చెడ్డవారు ఎప్పుడూ మంచి వారు కారు: త్రిష!
'ఏ మాయ చేసావె" అంటూ తెలుగులో, విన్నై తండి వరువాయా" అంటూ తమిళంలో అందాల చీర కట్టులో అలరించిన జెస్సీ పాత్ర ఇప్పుడ హిందీలోకి వెళ్ళింది. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తమిళంలో మరపురాని ఈ పాత్రలో త్రిష నటనకు తబ్బిబ్బు అయిన దర్శకుడు గౌతమ్ మీనన్. తాను దర్శకత్వం వహించిన వెంకటేష్ 'ఘర్షణ" సినిమాకు హిందీలో రీమేక్ చేయాల్సిందే. హీరో జాన్ అబ్రహాం చిత్రం చివర్లో దర్శకుణ్ణి మర్చేయడంతో గౌతమ్ 'ఏ మాయ చేసావె" హిందీ పనిలో పడ్డాడట. ఇందులో త్రిషనే ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇప్పటికే హిందీ 'కట్టా మీఠా" చిత్రంతో హిందీలోకి ప్రవేశించిన త్రిష ఇక ఈ రెండవ చిత్రం హిందీలో మంచి పొజిషన్ చేజిక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదు. దాంతో మరిన్ని ఆఫర్లతో బాలీవుడ్ లో సెటిలయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో తెరంగేట్రం చేయడంతో కోలీవుడ్, టాలీవుడ్ ను చిన్న చూపు చూస్తోందన్నా వార్తలు వినిపిస్తున్నాయి. తనకింత క్రేజ్ తీసుకొచ్చిన తెలుగు, తమిళంను నిర్లక్ష్యం చేస్తోందన్న వార్తలు శికార్లు చేస్తున్నాయి.
ఉదాహరణగా మొదట డాన్ శ్రీను లో త్రిషను ఎంపిక చేశారు. అయితే ఆమె మార్కెట్ 70లక్షలు నడుస్తోంది. కానీ ఆమె కోటి డిమాండ్ చేయడంతో..శ్రియను తీసుకున్నట్టు సమాచారం. అదేమంటే కథ నచ్చలేదంటూ సాకు చెప్పి తప్పించుకొంది. దాంతో 'దక్షిణ భాషా చిత్రాలను నిర్లక్ష్యం చేస్తే అసిన్ మాదిరి రెంటికీ చెడతావ్-చెడ్డవారు ఎప్పుడూ మంచి వారు కారు" అంటూ త్రిష స్నేహితులు హితవు పలుకుతున్నారు. మరి త్రిష స్సేహితుల మాటలు వింటుదో. పెడ చెవిన పెడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











