త్రిష తల్లికీ సినిమా అవకాశాలు
తెలుగు తమిళ భాషల్లో సూపర్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న త్రిషకు పౌర్ణమి పరాజయం ఏ మాత్రం బాధ కలిగించలేదట. తనవరకు తాను బాగా నటించానని, ఆ విషయాన్ని నిర్మాత ఎంఎస్ రాజు కూడా ఒప్పుకున్నారని త్రిష చెబుతోంది. ఈనెల మూడున (నిన్న) హైదరాబాద్‌లోనే పుట్టినరోజు జరుపుకున్న త్రిష ఆ అర్ధరాత్రి ఫంక్షన్‌కు ప్రభాస్‌ను, తమిళ హీరో విజయ్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. త్రిష పార్టీ ఎంత గ్రాండ్‌గా ఉందోనంటూ ఆహ్వానం అందని సినీ ప్రముఖులు లొట్టలు వేసుకుని సంతృప్తి పడ్డారు. తెలుగులో అరవై, డెబ్బై లక్షల పారితోషికం తీసుకుంటున్న త్రిష డేట్స్‌ను చూసేది ఆమె తల్లి. త్రిష తల్లికి కూడా సినిమా అవకాశాలు వస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications