twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ :త్రిష...త్రాగుడు గోల

    By Srikanya
    |

    చెన్నై : త్రిష త్రాగుడు గోల ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మద్యం సేవించే సన్నివేశాల్లో నటించడమంటే మహా ఇష్టమని,దర్శకులను అడిగి మరీ అలాంటి వాటిలో నటిస్తున్నానని అని చెప్పుకొచ్చింది ఈ చెన్నై చిన్నది. ఇటీవల విశాల్‌ సరసన 'సమర్‌' (తెలుగులో వేటాడు వెంటాడు)లో ఈ తరహా సన్నివేశంలో ఆమె కనిపించింది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె మిడియాలో మాట్లాడుతూ ఈ త్రాగుడు పురాణం విప్పింది. చెన్నైలో నిర్వహించిన ఆ చిత్రానికి సంబంధించిన సమావేశంలో త్రిష పాల్గొంది.

    త్రిష మాట్లాడుతూ... ''నేను నటించే చిత్రాల్లో మద్యం తాగే సన్నివేశాలుంటే అవి తప్పకుండా విజయం సాధిస్తాయని నా స్నేహితులు చెప్పారు. అందుకే ప్రతి చిత్రంలో అలాంటివి ఉండాలని దర్శకులను అడుగుతాను. నా తరవాతి చిత్రాల్లోనూ అవకాశం ఉంటే అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తాను'' అని తెలిపింది.

    ఇక నేటి తరం యువతులు మద్యం సేవించడం మీద మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే 'ఇలాంటి వివాదాస్పద ప్రశ్నకు సమాధానం చెప్పలేను' అంటూ సమాధానం దాటవేసింది. తెలుగులో ఈ సినిమా 24వ తేదీన విడుదలవుతుంది.

    తొలుత నాకు 'వేటాడు వెంటాడు' కథ వినిపించనప్పుడు 'నటించాలా..?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇందులో ఒక సందర్భంలో నాకు నెగటివ్‌ షేడ్స్‌ కనిపించాయి. ఆ స్క్రిప్ట్‌ చూడగానే వెంటనే అంగీకరించాలని అనుకున్నాను. గత చిత్రాలతో పోల్చితే ఇది సవాల్‌తో కూడుకున్నది. విశాల్‌ సరసన తొలిచిత్రమే కాసులవర్షం కురిపించడం ఆనందంగా ఉంది.

    త్రిష ప్రయాణం కూడా సాఫీగా సాగడం లేదు. గతేడాది వచ్చిన 'దమ్ము' ఆమెకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. 'వెంటాడు వేటాడు' విడుదలకు సిద్ధమైంది. 'రమ్‌'లోనూ నాయికగా నటించింది. దర్శక నిర్మాతలు త్రిష వైపు దృష్టి సారించాలంటే వీటిలో కనీసం ఓ సినిమా అయినా.. ప్రేక్షకులకు చేరువవ్వాలి.

    English summary
    Trisha's sentiment is drinking in her movies. All her earlier movies which had her drinking scenes were hits. Even her upcoming film 'Vetadu.. ventadu' also has a drinking scene in it. On talking about this Trisha said, 'All the films that had my drinking scenes did good at box office. My friends used to say that 'drinking is doing well to me in films'; even I felt it is right some way. That's why I ask my directors to add drinking scenes in my movies. Even in 'Vetadu Ventadu', only on my obligation, director added a boozing scene. Definitely audience will like it'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X