For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: బాలయ్యపై దారుణం, టీడీపీపై జూ ఎన్టీఆర్, బన్నీ వైఫ్ రికార్డ్, లైంగిక వేధింపులు...

|

హీరో నిఖిల్ సంచలన కామెంట్స్ విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?... తెలుగు దేశం పార్టీ గురించి ఆలోచించలేదన్న ఎన్టీఆర్.. నానా పాటేకర్ నిజస్వరూపం బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సరికొత్త రికార్డ్.. అతడికి సెక్స్ వ్యసనం ఉందంటూ కంగనా ఆరోపణలు.. నాన్న మరణాంతరం అలా జరిగింది తట్టుకోలేకపోయానన్న ఎన్టీఆర్.. మీదపడి పెదవులు కొరికాడంటూ క్వీన్ దర్శకుడిపై నటి ఆరోపణలు.. బాలకృష్ణను గూగుల్ తల్లి చంపేసింది.. భార్య ముందే దర్శకుడి చెంప పగలగొట్టింది... ఇలా గతం వారం పలు అంశాలు ఇంటర్నెట్లో ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్సయి ఉంటే... ఓ లుక్కేయండి.

హీరో నిఖిల్ సంచలన కామెంట్స్... విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ఈ ట్వీట్ ద్వారా మరో యంగ్ హీరోకు నిఖిల్ క్లాస్ పీకినట్లు గోచరిస్తోంది. అయితే నిఖిల్ అక్కడ పలానా వ్యక్తి పేరు అని ప్రస్తావించక పోయినా... ఇది సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిందే అని అంతా భావిస్తున్నారు. ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా స్వార్థం కూడా ఉంది, ఆ గాయం పచ్చిగానే, పార్టీ విషయం ఆలోచించలేదు: ఎన్టీఆర్

ఇటీవల ‘అరవింద సమేత' ప్రమోషన్లలో పాల్గొన్న ఎన్టీఆర్‍‌కు తెలుగు దేశం పార్టీ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. నాన్నగారి తర్వాత మీరు ఆ బాధ్యతలు చూసుకుంటారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లైంగిక వేధింపులు: నానా పాటేకర్ ఎలాంటోడో బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ

ఆ రోజు తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలిసిన నానా పాటేకర్ ఎలాంటి వాడు, అతడితో నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురయ్యాయో చెప్పాలనుకుంటున్నాను అని వర్మ తన వాదన మొదలు పెట్టారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సరికొత్త రికార్డ్.... సౌత్ నెం1, ఇండియాలో నెం.2

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు స్నేహారెడ్డి సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో భార్య సాధించని ఫీట్ సాధించింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ తర్వాత స్నేహారెడ్డి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అతడికి సెక్స్ వ్యసనం, నా వాసన ఇష్టం అంటూ నలిపేసేవాడు: కంగనా

క్వీన్ సినిమా సమయంలోనే వికాస్ బాల్ పెళ్లి జరిగింది. ఆ సమయంలో కూడా అతడు రోజు విడిచి రోజు ఒక కొత్త అమ్మాయిలతో క్యాజువల్ సెక్స్ చేసే వాడిని అని గొప్పగా చెప్పుకునేవాడు. ఇతరుల అలవాట్ల గురించి నేను జడ్జ్ చేయను కానీ ఆ అలవాటు ఒక వ్యసనంగా మారినపుడు చెప్పడంలో తప్పులేదు అని నా ఉద్దేశ్యం... అని ఇండియా టుడే ఇంటర్వ్యూలో కంగనా తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాన్న మరణాంతరం అలా జరిగింది, తట్టుకోలేకపోయా.. అమ్మ దు:ఖంలో.. మంచి భర్తగా మారిపోయా.. ఎన్టీఆర్

అరవింద సమేత షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ఆ విషాద సంఘటన తర్వాత చిత్రీకరించిన పెనిమిటి పాటతో మరోసారి విషాదంలో మునిగిపోయానని ఎన్టీఆర్ వెల్లడించారు. 11న అరవింద సమేత రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

మీదపడి పెదవులు కొరికాడు.. భార్యకు కూడా నరకం.. క్వీన్ దర్శకుడిపై నటి ఆరోపణలు

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, క్వీన్ మూవీ దర్శకుడు వికాస్ బెహల్‌పై లైంగిక ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో మరోసారి సంచలనంగా మారింది. బాంబే వెల్వెట్ ప్రమోషన్‌ టూర్‌లో తనను లైంగిక వేధించాడని ఓ నటి ఆరోపణలు చేసింది.

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

బాలకృష్ణను గూగుల్ తల్లి చంపేసింది.. దారుణంగా డేత్ డేట్.. తప్పు ఎలా జరిగిందంటే..

