For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: లారెన్స్‌తో శ్రీరెడ్డి కుమ్మక్కు, మంచు లక్ష్మి బాధితురాలే, టాప్ డైరెక్టర్ రాసలీలలు...

|

తప్పయితే నా తల్లి, వదినకు వర్తిస్తుందంటూ జబర్దస్త్ కాంట్రవర్సీపై ముక్కు అవినాష్, మంచు లక్ష్మి మీటూ బాధితురాలే, 'అరవింద సమేత' డిబేట్లో పాల్గొనేందుకు వస్తుండగా ప్రమాదం, అవునురా... నీకేంటి నొప్పి? నటి మాధవి లత ఆగ్రహం, కీరవాణి చెల్లిని కాబట్టే ఫీలయ్యాడు, రాజమౌళి అన్నతో చిన్నతనంలో... పోసానితో గొడవ గురించి ఎంఎం శ్రీలేఖ, బాల్యంలోనే లైంగిక దాడులు.. 14 ఏట రేప్‌కు గురయ్యా.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, హీరోయిన్ రూమ్‌లోకి వెళ్తే ఇక అంతే, ఆ భయంతో.. మీ టూపై రాధారవి....ఇలా గతం వారం పలు అంశాలు ఇంటర్నెట్లో ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్సయి ఉంటే... ఓ లుక్కేయండి.

తప్పయితే నా తల్లి, వదినకు వర్తిస్తుంది: జబర్దస్త్ కాంట్రవర్సీపై ముక్కు అవినాష్

తప్పయితే నా తల్లి, వదినకు వర్తిస్తుంది: జబర్దస్త్ కాంట్రవర్సీపై ముక్కు అవినాష్

జబర్దస్త్ స్కిట్ వివాదంపై ముక్కు అవినాష్ స్పందించారు. కొందరు ఆ డైలాగును మరో విధంగా తీసుకున్నారు. ఆ విధంగా తీసుకుంటే అది నా తల్లి, వదినకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నా తండ్రి 25 సంవత్సరాలు గల్ఫ్‌లో పని చేశాడు. మా అన్నయ్య ప్రస్తుతం కూడా అక్కడే పని చేస్తున్నాడు.... అని అవినాష్ అన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మంచు లక్ష్మి మీటూ: నేనూ బాధితురాలినే... ఫసక్, పవన్ కళ్యాణ్, ఇంకా చాలా!

మంచు లక్ష్మి మీటూ: నేనూ బాధితురాలినే... ఫసక్, పవన్ కళ్యాణ్, ఇంకా చాలా!

మీటూ ఉద్యమంపై మంచు లక్ష్మి స్పందించారు. తనకు సినిమా ఇండస్ట్రీలో కాదు కానీ నిజ జీవితంలో వేధింపులు ఎదురయ్యాయని అభిమానులతో ట్విట్టర్ చాట్లో తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, మోహన్ బాబు ఫసక్, ఇతర అంశాలపై కూడా స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘అరవింద సమేత' డిబేట్లో పాల్గొనేందుకు వస్తుండగా ప్రమాదం, రాయలసీమ విద్యార్థి నేత మృతి!

‘అరవింద సమేత' డిబేట్లో పాల్గొనేందుకు వస్తుండగా ప్రమాదం, రాయలసీమ విద్యార్థి నేత మృతి!

అరవింద సమేత చిత్రంలోని సన్నివేశాలు, సీన్లు రాయలసీమ ప్రాంతాన్ని అవమానించే విధంగా ఉందని ఆరోపణలు చేసిన రాయలసీమ పోరాట సమితి విద్యార్థి నేతలు ఈ విషయంలో ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొనేందుకు వస్తుండగా రోడ్డు పమాదానికి గురయ్యారు. వీరిలో జలం శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అవునురా... నీకేంటి నొప్పి? నటి మాధవి లత ఆగ్రహం!

అవునురా... నీకేంటి నొప్పి? నటి మాధవి లత ఆగ్రహం!

