For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్దామనుకుంది.. వ్యభిచారి అని అన్నారు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రామ్ చరణ్, RRR, ప్రభాస్ పెళ్లి, షాలిని పాండే లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  వ్యభిచారి అని అన్నారు.. ఆ నిర్మాత డేట్‌కు పిలిచాడు.. నటి షాకింగ్ కామెంట్స్

  వ్యభిచారి అని అన్నారు.. ఆ నిర్మాత డేట్‌కు పిలిచాడు.. నటి షాకింగ్ కామెంట్స్

  దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన అనంతరం ఫ్రెంచి అమ్మాయి కల్కి కొచ్లిన్ వార్తల్లోకెక్కింది. బ్రేకప్ తరువాత కొన్నాళ్లకు గయ్ హెర్ష్ బర్గ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా అతడితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ క్రమంలోనే బేబి బంప్ ని ప్రదర్శిస్తూ పలు మ్యాగజైన్లు.. మీడియాలకు కల్కి ఇంటర్వ్యూలు ఇస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జీవితం ముందు అవన్నీ చిన్నవే.. రష్మికతో బ్రేకప్ విషయంపై రక్షిత్

  జీవితం ముందు అవన్నీ చిన్నవే.. రష్మికతో బ్రేకప్ విషయంపై రక్షిత్

  రష్మిక మందాన్న అంటే తెలుగువారందరికీ పరిచయమే. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టిన రష్మిక.. ఆపై వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. గీతగోవిందం అంటూ విజయ్ దేవరకొండతో చేసిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మళ్లీ అదే హీరోతో చేసిన డియర్ కామ్రేడ్‌ అంతగా కలిసి రాకపోయినా.. అవకాశాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. అయితే సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా రష్మికకు చేదు అనుభవమే ఎదురైంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  స్విమ్మింగ్ పూల్‌లో సవారి.. బికినీ అందాలతో ఫ్యాన్స్‌కు కాజల్ ట్రీట్

  స్విమ్మింగ్ పూల్‌లో సవారి.. బికినీ అందాలతో ఫ్యాన్స్‌కు కాజల్ ట్రీట్

  అందాల చందమామ, కలువ కళ్ల భామ కాజల్ అగర్వాల్. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన కాజల్.. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఓ ఊపు ఊపేసింది. ఇక్కడ వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో ఆఫర్లను పట్టేసింది. అయితే అక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. మళ్లీ తిరుగుపయనం కట్టి కోలీవుడ్, టాలీవుడ్ ప్రదక్షిణాలు చేస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గుట్టు చప్పుడు కాకుండా వెళ్దామనుకుంది.. అడ్డంగా దొరికేసిన నటి.. వీడియో వైరల్

  గుట్టు చప్పుడు కాకుండా వెళ్దామనుకుంది.. అడ్డంగా దొరికేసిన నటి.. వీడియో వైరల్

  ఒకప్పుడు సినిమాను సహజ సిద్దంగా తెరకెక్కించేవారు. కూరగాయాల మార్కెట్ అయినా, థియేటర్ సీన్లైనా, ఏదైనా జనసమూహం ఉన్న రోడ్లైనా సరే న్యాచురల్ లుక్ వచ్చేందుకు అందరి మధ్య ఉండగానే తీసేవారు. అప్పట్లో అలా జరిగేది కానీ.. నేటి పరిస్థితులో అలా షూటింగ్లను పూర్తి చేయలేము. ఓ హీరోనో, లేక హీరోయినో రోడ్డుపై అందరి మధ్య నడిస్తే అసలు షూటింగ్ కాదు కదా.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అందుకే అన్నీ సెట్టింగ్ల మయం అయిపోతున్నాయి. కాదు కూడదు అనుకుంటే పక్క రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి షూటింగ్‌లు చేసుకోవాలి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాలయ్య చేతిలో చీపురుకట్ట.. రూలర్ కాదు క్లీనర్.. నెటిజన్ల ట్రోలింగ్‌తో పోస్టర్ వైరల్

