త్రిష ఇక ఫెయిరెవర్ బ్యూటీ
హాట్ స్టార్ త్రిష తాజాగా ఓ కొత్త బ్రాండ్ కి అంబాసిడర్ గామారింది.కెవిన్‌కేర్ సంస్ధ తాను తయారు చేస్తున్న ఫెయిరెవర్‌కు త్రిషను ప్రచారకర్తగా నియమించుకుంది. కొత్త ఫెయిరెవర్ కొత్త ప్యాకింగ్‌లో, కొత్త ప్రచారకర్తతో వచ్చిందని కంపెనీ మంగళవారమిక్కడ ఒక ప్రకటనలో పేర్కొంది. 9గ్రా. 25గ్రా. 50 గ్రా. 80గ్రా. లభ్యమయ్యే కొత్త ఫెయిర్‌ఎవర్ ధరలు వరుసగా రూ.5; రూ.38; రూ.70; రూ.102గా ప్రకటించింది. దక్షిణ భారత్‌లో ఇప్పటికే త్రిషతో కూడిన కొత్త వాణిజ్య ప్రకటనలు టీవీల్లో ప్రసారమవుతున్నాయని పేర్కొంది.
ఇక త్రిష ప్రస్తుతం వెంకటేష్ సరసన బాడీగార్డ్ చిత్రంలో చేస్తోంది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం మళయాళ బాడీగార్డ్ కి రీమేక్.ఆ చిత్రంలో నయనతార చేసిన పాత్రను తెలుగులో త్రిష చేస్తోంది.అలాగే ఆమెను తను వెడ్స్ మను రీమేక్ లోనూ అడుగుతున్నారు.అయితే సునీల్ సరసన అనే సరికి ఆమె దాదాపు రెండు కోట్లు వరకూ రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోంది.వ్రతం చెడినా ఫలితం దక్కాలన్నట్లు కమిడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ సరసన చేస్తే తర్వాత తనకు పెద్ద హీరోలు సినిమాలు ఇస్తారా లేదా అన్న డౌట్ త్రిషకు ఉంది.అదే సందేహంతో ఆమె తటపాయిస్తోంది.అయితే డబ్బు ఎక్కువిస్తానంటే ఆ డౌట్ ని మర్చిపోతానంటోంది.


Click it and Unblock the Notifications











