ లో విడుదలవుతోంది. దీనితో ట్రేడ్ విశ్లేషకులు భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని అంచనావేస్తున్నారు. రజనీకాంత్ క్రేజ్ కు శంకర్ దర్శత్వం తోడైంది కాబట్టి వసూళ్లు ఊహకందని విధంగా ఉండబోతున్నాయి. తొలి రోజు నుంచే 2.0 రికార్డుల వేట మొదలుపెట్టనుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఈ టైంలో రిలీజ్ అంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.. మహేష్ బాబు కొడుకు 2.0 చూడగానే!

ఈ టైంలో రిలీజ్ అంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.. మహేష్ బాబు కొడుకు 2.0 చూడగానే!

సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. శంకర్ ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమాకు గర్వకారణం అనే స్థాయిలో అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించారు. శంకర్ దర్శత్వం, రజనీకాంత్ మ్యాజిక్ని ఆడియన్స్ ఆస్వాదిస్తున్నారు. అక్షయ్ కుమార్ భయంకరమైన విలన్‌గా అదరగొట్టేశాడు.ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది. 2.0 చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేశారు. సినిమాకు వస్తున్న స్పందన గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Tamil actress Riyamikka Commitssuicide, social war between 2.0 and baahubali fans, brahmaji tweet about ss karthikeya wedding invitation, amala paulvishnu vishal get married.. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more