twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: పవన్‌పై చెడుగా మాట్లాడను.. కోటి కొట్టేసిన ప్రియా.. ఆమె టీషర్టులో కౌశల్ చేయి

    By Staff
    |

    టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

    పవన్ కళ్యాణ్‌పై చెడుగా మాట్లాడను: రేణు దేశాయ్ ఫైర్

    పవన్ కళ్యాణ్‌పై చెడుగా మాట్లాడను: రేణు దేశాయ్ ఫైర్

    పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఫేక్ వార్తలపై స్పందించాలని అభిమానులు రేణు దేశాయ్‌పై ఒత్తిడి తేవడంతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. గతంలో నాకు వేధింపులు ఎదురైనపుడు మీరంతా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వలేదు? ఆయనకో రూల్, నాకో రూలా? అంటూ ఫైర్ అయ్యారు. పూర్తి వివరాల ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి.

    ఏంది బే.. మొత్తం చెప్పవా.. బయటకు రా కొడుతా.. గణేష్‌పై గోగినేని ఫైర్!

    ఏంది బే.. మొత్తం చెప్పవా.. బయటకు రా కొడుతా.. గణేష్‌పై గోగినేని ఫైర్!

    ఎమోషనల్ కంటెంట్‌తో తమాషా సంఘటనలతో బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ సో కొనసాగుతున్నది. ఈ వారం నామినేసన్ ప్రక్రియలో భాగంగా టెలిఫోన్ ద్వారా నామినేషన్ ప్రక్రియను చేపట్టారు. ఇందులో గణేష్‌ను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే బాబు గోగినేని రెండు కొత్తీ మీర కట్టలు తినాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని బాబుకు చెప్పగా అందుకు సిద్ధమయ్యారు. కానీ వారి మధ్య ఓ తమాషా సంఘటన జరిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    కోటి రూపాయలు కొట్టేసిన ప్రియా వారియర్.. షాక్‌లో మలయాళ ఇండస్ట్రీ!

    కోటి రూపాయలు కొట్టేసిన ప్రియా వారియర్.. షాక్‌లో మలయాళ ఇండస్ట్రీ!

    ఒక్కసారి కన్నుగీటి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ వ్యాపార ప్రకటనల రంగంలో కూడా కుమ్మేస్తున్నది. ఒకే చిత్రంలో నటించిన ఈ అందాల భామ భారీ రెమ్యునరేషన్ కొట్టేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల ఓ వ్యాపార ప్రకటనలో నటించి ఊహించని విధంగా పారితోషికాన్ని సొంతం చేసుకొన్నది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పవన్ కళ్యాణ్-షకలక శంకర్ ఇష్యూ... డబ్బు వేస్ట్ చేయడం వల్లే, ఆలీ సాక్షిగా ఇదే నిజం...

    పవన్ కళ్యాణ్-షకలక శంకర్ ఇష్యూ... డబ్బు వేస్ట్ చేయడం వల్లే, ఆలీ సాక్షిగా ఇదే నిజం...

    'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ సమయంలో కమెడియన్ షకలక శంకర్ మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అపుడు ఏం జరిగింది? ఆయన ఎందుకు తిట్టారు? దీనిక వెనక జరిగిన అసలు సంఘటన ఏమిటి? అనే విషయాలను అలీతో సరదాగా కార్యక్రమంలో శంకర్ బయట పెట్టారు. 'శంభో శంకర' సినిమాతో హీరోగా మారిన ఈ కమెడియన్ దీంతో పాటు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో.... మురుగదాస్ మీద శ్రీరెడ్డి

    ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో.... మురుగదాస్ మీద శ్రీరెడ్డి

    తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పోరాటం చేస్తూ అర్దనగ్న ప్రదర్శనకు దిగడం ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యపై నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ పడేలా చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత హీరో నాని, పలువురు దర్శకులు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ తమిళ దర్శకుడు, సౌత్‌లో మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోలతో భారీ సినిమాలు తీసిన ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా ఛాతిలో, టీషర్టులో కౌశల్ చేయి పెట్టాడు: భానుశ్రీ.. వాడికి క్యారెక్టర్ లేదు.. భానుశ్రీకి జైలుశిక్ష

