For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ఎన్టీఆర్ కేటీఆర్ కలిశారు, మాట మార్చిన గణేష్, విశాల్ అరెస్ట్, హీరోయిన్‌పై కాల్పులు

  |

  కేటీఆర్‌ను కలిసిన జూ ఎన్టీఆర్.... తాళాలు బద్దలు కొట్టే ప్రయత్నం చేసిన హీరో విశాల్ అరెస్ట్.. రాజమౌళి నుంచి పిలుపు రాక కీర్తి సురేష్ ఏం చేసింది.. ఒక్కరూ రావడం లేదు, అతడి వల్లే నాశనమైందన్న హీరోయిన్ శృతి హరిహరన్.. ఈడేరా ఆ బఫూన్‌గాడు, బ్లేడ్ బాబ్జీ అంటారా? అనరా? బండ్ల గణేష్‌పై పృథ్వీ.. ధనుష్ తండ్రి కోసం కేసులో ఇరుక్కున్న రజనీకాంత్.. పట్టపగలే తమిళ హీరోయిన్‌పై తుపాకి కాల్పులు.. ఇపుడు కోసుకోమంటారా ఏంటి? తూచ్... తిరుపతిలో మీడియాకు చిక్కిన బండ్ల గణేష్ ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. వాటిలో మీరేమైనా మిస్సయితే ఓ లుక్కేయండి.

  కేటీఆర్‌ను కలిసిన జూ ఎన్టీఆర్.... వైరల్ అవుతున్న ఫోటో, విక్టరీ సెలబ్రేషన్లో?

  కేటీఆర్‌ను కలిసిన జూ ఎన్టీఆర్.... వైరల్ అవుతున్న ఫోటో, విక్టరీ సెలబ్రేషన్లో?

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో కేటీఆర్ క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటేన్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్స్ విషెస్ తెలియజేశారు. ఇపుడు ఆ లిస్టులో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కూడా చేరినట్లు ప్రచారం మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తాళాలు బద్దలు కొట్టే ప్రయత్నం చేసిన హీరో విశాల్ అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం!

  తాళాలు బద్దలు కొట్టే ప్రయత్నం చేసిన హీరో విశాల్ అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం!

  తమిళ స్టార్ విశాల్ గురువారం ఉదయం అరెస్ట్ అయ్యాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న విశాల్... కౌన్సిల్ కార్యాలయానికి వేసిన తాళాలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశాల్, పోలీసుల మధ్య తీవ్రవాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న విశాల్ మీద నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెళ్లువెత్తాయి. దీంతో కొందరు నిర్మాతలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీరాజా నేతృత్వంలోని ఓ వర్గం కౌన్సిల్ కార్యాలయానికి బుధవారం తాళం వేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాజమౌళి నుంచి పిలుపు రాలేదు.... చివరకు కీర్తి సురేష్ ఏం చేసిందంటే?

  రాజమౌళి నుంచి పిలుపు రాలేదు.... చివరకు కీర్తి సురేష్ ఏం చేసిందంటే?

  సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే విషయం హాట్ టాపిక్ అయింది. తమిళ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'సర్కార్' చిత్రంలోనూ కీర్తి హీరోయిన్‌గా చేసింది. ఆమె పని తీరు నచ్చడంతో పాటు రజనీకాంత్ సరసన తాను అనుకున్న పాత్రకు సూటవుతుందనే అభిప్రాయానికి మురుగదాస్ వచ్చినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఒక్కరూ రావడం లేదు, అతడి వల్లే నాశనమైంది: హీరోయిన్ శృతి హరిహరన్

  ఒక్కరూ రావడం లేదు, అతడి వల్లే నాశనమైంది: హీరోయిన్ శృతి హరిహరన్

  అర్జున్ మీద #మీటూ ఆరోపణలు చేసిన తర్వాత శృతి హాసన్ కెరీర్ పరంగా వెనకబడిపోయింది. ఈ వివాదాస్పద నటికి సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయమై శృతి హరిహరన్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్జున్ మీద ఆరోపణలు చేసిన తర్వాత తాను కెరీర్ నష్టపోయాను. ఎవరూ తనకు అవకాశం ఇవ్వడం లేదని వెల్లడించారు. గతంలో ప్రతి వారం ముగ్గురు నలుగురు నిర్మాతలు సంప్రదించేవారని, అయితే గత రెండు నెలలుగా తనకు ఎలాంటి అవకాశాలు రావడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ నటుడి లైఫ్ దుర్భరం.. గేట్ వద్ద గెంటేశారు.. కృష్ణను కలిసిన రెండో రోజే మరణం.. పృథ్వీ