ఇటీవల బతుకమ్మ సంబరాలు శ్రీనగర్ కాలనీలో జరిగితే వెళ్లాను. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెట్టాను. చాలా మంది నన్ను పొట్టిది, పొట్టిది అంటూ కామెంట్స్ పెట్టారు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే... ‘‘అవును రా బై... నేను పొట్టిగనే ఉంటా, నేను పొట్టిగుండటం వల్ల నీకు ఎక్కడైనా నొప్పొచ్చిందా?'' అంటూ మాధవి లత ఫైర్ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కీరవాణి చెల్లిని కాబట్టే ఫీలయ్యాడు, రాజమౌళి అన్నతో చిన్నతనంలో... పోసానితో గొడవ: ఎంఎం శ్రీలేఖ

కీరవాణి చెల్లిని కాబట్టే ఫీలయ్యాడు, రాజమౌళి అన్నతో చిన్నతనంలో... పోసానితో గొడవ: ఎంఎం శ్రీలేఖ

తెలుగులో వన్ అండ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్‌గా రికార్డులకెక్కడమే కాదు.... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంఎం శ్రీలేఖ. తెలుగు, తమిళం, హిందీలో దాదాపు 80 సినిమాలకు ఆమె సంగీతం అందించారు. దాదాపు 4 వేలకు పైగా పాటలు పాడారు. తాజాగా తన సరదాగా షోలో పాల్గొన్న శ్రీలేఖ నుండి ఆసక్తికర విషయాలు రాబట్టారు కమెడియన్ అలీ.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాల్యంలోనే లైంగిక దాడులు.. 14 ఏట రేప్‌కు గురయ్యా.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి

బాల్యంలోనే లైంగిక దాడులు.. 14 ఏట రేప్‌కు గురయ్యా.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి

బాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ టూ ఉద్యమ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి తనపై పాకిస్థాన్‌లో జరిగిన లైంగిక దారుణాలపై మరోసారి గుర్తు చేసుకొన్నారు. బాల్యంలో తనపై జరిగిన రేప్, లైంగిక వేధింపులను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా బహిర్గతం చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హీరోయిన్ రూమ్‌లోకి వెళ్తే ఇక అంతే, ఆ భయంతో.. మీ టూపై రాధారవి

హీరోయిన్ రూమ్‌లోకి వెళ్తే ఇక అంతే, ఆ భయంతో.. మీ టూపై రాధారవి

తమిళ పరిశ్రమలో ప్రముఖ నటుడు రాధారవి మీ టూ ఉద్యమంపై వ్యంగ్యస్త్రాలు విసిరారు. ఇటీవల ఓ తమిళ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన ప్రస్తుత పరిస్థితిపై తనదైన శైలిలో స్పందించారు. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధారవి.. పబ్లిసిటీ కోసం కామెంట్లు చేయడం సర్వసాధారణమైంది. అని అన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 ఆ నటుడు చీడపురుగు.. నా దుప్పట్లో దూరి.. కాసేపు పడుకోమని.. హీరోయిన్ ఆరోపణ

ఆ నటుడు చీడపురుగు.. నా దుప్పట్లో దూరి.. కాసేపు పడుకోమని.. హీరోయిన్ ఆరోపణ

దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఊపందుకోవడంతో తమకు జరిగిన అన్యాయాలను హీరోయిన్లు బయటపెడుతున్నారు. గత కొద్దిరోజులుగా మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవల నటుడు ముఖేష్, సంగీత దర్శకుడు గోపి సుందర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటుడు అలెన్సియర్‌పై కూడా పేరు తెలియజేయడానికి ఇష్టపడని నటి తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో పలుమార్లు దారుణంగా ప్రవర్తించారని ఫేస్‌బుక్‌లో ఇండియా ప్రొటెస్ట్స్ అనే పేజ్ ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మహేష్ 26 కథ తెలిస్తే షాకే.. ప్రిన్స్ కెరీర్‌లోనే తొలిసారి.. సుకుమార్ మరో ప్రయోగం

మహేష్ 26 కథ తెలిస్తే షాకే.. ప్రిన్స్ కెరీర్‌లోనే తొలిసారి.. సుకుమార్ మరో ప్రయోగం

భరత్ అనే నేను సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు మంచి జోరు మీద కనిపిస్తున్నాడు. ఓ వైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తూనే మరో వైపు తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. రంగస్థలం రికార్డు హిట్‌తో చెలరేగిన దర్శకుడు సుకుమార్‌తో మహేష్ జతకడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమా కథకు సంబంధించి బయటకు వచ్చిన విషయం ఆసక్తిని రేపుతున్నది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అయ్యో బాబోయ్.. ఇక అలాంటి చిత్రాల జోలికి పోను.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్