    నా ఛాతిలో, టీషర్టులో కౌశల్ చేయి పెట్టాడు: భానుశ్రీ.. వాడికి క్యారెక్టర్ లేదు.. భానుశ్రీకి జైలుశిక్ష

    బిగ్‌బాస్‌లో మంచి, చెడు టాస్క్ గందరగోళాన్ని రేపింది. ఇంటి సభ్యుల మధ్య గొడవ దిగజారిన మాటలకు దారి తీసింది. కౌశల్, భానుశ్రీ మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కౌశల్, భానుశ్రీకి మధ్య చిచ్చు రేపడానికి తేజస్విని చేసిన ప్రయత్నాలకు సింగర్ గీతామాధురీ గండి కొట్టింది. భానుశ్రీ చెత్త ప్రవర్తనకు జైలుశిక్ష అనుభవించాల్సిన ఖర్మ పట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పవన్ కళ్యాణే విడాకులు అడిగారు: రేణు దేశాయ్

    పవన్ కళ్యాణే విడాకులు అడిగారు: రేణు దేశాయ్

    నేను విడాకులు ముందు అడగలేదు. కళ్యాణ్ గారే ముందు డైవర్స్ కావాలన్నారు. ఈ విషయం నాకు, ఆయనకు, ఆ దేవుడికే తెలుసు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చాలా వాదన జరిగింది. ఆయన డైవర్స్ కావాలని తెగేసి చెప్పారు. నేను కూడా ఇచ్చేస్తాను అని చెప్పేశాను. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    మాజీ భర్తకు రెండో పెళ్లి.. అమలా పాల్ మనస్తాపం.. షూటింగ్ వదిలేసి..!

    మాజీ భర్తకు రెండో పెళ్లి.. అమలా పాల్ మనస్తాపం.. షూటింగ్ వదిలేసి..!

    అందాల తార అమలా పాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. అమలా పాల్‌తో వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో కొద్దికాలంగా వారు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. తాజాగా వారికి విడాకులు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్త బయటకు పొక్కింది. అయితే ఆ వార్తపై విజయ్ స్పందించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    11 ఏళ్లు నాతో కాపురం చేసి.. మరో అమ్మాయితో బిడ్డను కంటే ఊరుకుంటారా?.. రేణు దేశాయ్

    11 ఏళ్లు నాతో కాపురం చేసి.. మరో అమ్మాయితో బిడ్డను కంటే ఊరుకుంటారా?.. రేణు దేశాయ్

    11 ఏళ్లు నాతో కాపురం చేసి.. మరో అమ్మాయితో బిడ్డను కంటే ఊరుకుంటారా?.. అంటూ తనపై విమర్శలు చేస్తున్న కొందరు మహిళా అభిమానులను ఉద్దేశించి రేణు దేశాయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌తో విడాకులకు గల కారణం చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    లెక్కలేనని లిప్‌లాక్స్.. ఒళ్లు దగ్గర పెట్టుకొన్నా.. చాలా మంది ఒప్పుకోలేదు.. ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూ

    లెక్కలేనని లిప్‌లాక్స్.. ఒళ్లు దగ్గర పెట్టుకొన్నా.. చాలా మంది ఒప్పుకోలేదు.. ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూ

    అర్జున్‌రెడ్డి తర్వాత రిలీజ్‌కు ముందే మంచి హైప్ వచ్చిన చిత్రం RX 100. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్‌లో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తీకేయ రొమాన్స్, కెమిస్ట్రీ‌ చర్చనీయాంశమైంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి మేకింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఈ దాడి సహించం: చీపురుతో కొడుతున్న వీడియోతో నాగబాబు సంచలనం!

    ఈ దాడి సహించం: చీపురుతో కొడుతున్న వీడియోతో నాగబాబు సంచలనం!