  ఆ నటుడి లైఫ్ దుర్భరం.. గేట్ వద్ద గెంటేశారు.. కృష్ణను కలిసిన రెండో రోజే మరణం.. పృథ్వీ

  తనదైన మేనరిజం, పంచ్ డైలాగ్స్‌, తనదైన హస్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా నటించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన శతురంగ వేట్టై సినిమాకు ఇది రీమేక్. తెలుగు నేటివిటికి అనుగుణంగా ఆసక్తికరమైన మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పృథ్వీ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. అలనాటి నటులు జీవితాల గురించి, వారి కష్ట సుఖాల గురించి వివరించారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లిప్‌లాక్స్, స్మోకింగ్ సినిమా కోసమే... మా ఇంట్లో తెలుసు: ప్రియా వడ్లమాని

  లిప్‌లాక్స్, స్మోకింగ్ సినిమా కోసమే... మా ఇంట్లో తెలుసు: ప్రియా వడ్లమాని

  బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా ప్రియా వడ్లమాని మీడియాతో ముచ్చటించారు. మీడియా ప్రశ్నలకు ప్రియా వడ్లమాని స్పందిస్తూ... సక్సెస్ ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కావడం లేదు. నేను చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియడం లేదు. సినిమాను ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నాం అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రభాస్ పక్కనే అనుష్క.. వైరల్ అవుతున్న ఫోటో.. వదిలేలా లేరుగా!

  ప్రభాస్ పక్కనే అనుష్క.. వైరల్ అవుతున్న ఫోటో.. వదిలేలా లేరుగా!

  డార్లింగ్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో జాతీయస్థాయిలో పాపులర్ అయిన హీరో. బాహుబలి చిత్రంతో ప్రభాస్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. బాహుబలి చిత్రంలో ప్రభాస్, అనుష్క జోడి అదుర్స్ అనిపించింది. బాహుబలి మాత్రమే కాదు గతంలో ప్రభాస్, జంటగా నటించిన బిల్లా, మిర్చి లాంటి చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. దీనితో ప్రభాస్, అనుష్క కాంబినేషన్ అంటే ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. తాజాగా అభిమానులు సృష్టించిన అనుష్క, ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఈడేరా ఆ బఫూన్‌గాడు, బ్లేడ్ బాబ్జీ అంటారా? అనరా?.... బండ్ల గణేష్‌పై పృథ్వీ

  ఈడేరా ఆ బఫూన్‌గాడు, బ్లేడ్ బాబ్జీ అంటారా? అనరా?.... బండ్ల గణేష్‌పై పృథ్వీ

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల అనంతరం కమెడియన్ పృథ్వీ ఈ విషయమై స్పందించారు. తెలంగాణలో రిజల్ట్ వచ్చే రోజున కొన్ని టీవీ ఛానల్స్ వారు బ్లేడు ప్యాకెట్, పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వెళ్లారు... ఉత్తమ్ కుమార్ ఇంట్లో కూర్చున్న బండ్ల గణేష్ ఎంతకూ బయటకు రాలేదు. ఆయన అలాంటి వ్మాఖ్యలు చేయడం కామెడీ అయిపోయిందని పృథ్వీ అన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ధనుష్ తండ్రి కోసం కేసులో ఇరుక్కున్న రజనీకాంత్.. ఏం జరిగిందంటే!

  ధనుష్ తండ్రి కోసం కేసులో ఇరుక్కున్న రజనీకాంత్.. ఏం జరిగిందంటే!

  సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. మరోవైపు రజని పెట్ట చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పెట్ట చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా రజనీకాంత్ ఓ కేసు విషయంలో వార్తల్లో నిలిచారు. తన వియ్యంకుడి అప్పుకు హమీదారుడిగా ఉన్న రజని మెడకు సివిల్ కేసు చుట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బికినీ, బోల్డ్ సీన్స్.. నన్ను కన్విన్స్ చేయాలి అంటున్న స్టార్ హీరో కుమార్తె!

  బికినీ, బోల్డ్ సీన్స్.. నన్ను కన్విన్స్ చేయాలి అంటున్న స్టార్ హీరో కుమార్తె!

