»   » ట్రెండింగ్: సొనాలి బాస్టర్డ్‌తో పోరాడు!.. కత్తి వివాదంలో రేణు.. ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు

ట్రెండింగ్: సొనాలి బాస్టర్డ్‌తో పోరాడు!.. కత్తి వివాదంలో రేణు.. ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు

By Staff
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

  షాకింగ్.. సొనాలి బింద్రేకు క్యాన్సర్.. మృత్యువుతో పోరాటం...

  షాకింగ్.. సొనాలి బింద్రేకు క్యాన్సర్.. మృత్యువుతో పోరాటం...

  బాలీవుడ్, టాలీవుడ్‌లో గ్లామర్ తారగా మెప్పించిన అందాల తార సోనాలి బింద్రే అభిమానులకు షాకింగ్ న్యూస్. ఇటీవల సొనాలి బింద్రేకు తీవ్రస్థాయిలో క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్యులు నిర్దారించారు. దాంతో ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. తనకు క్యాన్సర్ వ్యాధి సోకినట్టు స్వయంగా సొనాలి బింద్రే తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్ట్ చేసి వెల్లడించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  ఆ డైరెక్టర్ సైకో, నరకం చూపాడు ..... ఆ హాట్ సీన్లు చూసి నాన్న బాధపడ్డారు: సంజన

  ఆ డైరెక్టర్ సైకో, నరకం చూపాడు ..... ఆ హాట్ సీన్లు చూసి నాన్న బాధపడ్డారు: సంజన

  'బుజ్జిగాడు' ఫేం సంజన అలీతో సరదాగా షోలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 17 ఏళ్ల వయసులోనే తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, మోడలింగ్ చేసే రోజుల్లో బైక్ మీద తిరిగేదాన్ని, ఆ సమయంలో నాకు సినిమా అవకాశం వచ్చింది. దానికి సైన్ చేస్తే రూ. 2 లక్షల రెమ్యూనరేషన్‌ ఇస్తామన్నారు. అప్పటికి నాకు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. పెద్దగా అవగాహన కూడా లేని వయసు. ఈ సినిమా చేస్తే కారు కొనుక్కోవచ్చుకదా అనే కారణంతో సైన్ చేశాను. కానీ తొలి సినిమాకే నరకం చూశాను. ఆ సినిమా డైరెక్టర్ శాడిస్ట్, సైకో ప్రవర్తనతో ఇండస్ట్రీ అంటే భయం వేసేలా చేశాడు అని తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ బాస్టర్డ్‌తో పోరాడు, సోనాలి బింద్రే కోసం సెలెబ్రిటీల ప్రార్థనలు..

  ఆ బాస్టర్డ్‌తో పోరాడు, సోనాలి బింద్రే కోసం సెలెబ్రిటీల ప్రార్థనలు..

  మురారి, ఇంద్ర, మన్మధుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సోనాలి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్నారు. అలాంటి ఈ అందాల తార క్యాన్సర్ బారిన పడడం బాధాకరం. తనకు హై గ్రేడ్ క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయిందని సోనాలి బింద్రే ఇటీవల తెలిపింది. సోనాలి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  కత్తి మహేష్ ఒక వీధి కుక్క.. దారుణంగా తిట్టిన శ్రీరెడ్డి..

  కత్తి మహేష్ ఒక వీధి కుక్క.. దారుణంగా తిట్టిన శ్రీరెడ్డి..

  శ్రీరెడ్డి వ్యవహారంతో పబ్బం గడుపుకున్న సదరు మీడియా సంస్థలు ప్రస్తుతం కత్తి మహేష్ ని ఉపయోగించుకుంటున్నారు. ఏకంగా శ్రీరామ చంద్రుడిపైనే దారుణమైన వ్యాఖ్యలు చేయిస్తూ డిబేట్లు పెట్టేస్తున్నారు. హిందూ సమాజం ఈ చర్యలపై భగ్గుమంటున్న తరుణంలో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది.

