పాతిక లక్షలు ఇస్తే ఒప్పేసుకుంటాననుకుంటున్నారా? త్రిష
బికినీ వేస్తుందో లేదోగానీ నేను వేయటం లేదని ఖండిచటం మాత్రం త్రిషకు ఎక్కువైపోయింది. మీడియావారు ఆమెను రెగ్యులర్ గా మేడం మీరు బికినీ వేయబోతున్నారటుగా అనటం..వెంటనే ఆమె గుక్కతిప్పుకోకుండా బికినీ..నేనా అస్సలు నేనూ..నా గ్లామర్..నాకు బికినీ వేయాల్సిన అవసరం ఏమిటి..అంటూ క్లాస్ పీకటం కామన్ అయిపోయింది. ప్రస్తుతం వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తున్న ఆమె పాతిక లక్షల రూపాయలుతీసుకుని బికినీ వేస్తోందని న్యూస్ వచ్చింది. అదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్దావించారు. ఆమె రెగ్యులర్ గా పాడేపాటే పాడింది. అయినా బాడీగార్డ్ సినిమా లో ఎక్కడయినా చివరకు డ్రీమ్ సాంగ్ లో అయినా స్విన్ సూట్ కాస్ట్యూమ్స్ ఉండే అవకాశం ఉందా..ఎలా పుట్టిస్తారు ఈ రూమర్స్..అయినా నేను నా కెరీర్ లో పూర్తిగా సెటిలైన స్టార్ ని. ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలో డిసైడ్ చేసుకునే స్ధితిలో ఉన్నాను అంది. అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