  ప్రస్తుతం బాలీవుడ్ లో ఎవరి నోటా విన్నా సారా అలీఖాన్ మాటే వినిపిస్తోంది. సైఫ్ అలీఖాన్ ముద్దుల కుమార్తె సినీ జనాలని అంతలా మాయ చేస్తోంది. ఇటీవలే సారా అలీఖాన్ నటించిన డెబ్యూ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక్క సినిమాతోనే సారా క్రేజ్ పెరగడానికి కారణం ఉంది. సారా అలీఖాన్ కు ఆకర్షించే అందం ఆమె సొంతం. ఆమె హాస్య చతురత, సమయస్ఫూర్తి ఇలా అన్ని రకాలుగా సారా అలీఖాన్ అభిమానులకు చేరువైంది. ఎలాంటి విషయం గురించి అయినా సారా చాలా సరదాగా తన స్పందన తెలియజేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సాయి అలీఖాన్ మాట్లాడుతూ బోల్డ్ సన్నివేశాలపై తన అభిప్రాయం తెలియజేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆమె స్పీడ్ తట్టుకోవడం కష్టం.. దడదడలాడించింది.. ధనుష్

  ఆమె స్పీడ్ తట్టుకోవడం కష్టం.. దడదడలాడించింది.. ధనుష్

  విలక్షణ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ తాజా చిత్రం మారి2. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, సాయిపల్లవి కథానాయికలు. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కానున్నది. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ వరలక్ష్మీ శరత్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ధనుష్ ఏమన్నారంటే..
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   క్యాస్టింగ్ కౌచ్ ఓ ఫ్యాషనైపోయింది.. ఆంటీలు, హీరోయిన్లు ఏమయ్యారు.. నాకు ఆ దురద.. పృథ్వీ

  క్యాస్టింగ్ కౌచ్ ఓ ఫ్యాషనైపోయింది.. ఆంటీలు, హీరోయిన్లు ఏమయ్యారు.. నాకు ఆ దురద.. పృథ్వీ

  30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా నటించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన శతురంగ వేట్టై సినిమాకు ఇది రీమేక్. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పృథ్వీ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో నా పాత్ర పేరు ధనశెట్టి. డబ్బు కోసం అత్యాశపడే నైజం ఉన్న పాత్ర నాది. ఆ పాత్ర గెటప్ చాలా గమ్మత్తుగా ఉంటుంది అని అన్నారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   వివాదంగా మారిన యాంకర్ హేమ రెండో వివాహం.. వదిలించుకోవాలని చూస్తున్నాడు!

  వివాదంగా మారిన యాంకర్ హేమ రెండో వివాహం.. వదిలించుకోవాలని చూస్తున్నాడు!

  బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తున్న మరో సెలెబ్రిటీ జీవితం వార్తల్లోకి ఎక్కింది. ఆమె రెండో వివాహం వివాదంగా మారింది. తన భర్త కోసం యాంకర్ హేమ అతడి ఇంటి ముందే మౌన దీక్షకు దిగిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. తన భర్త, అతడి తల్లిదండ్రులు కలసి తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హేమ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. యాంకర్ హేమ రెండవ వివాహానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇపుడు కోసుకోమంటారా ఏంటి? తూచ్... తిరుపతిలో మీడియాకు చిక్కిన బండ్ల గణేష్!

  ఇపుడు కోసుకోమంటారా ఏంటి? తూచ్... తిరుపతిలో మీడియాకు చిక్కిన బండ్ల గణేష్!

  తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక పోతే... డిసెంబర్ 11న బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను.... అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ఓటమి పాలైన తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిన గణేష్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో మీడియాకు చిక్కారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పట్టపగలే తమిళ హీరోయిన్‌పై తుపాకి కాల్పులు.. ముంబై డాన్‌ హస్తం?

  పట్టపగలే తమిళ హీరోయిన్‌పై తుపాకి కాల్పులు.. ముంబై డాన్‌ హస్తం?

  తమిళ హీరోయిన్ లీనా మారియా పాల్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం కేరళ, తమిళనాడులో సంచలనం రేపింది. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు నోరు మెదపకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  viral pic ntr with trs leader ktr, tamil actor vishal arrested, keerthy suresh rajinikanth next film , metoo allegations are killing sruthi hariharan career, comedian pruthvi about harinath savithri... these are trending topics in this week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X