పార్టీప్లస్ లో ఉన్న పవన్, రవితేజలతో... త్రిష
ఫార్టీ ప్లస్‌లో ఉన్న పవన్‌కళ్యాణ్, రవితేజ, అజిత్, విక్రమ్‌లతో చేశాను. థర్టీ ప్లస్‌లో ఉన్న మహేష్, విజయ్, ప్రభాస్...లాంటివారితో కూడా నటించాను. ఇప్పుడు ట్వంటీ ప్లస్‌లో ఉన్న ఎన్టీఆర్, శింబులతో నటిస్తున్నాను. ఫలానా ఏజ్ గ్రూప్ వారితోనే నటించాలని నియమం ఏమీ పెట్టుకోలేదు నేను. అలా పెట్టుకుంటే... ఇన్ని మంచి పాత్రలు చేసేదాన్ని కాదు. సీనియర్ హీరోలతో చేస్తే మనల్ని కూడా వారి ఏజ్‌వారిలా చూస్తారు అనుకోవడం కేవలం భ్రమ అంటోంది. ఆమెను మీరు సీనియర్ హీరోల సరసన నటిస్తున్నారు...యూత్ కి దూరం అయ్యిపోతున్నట్లు ఫీలవటం లేదా అంటే ఇలా స్పందించింది.
అలాగే...సినిమా ఒప్పుకునే ముందు కథానాయికలు చూడాల్సింది కథను, పాత్రను మాత్రమే. హీరోల ఏజ్‌ని కాదు.. అయ్యినా నేను ఫిఫ్టీ ప్లస్‌లో ఉన్న కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్... లాంటి సీనియర్ హీరోలతో నటించాను కదా అంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో చేస్తోంది. మొన్న సంక్రాంతికి ఆమె వెంకటేష్ సరసన చేసిన బాడీగార్డ్ చిత్రం విడుదలైంది.


Click it and Unblock the Notifications











