For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్ : బాలయ్య వార్నింగ్‌పై హైపర్ ఆది, మగాళ్ల డ్రెస్సుపై రష్మి అభ్యంతరం, మహేష్ సెటైర్లు!

|

మహేష్ బాబు బయటకు కనిపించేంత సైలెంట్ పర్సన్ ఏమీ కాదని, స్మార్ట్‌గా సెటైర్లు వేయడంలో ఆయన్ను మించిన వారు ఎవరూ లేరు, ఇటీవల మీడియా ఆయన చుక్కులు చూపించారు. మహిళల డ్రెస్సింగ్ విషయంలో నాగబాబు చేసిన కామెంట్లపై రష్మి, అనసూయ స్పందించారు. విక్టరీ వెంకటేష్ కూతురు పెళ్లి సెటిలవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. బాలయ్య వార్నింగ్‌ ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈ వారం పలు అంశాలు బాగా ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

ఏం మాట్లాడుతున్నారు మీరు? మీడియా ప్రతినిధులకు చుక్కలు చూపించిన మహేష్ బాబు!

ఏం మాట్లాడుతున్నారు మీరు? మీడియా ప్రతినిధులకు చుక్కలు చూపించిన మహేష్ బాబు!

మహేష్ బాబుతో కలిసి పని చేసిన చాలా మంది ఆర్టిస్టులు ఆయన బయటకు కనిపించేంత సైలెంట్ పర్సన్ ఏమీ కాదని, స్మార్ట్‌గా సెటైర్లు వేయడంలో ఆయన్ను మించిన వారు ఎవరూ లేరు అని చెబుతుంటారు. ఇటీవల ప్రెస్ మీట్లో మహేష్ బాబు మీడియా వారికి చుక్కలు చూపించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ రవికి పెళ్లైంది, కూతురు కూడా.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు, ఫోటోలు విడుదల!

యాంకర్ రవికి పెళ్లైంది, కూతురు కూడా.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు, ఫోటోలు విడుదల!

తెలుగు యాంకర్ రవి పెళ్లి విషయం చాలా కాలంగా మిస్టరీగానే ఉంది. తాజాగా ఆయనే స్వయంగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా విషయం బయట పెట్టారు. తనకు భార్య, కూతురు ఉన్నారని తెలిపారు. వారి ఫోటోస్ కూడా విడుదల చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎక్స్‌ఫోజింగ్ లొల్లి: నాగబాబు కామెంట్లపై యాంకర్ రష్మి, అనసూయ రియాక్షన్!

ఎక్స్‌ఫోజింగ్ లొల్లి: నాగబాబు కామెంట్లపై యాంకర్ రష్మి, అనసూయ రియాక్షన్!

దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు కారణం వారు తమ శరీర భాగాలను ఎక్స్ ఫోజింగ్ చేస్తూ.. క్లీవేజ్, తొడలు, బొడ్డు కనిపించేలా పొట్టి దుస్తులు ధరించడమే అనే వాదనలు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై మెగాబ్రదర్ నాగబాబు రియాక్ట్ అయిన తీరుపై రష్మి, అనసూయ స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి భాజాలు.. కూతురు పెళ్లికి ముహూర్తం ఖరారు!

విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి భాజాలు.. కూతురు పెళ్లికి ముహూర్తం ఖరారు!

తెలుగు సినిమా పరిశ్రమలో త్వరలో మరో భారీ వివాహ వేడుక జరుగబోతోంది. కొన్ని రోజుల క్రితమే రాజమౌళి కుమారుడి వివాహం జరుగగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు. మరికొన్ని రోజుల్లో విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాలయ్య వార్నింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది... అసలు ఏం జరిగిందంటే?

బాలయ్య వార్నింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది... అసలు ఏం జరిగిందంటే?

జనసేన పార్టీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రచారం చేస్తూ మీడియాలో హైలెట్ అవున్నారు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. అయితే ఆ మధ్య ఆదికి ఏదో స్కిట్ విషయంలో బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఆది క్లారిటీ ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బోయపాటి, దానయ్య మాటల యుద్ధం.. వినయ విధేయ వివాదం కొత్త మలుపు.. దిల్ రాజు రంగంలోకి

బోయపాటి, దానయ్య మాటల యుద్ధం.. వినయ విధేయ వివాదం కొత్త మలుపు.. దిల్ రాజు రంగంలోకి

సంక్రాంతి రేసులో భాగంగా దర్శకుడు బోయపాటి, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం ప్రస్తుతం టాలీవుడ్‌లో చిచ్చు రేపుతున్నది. నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు చెల్లించే మొత్తం విషయం నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను మధ్య గొడవకు దారి తీసినట్టు ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎన్టీఆర్ బయోపిక్‌తో క్రిష్‌ ఊహించని దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టమంటే..

