twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెండితెర రారాజు జయంతి నేడే!

    By Staff
    |

    Ntr
    ఆయన పాత సినిమాలు థియేటర్లలలోకి వస్తే ఇప్పటికీ తరగని ప్రజాదరణతో కొత్త చిత్రాలకు పోటీ ఇస్తాయి. అలాగే ఆయన సినిమా యోదన్నా ఛానెల్స్ లో వస్తోందంటే అంతా టి.వి కి అతుక్కుపోయి టి.ఆర్.పి.రేటింగ్ లు పెంచేస్తారు. ఇక ఆయన సినిమాల డి.వి.డిలు, సి.డి ల మార్కెట్ రేంజ్ అయితే చెప్పనక్కర్లేదు. అలా ఆయన గతించి పుష్కరకాలం దాటినా ఆంధ్రావనిలో ఆయనకి తిరుగులేదు. ఆయనే విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నటరత్న డా.నందమూరి తారక రామారావు. శ్రీరామునిగా,శ్రీ కృష్ణుడుగా ఆయన అభినయం అపురూపం... అనితర సాథ్యం. ఆ రెండు పాత్రలే గాక అధ్బుతమైన రావణ, కర్ణ, అర్జున, దుర్యోధన, బృహన్నల వంటి మరెన్నో పురాణ పాత్రలకు జీవం పోసి ప్రాణ ప్రతిష్ఠ చేసారు.

    ఇక తోట రాముడన్నా..బండ రాముడన్నా..టాక్సీరాముడన్నా...అగ్గి రాముడన్నా అన్నీ ఆయనే,అంతా ఆయనే. జానపద, చారిత్రక, భక్తి రస చిత్రాలు తేడా లేకుండా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవించే మహా నటుడాయన. అందుకే ఆయన్ని తెలుగు జనం ఆరాథ్య నటుడుగా గుండెను గుడిగా చేసుకుని పూజించారు. తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటిన శక్తిగా ఆయనని మహానాయకుడుగా చేసారు. తమని ప్రేమగా పాలించమని ముఖ్యమంత్రిని చేసారు. అందుకే ఆయన జనం మెచ్చిన నటుడు..జగం మెచ్చిన నాయకుడు. ఆయనని తెలుగు జాతి ఉన్నంత కాలం మరువదు. ఆ మహనీయుడు పుట్టినరోజులు జరుపుతూ స్మరించుకుంటూనే ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X