  బాలయ్య చేతిలో చీపురుకట్ట.. రూలర్ కాదు క్లీనర్.. నెటిజన్ల ట్రోలింగ్‌తో పోస్టర్ వైరల్

  నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది పీడకలను మిగిల్చి వెళ్లిపోతోంది. 2019 బాలయ్యకు మరపురాని సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించి, నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఘోరమైన పరాభవాన్ని చవిచూశాయి. ఆర్థిక పరంగా కలిగిన నష్టాల కంటే.. నందమూరి అభిమానులకు కలిగిన నిరాశే ఎక్కువ. కనీసం ఏడాది చివర్లో రూలర్ చిత్రంతోనైనా హిట్ కొడతాడేమోనని అభిమానులు కలలు కన్నారు. కానీ అది కూడా పీడకలగానే మారిపోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. అందాలతో మతి పోగొడుతున్న పునర్నవి

  వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. అందాలతో మతి పోగొడుతున్న పునర్నవి

  బిగ్‌బాస్ మూడో సీజన్‌కు ఏ ముహుర్తాన ఓకే చెప్పిందో కానీ.. పునర్నవిని ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న అందరికీ పాపులార్టీ వస్తుందా? అంటే చెప్పలేం. కొంతమందికి ఉన్న ఫేమ్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం చాలా మందికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి వరకు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులను కూడా సెలెబ్రిటీలను చేసేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అబ్బుర పరుస్తున్న రామ్ చరణ్ టాలెంట్.. ఫిదా అయిన సమంత

  అబ్బుర పరుస్తున్న రామ్ చరణ్ టాలెంట్.. ఫిదా అయిన సమంత

  రామ్ చరణ్ నటన, డ్యాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిన తనయుడిగా నిరూపించుకున్నాడు. పట్టు మని పది సినిమాలు కూడా తీయకుండానే రెండు ఇండస్ట్రీ హిట్‌లతో దూసుకుపోతున్నాడు. అయితే ఇదంతా సినీ రంగం వైపు చరణ్ సాధించిన విషయాలే కానీ, అతనిలో నిగూఢంగా దాగి ఉన్న మరో ప్రతిభ ఉందన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  భర్తకు వెరైటీ గిఫ్ట్.. ప్యాంట్ విప్పి మరీ.. వేడి పుట్టించేలా సింగర్ పోజ్‌

  భర్తకు వెరైటీ గిఫ్ట్.. ప్యాంట్ విప్పి మరీ.. వేడి పుట్టించేలా సింగర్ పోజ్‌

  కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ గురించి సంగీత ప్రియులకు తెలిసే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జస్టిన్‌కు ఇండియాలోనూ అభిమానులున్నారు. తెలుగు సింగర్లలోనూ జస్టిన్ బీబర్ అంటే పడి చచ్చే వారున్నారు. జస్టిన్ బీబర్‌కు పెళ్లి అయిందనే వార్తలు వినగానే ఎంతో మంది అమ్మాయిల హృదయాలు వేదనకు గురయ్యాయి. అంతటి లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న జస్టిన్.. తన భార్య హెయిలీ బీబర్‌ను ఎంతో గొప్పగా ప్రేమిస్తాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇండియన్ ఆర్మీని అవమానించిన సరిలేరు టీమ్.. నెటిజన్స్ ఫైర్

  ఇండియన్ ఆర్మీని అవమానించిన సరిలేరు టీమ్.. నెటిజన్స్ ఫైర్

  మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న సరిలేరు నీకెవ్వరుచిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ వరుస విజయాలతో దూసుకుపోతుండగా.. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరోవైపు అపజయం అంటే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈచిత్రాన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కే కాకుండా.. సగటు సినీ అభిమాని ఇష్టపడే విధంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాలయ్య విగ్గులపై జోకులు.. అసలు కహానీ ఇదీ..!

  బాలయ్య విగ్గులపై జోకులు.. అసలు కహానీ ఇదీ..!