అయ్యో బాబోయ్.. ఇక అలాంటి చిత్రాల జోలికి పోను.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్

మహానటి సినిమా తర్వాత అందాల నటి కీర్తి సురేష్ కెరీర్‌ తారాజువ్వలా నింగికి ఎగిసింది. తనదైన నటనతో అగ్రశ్రేణి హీరోయిన్‌గా మారింది. దక్షిణాదిలో మహానటి చిత్రం కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా పందెం కోడి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కీర్తి సురేష్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆయనకు మసాజ్ చేయడానికి ఒప్పుకున్నా.. ఆ రాత్రి గడపకపోతే.. 73 ఏళ్ల దర్శకుడి రాసలీలలు!

ఆయనకు మసాజ్ చేయడానికి ఒప్పుకున్నా.. ఆ రాత్రి గడపకపోతే.. 73 ఏళ్ల దర్శకుడి రాసలీలలు!

మీటూ ఉద్యమం బాలీవుడ్ లో పెను దుమారంగా మారుతోంది. మీటూ ఉద్యమం ప్రారంభమైంది హాలీవుడ్ లో. అక్కడ కూడా ఇంత సంచలనం సృష్టించలేదేమో. కానీ బాలీవుడ్ లో మీటూ ఉద్యమం వలన కొందరి జాతకాలే తిరగబడిపోతున్నాయి. ప్రముఖ నటి, మోడల్ అయిన కేట్ శర్మ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు 73 ఏళ్ల సుభాష్ ఘయ్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనని బలవంతంగా అనుభవించడానికి ప్రయతించాడని తాజాగా ఆమె పోలీసు కేసు నమోదు చేసింది. సీనియర్ దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ వీడియోలు తొలగించకుంటే రెండు రోజుల్లో మీ సంగతి చెబుతా.. గీత మాధురి!

ఆ వీడియోలు తొలగించకుంటే రెండు రోజుల్లో మీ సంగతి చెబుతా.. గీత మాధురి!

బిగ్ బాస్2 లో ప్రముఖ సింగర్ గీతా మాధురి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన కౌశల్ కు గీతా మాధురి గట్టి పోటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో తీవ్రమైన వ్యతిరేకతని, నెగిటివ్ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన గీతా మాధురి తాజగా సీరియస్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఘాటు వార్నింగ్ ఇచ్చింది. గీతా మాధురి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇన్నిరోజులు బూతులు తిట్టి.. ఏకంగా లారెన్స్ ఇంట్లోనే శ్రీరెడ్డి, సాధించుకొచ్చింది!

ఇన్నిరోజులు బూతులు తిట్టి.. ఏకంగా లారెన్స్ ఇంట్లోనే శ్రీరెడ్డి, సాధించుకొచ్చింది!

మీడియా సంచలనం శ్రీరెడ్డి తాజగా సంచలన విషయం ప్రకటించింది. గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి తెలుగు, తమిళ సినీప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ తో తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ తరువాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఇపుడు లారెన్స్‌తో సినిమా కమిట్ అవ్వడం చర్చనీయాంశం అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ సుమ, ఝాన్సీ రహస్య మీటింగ్.. టాలీవుడ్‌లో మొదలైన మూవ్‌మెంట్!

యాంకర్ సుమ, ఝాన్సీ రహస్య మీటింగ్.. టాలీవుడ్‌లో మొదలైన మూవ్‌మెంట్!

బాలీవుడ్, తమిళ చిత్ర పరిశ్రమల్ని మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. టాలీవుడ్ లో కూడా అలాంటి ఉద్యమం మొదలయిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది మహిళా సినీప్రముఖులు ఇటీవల రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీరు చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రహస్య భేటీలో యాంకర్ సుమ, ఝాన్సీ వంటి ప్రముఖులు ప్రధాన పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Jabardasth mukku avinash apologize, lakshmi manchu twitter chat, rayalaseema youth leader jalam srinivas, madhavi latha expressed angry, somy ali sexually abused, radha ravi mocked Me too...Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more