ఎన్టీఆర్ బయోపిక్‌తో క్రిష్‌ ఊహించని దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టమంటే..

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి టైమ్ బాగాలేనట్టు కనిపిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మణికర్ణిక, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు పేరు తీసుకురాకపోగా, వివాదాల్లోకి నెట్టాయి. దర్శకత్వం టైటిల్‌పై బాలీవుడ్‌లో వివాదం చెలరేగుతుంటే.. టాలీవుడ్‌లో ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం క్రిష్‌ కెరీర్‌లో మచ్చగా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మెగా ఫ్యాన్స్‌కు మరోషాక్.. సైరాపై మరో రూమర్.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

మెగా ఫ్యాన్స్‌కు మరోషాక్.. సైరాపై మరో రూమర్.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తొలి పోరాటయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా సైరాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీపై మరో రూమర్ వినిపిస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కొత్త ఇంటిని కొన్న రాంచరణ్.. ధర ఎన్ని కోట్లో తెలుసా, సౌత్ ఇండియాలోనే..

కొత్త ఇంటిని కొన్న రాంచరణ్.. ధర ఎన్ని కోట్లో తెలుసా, సౌత్ ఇండియాలోనే..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సౌత్ ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీలలో ఒకరు. మెగా వారసుడిగా, స్టార్ హీరోగా చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాంచరణ్ హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నాడు. తాజాగా రాంచరణ్ కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నందమూరి హీరో రెస్టారెంట్ కూల్చివేత.. రాత్రి సమయంలో అలాంటి పనులు!

నందమూరి హీరో రెస్టారెంట్ కూల్చివేత.. రాత్రి సమయంలో అలాంటి పనులు!

హైదరాబాద్ నగరంలో పలు బార్ అండ్ రెస్టారెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. కానీ అధికారుల దృష్టికి వెళుతున్నవి కొన్ని మాత్రమే. ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నందమూరి హీరో తారక రత్నకు చెందిన రెస్టారెంట్ ని జిహెచ్ఎంసి అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

టివి నటి ఝాన్సీ ఆత్మహత్య.. ప్రియుడితో సహజీవనం, విషాదానికి అసలు కారణం ఇదే!

టివి నటి ఝాన్సీ ఆత్మహత్య.. ప్రియుడితో సహజీవనం, విషాదానికి అసలు కారణం ఇదే!

బుల్లితెర యువ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. పవిత్రబంధం అనే సీరియల్ లో ఝాన్సీ నటించింది. మంగళవారం రాత్రి ఝాన్సీ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదానికి కారణం ఝాన్సీ ప్రేమ వ్యవహారమే అని పోలిసుల ప్రాధమిక విచారణలో జరిగింది. ఝాన్సీ మరణం గురించి పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఝాన్సీ మరణానికి దారితీసిన పరిస్థితులు సంచలనం రేపేవిగా ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మగాళ్ల డ్రెస్ నచ్చట్లేదు, అవన్నీ కనిపిస్తున్నాయి..నా లిస్ట్ ఇదే, రష్మీ హాట్ కామెంట్స్!

మగాళ్ల డ్రెస్ నచ్చట్లేదు, అవన్నీ కనిపిస్తున్నాయి..నా లిస్ట్ ఇదే, రష్మీ హాట్ కామెంట్స్!

యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ గా మారిపోతోంది. ట్రోలింగ్ చేసే నెటిజన్లకు అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తోంది. జబర్దస్త్ యాంకర్ గా, బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ పలు విషయాల్లో పురుషాధిక్యతని ప్రశ్నిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మహిళల డ్రెస్ గురించి పలువురు ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజాగా రష్మీ ఓ నెటిజన్ కు సమాధానం ఇస్తూ మగవాళ్ల దుస్తుల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

'మన గడప తొక్కిన ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా'.. హాట్ టాపిక్‌గా మారిన 'యాత్ర' డైలాగ్స్!

'మన గడప తొక్కిన ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా'.. హాట్ టాపిక్‌గా మారిన 'యాత్ర' డైలాగ్స్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రం రూపొందించారు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటించారు. మమ్ముట్టి హావభావాలు ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసేలా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ ఎమోటినల్ జర్నీ యాత్ర నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగ్స్ ని పంచుకుంటూ సంతోషిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Tollywood and Bollywood's movie news become top Trending Stories in media. mahesh babu, anchor ravi, Ram Charan, rashmi gautam, Naga Babu and other stars in top list. Some of the top stories for you.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more