  బాలయ్య సినిమాలు ఒకెత్తు అయితే.. ఆయన గెటప్పులు మరో ఎత్తు. సినిమా కథ, కథనాలు ఎంత జాగ్రత్తగా రాసుకుంటారో.. బాలయ్య గెటప్, విగ్గులు కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో ఎన్ని రకాల మీమ్స్ హల్ చల్ చేస్తుంటాయో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తాజాగా విడుదలైన రూలర్ చిత్రం ఏ మేరకు విమర్శపాలైందో అందరికీ తెలిసిందే. ఇందులోని బాలయ్య లుక్‌పై ఫస్ట్ నుంచే ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బన్నీ లేకుండానే పరుగులు పెట్టిస్తోన్న సుకుమార్.. ఆ సీన్ సినిమాకే హైలెట్

  బన్నీ లేకుండానే పరుగులు పెట్టిస్తోన్న సుకుమార్.. ఆ సీన్ సినిమాకే హైలెట్

  రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సుకుమార్. ఈ చిత్రం వచ్చి ఏడాది దాటి పోయినా మరో చిత్రాన్ని ప్రేక్షకులకు అందించలేకపోయాడు మన లెక్కల మాష్టారు. అయితే మధ్యలో అనుకున్న ప్రాజెక్ట్‌లు సెట్ కాకపోవడంతో తనకు కలిసొచ్చిన అల్లు అర్జున్‌తో ఫిక్స్ అయ్యాడు. ఎలాగూ హాట్రిక్ కొట్టేందుకు ఒక్క చిత్రమే బాకీ ఉండటంతో ఆ ముచ్చట కూడా తీరుందని ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేసేందుకు సిద్దమయ్యారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఒంటరిగా రావాలని అన్నారు.. భయంతో పారిపోయి వచ్చేశాను.. అంకిత కామెంట్స్

  ఒంటరిగా రావాలని అన్నారు.. భయంతో పారిపోయి వచ్చేశాను.. అంకిత కామెంట్స్

  4 లెటర్స్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అంకిత మహారానా.. రెండో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. విలక్షణ నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వంలో రాబోతోన్న ఊల్లాల ఊల్లాల చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది అంకిత. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించిన అంకిత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఘనంగా నవిష్క పుట్టినరోజు వేడుకలు.. విషెస్ చెప్పిన ఉపాసన, రామ్ చరణ్

  ఘనంగా నవిష్క పుట్టినరోజు వేడుకలు.. విషెస్ చెప్పిన ఉపాసన, రామ్ చరణ్

  మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-కళ్యాణ్ దేవ్‌ల కూతురు నవిష్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలతో పాటు నవిష్క ఫస్ట్ బర్త్‌డే ఈవెంట్ చాలా గ్రాండ్‌గానే జరిగినట్టు తెలుస్తోంది. ఇక నవిష్కకు మామ రామ్ చరణ్, అత్త ఉపాసనల నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. నవిష్కకు పిన్ని అయిన నిహారిక, పెద్దమ్మ సుష్మిత నుంచి బర్త్ డే విషెస్ వెళ్లాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో నవిష్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డైరెక్టర్‌పై తూ అనే ఊసిన స్టార్ హీరోయిన్.. అసలు కథ ఏంటంటే..?

  డైరెక్టర్‌పై తూ అనే ఊసిన స్టార్ హీరోయిన్.. అసలు కథ ఏంటంటే..?

  ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది రష్మిక మందాన్న. మొదటి చిత్రమే సక్సెస్ కావడం, రష్మిక లుక్స్, యాక్టింగ్ బాగుండటం ఇలా అన్నీ రష్మికకు కలిసొచ్చాయి. అటుపై గీత గోవిందం లాంటి చిత్రంలో అవకాశం రావడం, అది తిరుగులేని విజయం సాధించడంతో రష్మిక అదృష్టం.. దరిద్రం పట్టినట్టు పట్టింది. ఇక ఈ చిత్రం తరువాత రష్మిక తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Ram Charan, Nandamuri Balakrishna, Samantha Akkineni, Upasana in the news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X