twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష..మహేష్ బాబుకి వదినగా

    By Srikanya
    |

    త్రిష, మహేష్ బాబు కాంబినేషన్ లో గతంలో అతడు,సైనికుడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన త్రిష ఇప్పుడు ఆఫర్స్ లేకుండా పోయింది. ఆమె చేతిలో కేవలం వెంకటేష్ సరసన చేస్తున్న బాడీగార్డ్ మాత్రమే ఉంది.అయితే ఆమె మరో చిత్రం కమిటైందని,అదీ మహేష్ కి వదినగా అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ సినిమా మరేదో కాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రంలో వెంకటేష్ అన్నయ్యగా చేస్తున్నాడు. ఆమె సరసన త్రిషనే తీసుకునే అవకాశముందని సమాచారం.ఇక వెంకటేష్,మహేష్ బాబు కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల నిర్మిస్తున్నసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర కు ఎంపిక చేసారు. ఇక వ్రకాష్ రాజు చేసే పాత్ర తండ్రి పాత్ర అని తెలుస్తోంది.పరుగులో చేసిన పాత్రనే ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో చేయనున్నారు. ఇక ఈ చిత్రం గురించి దిల్‌రాజు మాట్లాడుతూ ''25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్‌ ఇది. వెంకీ, మహేష్‌ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు.

    సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్‌ మంచి ఫీల్‌నిచ్చింది. రెగ్యులర్‌ చిత్రీకరణ నవంబర్‌ ప్రారంభిస్తాం. మే నెలాఖరుకి సినిమా పూర్తిచేసి..అదే నెలలో విడుదల చేస్తాం అన్నారు. దసరా రోజు పూజ చేసి లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ లో వెంకటేష్,ప్రకాష్ రాజ్ ఇద్దరూ నవంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారు. మహేష్ మాత్రం జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళతారు. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారని చెప్పుకున్నారు. ప్రస్తుతం మహేష్ దూకుడు విజయోత్సాహంలో ఉన్నారు. పూరీ తో చేస్తున్న ది బిజినెస్ మ్యాన్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వెంకటేష్ విషయానికి వస్తే ఆయన గంగ..ది బాడీగార్డ్ చిత్రం విడుదల కోసం చూస్తున్నారు. మళయాళ చిత్రం ది బాడీ గార్డ్ కి రీమేక్ వెర్షన్ ఇది. డాన్ శీను డైరక్టర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఇక నిర్మాత దిల్ రాజు..తన తాజా చిత్రం ఓ మై ప్రెండ్ ఫినిషింగ్ టచెస్ లో ఉన్నారు. సిద్దార్ధ,హన్సిక,శృతిహాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. సహనిర్మాతలు: శిరీష్‌- లక్ష్మణ్‌, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

    English summary
    Trisha acting as wife to venkatesh in Seetamma Vakitlo Sirimalle Chettu film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X