ఇంటర్నెట్‌లో ఎలాంటి పొరపాటైన జరుగవచ్చు అనే సంఘటనకు ఉదాహరణగా బాలకృష్ణ వికీపీడియా పేజ్ నిలిచింది. బాలకృష్ణ మరణించారంటూ చూపిస్తున్న విధానం గూగుల్ లోపాలకు నిదర్శనంగా మారింది. ఎందుకు ఏం జరిగిందంటే..

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

ఆయనను బాధపెట్టడం ఇష్టం లేదు.. అందుకే మౌనం.. అత్తారింటికి దారేది తర్వాత.. త్రివిక్రమ్

అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత అంశాలను తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. త్రివిక్రమ్ చెప్పిన విషయాలను ఆయన మాటల్లోనే..

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

ఆ ఇద్దరంటే నాకు నచ్చదు.. వాళ్లు తవ్వుకొన్న గోతిలో వాళ్లే పడ్డారు.. కౌశల్

బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ తన ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌లో జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు వెల్లడిసున్నారు.

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

40 రోజులు అడవిలో ఎన్టీఆర్.. నా జీవితానికి ప్రాణం పోశారు!

టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో రాఘవేంద్ర రావు ఒకరు. దశాబ్దాల పాటు కమర్షియల్ దర్శకుడిగా విజయాలు సాధించడం సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలకు రాఘవేంద్ర రావు మంచి విజయాలు అందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాఘవేంద్ర రావు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

సవతి తల్లి సోదరుడి నిజాలు బయటకు.. శరత్ కుమార్ కుమార్తె ఏం చేసిందో తెలుసా!

తనుశ్రీ సంచలన ఆరోపణలతో మొదలైంది మీ టూ క్యాంపైన్ ఇప్పుడు దక్షణాది చిత్ర పరిశ్రమకు కూడా చేరింది. జాతీయం మీడియాలో ఎడతెరిపి లేకుండా మీ టూ క్యాంపైన్ గురించి చర్చ జరుగుతోంది. తనుశ్రీ దత్త, కంగనా రనౌత్, ఇతర నటీమణులంతా తమకు ఎదురైనా చేదు వాస్తవాలని బట్టబయలు చేస్తున్నారు. సింగర్ చిన్మయి కూడా ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. తాజగా ఓ మహిళా తమిళ సీనియర్ నటుడు రాధా రవిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

మీటూ ఉద్యమం: అప్పుడే చెప్పా.. సల్మాన్‌పై ఐశ్యర్యారాయ్ హాట్ కామెంట్స్!

మీటూ ఉద్యమంతో బాలీవుడ్ అట్టడుగుతోంది. ప్రతి ఒక్క నటి, నటుడు లైంగిక వేధింపుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనుశ్రీ దత్త సంచలనకామెంట్స్ తో మొదలైన ఈ చర్చ తీవ్రంగా మారుతోంది. బాలీవుడ్ నటుల నుంచి వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లు, నటీమణులు, ఇతర మహిళలు సోషల్ మీడియా వేదికగా వాస్తవాలు బట్టబయలు చేస్తున్నారు. ఎవరి గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమో అనే భయాందోళన బాలీవుడ్ నటులు, దర్శక నిర్మాతల్లో నెలకొని ఉంది. తాజగా అందాల తార ఐశ్వర్యారాయ్ మీటూ ఉద్యమం గురించి, లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది.

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

భార్య ముందే దర్శకుడి చెంప పగలగొట్టింది.. బయటపడ్డ నిజస్వరూపం, వీడియో వైరల్!

హీరోయిన్లని లైంగికంగా వేధిస్తున్న బాలీవుడ్ ప్రముఖుల నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. పలువురు నటీమణులు మీటూ ఉద్యమం ద్వారా సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో సెలబ్రిటీలుగా చలామణీ అవుతున్న వారంతా ఈ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లైంగిక వేధింపుల అంశం బాలీవుడ్ లో దుమారం రేపుతోంది. ప్రముఖ నటి గీతికా త్యాగి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ కపూర్ చెంప చెళ్లుమనిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

వీరరాఘవ జోరు.. ముచ్చటగా మూడో సినిమాపై త్రివిక్రమ్ గురి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరరాఘవుడిగా బాక్సాఫీస్ వద్ద విధ్వంసాలు మొదలుపెట్టాడు. అరవింద సమేత చిత్రం తిరులేని పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అజ్ఞాతవాసి పరాజయం నుంచి తేరుకున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేసి విజయాన్ని అందుకున్నాడు. రికార్డులన్నీ తుడిచి పెట్టేవరకు అరవింద సమేత జోరు తగ్గేలా లేదు. అరవింద సమేత చిత్రంతో త్రివిక్రమ్ కేంద్రంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

English summary
Hero Nikhil tweet about Vijay Devarakonda, Allu arjun wants do movie with Trivikram, Geetika Tyagi slapping director, Aishwarya Rai Bachchan on Me Too, Balakrishna death date on google, Vairamuthu and Radha Ravi faces sexual allegations. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more