  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  Madhavi Latha Shocking Comments On Mahesh Kathi
  మా దేవుడిని అవమానిస్తారా? ఆ నీచులను శిక్షించాలి.... నాగబాబు ఫైర్

  మా దేవుడిని అవమానిస్తారా? ఆ నీచులను శిక్షించాలి.... నాగబాబు ఫైర్

  నా మతం మీద, నా రామాయణం మీద కామెంట్ చేసిన నీచులను కఠినంగా శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా నా మనసు అంగీకరించం లేదు. అతడికి భయంకరమైన శిక్ష పడితీరాలి. చంద్రబాబు నాయుడుగానీ, కేసీఆర్ కానీ ఈ విషయంలో రియాక్ట్ కాకపోతే చారిత్రాత్మక తప్పదం చేసిన వారు అవుతారు,హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసిన వారు అవుతారు.... అని నాగబాబు అన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాని వల్లే జీవితాలు తారుమారు.. బిగ్ బాస్ గురించి కిరీటి!

  నాని వల్లే జీవితాలు తారుమారు.. బిగ్ బాస్ గురించి కిరీటి!

  బిగ్ బాస్ రెండవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. షో నుంచి ఎలిమినేట్ అయిన కిరీటి ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. తనకు షో నుంచి ఎలిమినేట్ కావడం భాద కలిగించలేదని, ఇప్పుడు తన సినిమాలు తాను చేసుకుంటానని చెబుతున్నాడు.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  మిస్టర్ డైరెక్టర్.. ఆ హీరోయిన్లతో బిహేవ్ చేయి.. నాతో కాదు.. రేణు బాటలో పూనమ్ కౌర్!

  మిస్టర్ డైరెక్టర్.. ఆ హీరోయిన్లతో బిహేవ్ చేయి.. నాతో కాదు.. రేణు బాటలో పూనమ్ కౌర్!

  టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా కాలంగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పరోక్షంగా ఓ దర్శకుడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దర్శకుడి వలనే తన కెరీర్ నాశనం అయిందనే అర్థం వచ్చే విధంగా పూనమ్ కామెంట్స్ చేస్తోంది.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  కెలికితే.... బిగ్‌బాస్ శ్యామల భర్త!

  కెలికితే.... బిగ్‌బాస్ శ్యామల భర్త!

  'మావూరి' వంట అనే చిన్న టీవీ కార్యక్రమంతో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ యాంకర్‌గా ఎదిగింది. తర్వాత టీవీ సీరియళ్లు, సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 2లో టాప్ కంటెస్టెంటుగా తన హవా కొనసాగిస్తోంది. శ్యామలకు చాలా కాలం క్రితమే పెళ్లయింది. నరసింహ రెడ్డి అనే టీవీ నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే శ్యామల పెళ్లి వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరసింహారెడ్డి శ్యామల జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరోపై రేప్, చీటింగ్ కేసు.. అయినా పెళ్లికి సిద్దమైన టాలీవుడ్ హీరోయిన్!

  హీరోపై రేప్, చీటింగ్ కేసు.. అయినా పెళ్లికి సిద్దమైన టాలీవుడ్ హీరోయిన్!

  రేప్, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు మహాక్షయ్ చక్రవర్తి పెళ్లికి సిద్దమవుతున్నాడు. రేప్ కేసుతోపాటు ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో అతడిని టాలీవుడ్ హీరోయిన్ మదాలస శర్మ వివాహాం చేసుకోవడానికి ముందుకు రావడం బాలీవుడ్‌ వర్గాలో చర్చనీయాంశమైంది.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  పవన్‌పై మళ్లీ ఎటాక్.. రేణుదేశాయ్‌ను వివాదంలోకి లాగి మహేష్ కత్తి పోస్టింగ్!

  పవన్‌పై మళ్లీ ఎటాక్.. రేణుదేశాయ్‌ను వివాదంలోకి లాగి మహేష్ కత్తి పోస్టింగ్!