    ఈ దాడి సహించం: చీపురుతో కొడుతున్న వీడియోతో నాగబాబు సంచలనం!

    హిందువులు దేవుడుగా ఆరాధించే శ్రీరాముడి మీద కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సినీ నటుడు, నిర్మాత నాగబాబు తీవ్రంగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. హిందూ మతంపై, హిందూ సంస్కృతిపై దాడి జరుగుతోంది అంటూ ఆయన తనదైన వాదన వినిపించారు. ఈ దాడి సహించం అంటూ చీపురుతో కొడుతున్న వీడియోతో పోస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి ఫోటోలు వైరల్.. నమ్రతా, రాంచరణ్, ఉపాసన హంగామా!

    అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి ఫోటోలు వైరల్.. నమ్రతా, రాంచరణ్, ఉపాసన హంగామా!

    అక్కినేని నట వారసుడు అఖిల్ మాజీ ప్రేయసి శ్రేయా భూపాల్ పెళ్లి అనిరుధ్ రెడ్డితో ఘనంగా జరిగింది. అనిందిత్ రెడ్డి అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ రెడ్డి మనువడు అనే విషయం తెలిసిందే. శ్రేయా భూపాల్, అనిందిత్ రెడ్డి వివాహం ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఘనంగా జరిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    త్రివిక్రమ్ భార్య నాట్య ప్రదర్శన: సతీసమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

    త్రివిక్రమ్ భార్య నాట్య ప్రదర్శన: సతీసమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్ (ఫోటోస్)


    ప్రముఖ తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో సినిమా ఫంక్షన్లలో తప్పితే బయట ఎక్కువగా కనిపించరు. ఇక ఆయన భార్య, ఫ్యామిలీ మెంబర్స్ అత్యంత అరుదుగా మీడియా దృష్టిలో పడుతుంటారు. వారి గురించిన వివరాలు కూడా పెద్దగా ఎవరికీ తెలియవు. ఇటీవల రవీంద్ర భారతిలో త్రివిక్రమ్ భార్య సౌజన్య భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇవ్వడం చర్చనీయాంశం అయింది. త్రివిక్రమ్ భార్యలో ఇంత గొప్ప టాలెంట్ అంటూ పలువురు ఆశ్చర్య పోయారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

    ఆమెను వదులుకోవడం తప్పు.. నాన్న తాగి కొట్టాడు.. సామ్రాట్

    ఆమెను వదులుకోవడం తప్పు.. నాన్న తాగి కొట్టాడు.. సామ్రాట్

    బిగ్‌బాస్2 అంతగా ఆకట్టుకోలేకపోతుందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రియాలిటీ షోను ఆసక్తికరంగా మలిచేందుకు నిర్వాహకులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. లగ్జరీ టాస్క్ బడ్జెట్‌లో భాగంగా మంచి చెడు గేమ్‌ను ఆడాలని ఇంటి సభ్యులకు సూచించాడు. అలాగే తన జీవితంలో ఎవరికైనా అన్యాయం చేసినట్టు ఫీలింగ్ ఉంటే బిగ్‌బాస్ వేదికగా సారీ చెప్పాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    యూఎస్ఏ సెక్స్ రాకెట్ యాంకర్ శ్యామల!

    యూఎస్ఏ సెక్స్ రాకెట్ యాంకర్ శ్యామల!

    బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత టీవీ ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన యాంకర్ శ్యామలకు యూఎస్ఏ సెక్స్ రాకెట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. టాలీవుడ్ సెలబ్రిటీలను యూఎస్ఏలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అని పిలిచి, వారికి ఇష్టం లేకున్నా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు అని ఓ హీరోయిన్ కంప్లయింట్ చేసింది. మీరు కూడా గతంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. మీకేమైనా అలాంటి సంఘటనలు ఎదురయ్యాయా? ఎవరైనా అలాంటి ఫోన్లు చేశారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నలపై శ్యామల స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Sonali bendre, Renu Desai, Bigg Boss2, Pawan Kalyan others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X