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకొని సినీ విమర్శకుడు మహేష్ కత్తి వివాదాస్పద పోస్టింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత కొద్దికాలంగా సద్దుమణిగిందనుకొన్న పవన్, కత్తి వివాదం మళ్లీ రాజుకొన్నట్టు కనిపిస్తుంది. తాజాగా రేణుదేశాయ్ పేరుతో ఉన్న ఓ ఇమేజ్‌ను పోస్టు చేసి మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తున్నది.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు.. వాళ్లను నమ్మి కోట్లు పోగొట్టుకొన్నా.. ఆమని

  ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు.. వాళ్లను నమ్మి కోట్లు పోగొట్టుకొన్నా.. ఆమని

  స్వర్గీయ బాపు దర్వకత్వంలో మిస్టర్ పెళ్లాం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అమల చేరువయ్యారు. కృష్ణ, నాగార్జున, బాలకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్ హీరోలతో డ్యూయెట్లు పాడేసుకొన్నారు. కెరీర్ ఉన్నతస్థాయిలో ఉండగానే ప్రేమ పెళ్లి చేసుకొని సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ భార్యబంధుతోపాటు మరికొన్ని చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకొన్నారు.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  బిగ్‌బాస్2‌లో హైడ్రామా.. దుప్పట్లో దూరిన తనీష్, సునైన..

  బిగ్‌బాస్2‌లో హైడ్రామా.. దుప్పట్లో దూరిన తనీష్, సునైన..

  తెలుగు బిగ్‌బాస్2 రియాల్టీ షోపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతున్నది. సోమవారం నాటి షోలో బ్రహ్మండమైన హైడ్రామాకు బిగ్‌బాస్ తెరతీశాడు. అమిత్, తనీష్‌లతో డ్రామా ఆడించడం, ఇంటి సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడం, నామినేషన్ ప్రక్రియను ముగించడం, అలాగే గీతా మాధురిని జైల్లో పెట్టడం సోమవారం నాటి గేమ్‌లో ముఖ్యాంశాలుగా మారాయి.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  టాలీవుడ్‌కు దరిద్రమైన రికార్డు, 8వ స్థానంలో అజ్ఞాతవాసి!

  టాలీవుడ్‌కు దరిద్రమైన రికార్డు, 8వ స్థానంలో అజ్ఞాతవాసి!

  రంగస్థలం చిత్రాన్ని అనుష్క భాగమతి చిత్రం అధికమించింది. మీరు వింటున్నది నిజమే. కానీ ఇది మంచి రికార్డు కాదు. ఛండాలమైన రికార్డు ఇది. ఇంతకీ ఆ రికార్డు ఏ విషయంలో అనుకుంటున్నారా.. మీరే చదవండి... అసలు విషయం తెలుస్తుంది.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  రూ. 4 కోట్లు ఇవ్వాల్సిందే.... నాగార్జున ఇంటి వద్ద యువతి వీరంగం!

  రూ. 4 కోట్లు ఇవ్వాల్సిందే.... నాగార్జున ఇంటి వద్ద యువతి వీరంగం!

  ఫిల్మ్ స్టార్ నాగార్జున ఇంటి వద్ద యువతి మంగళవారం రాత్రి వీరంగం సృష్టించడం చర్చనీయాంశం అయింది. రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున నివాసం వద్దకు వచ్చిన యువతి ఆయన తనకు రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఆయన్ను కలవడానికి లోనికి పంపాలంటూ హడావుడి చేసింది. నాగార్జున ఇంట్లో లేరని, తర్వాత రావాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డు మీద పెద్ద గొడవ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్‌పై చెడుగా మాట్లాడను, నా ఆత్మాభిమానం ముఖ్యం కాదా? : రేణు దేశాయ్ ఫైర్

  పవన్ కళ్యాణ్‌పై చెడుగా మాట్లాడను, నా ఆత్మాభిమానం ముఖ్యం కాదా? : రేణు దేశాయ్ ఫైర్

  గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? నోరుమూసుకుని అన్నీ భరించమని నాకు సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు. ఆయనకొక రూల్‌, నాకొక రూలా?.... అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Sonali bendre, Renu Desai, Bigg Boss2, Pawan Kalyan others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more