Happy Birthday Trisha: వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా.. డేటింగ్ నుంచి పెళ్లి క్యాన్సిల్ వరకు!

By Manoj

త్రిష... తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరిది. తరుణ్ నటించిన 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు.. రెండో చిత్రం 'వర్షం'తో మొదటి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె చేసిన నటనకు ఎన్నో అవార్డులు, అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈమె.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డులకు కూడా ఎక్కింది. ఇక, ఈ మధ్య తమిళ సినిమాలకే పరిమితం అయిపోయిన త్రిష.. వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాల్లో తనదైన మార్క్ చూపిస్తోన్న త్రిష.. సోమవారం పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ విషయాలు మీకోసం.!

 మిస్ మద్రాస్... మిస్ ఇండియా పోటీలో అవార్డ్

మిస్ మద్రాస్... మిస్ ఇండియా పోటీలో అవార్డ్

దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో త్రిష ఒకరు. తమిళనాడుకు చెందిన ఈమె.. క్రిమినల్ సైకాలజీలో పట్టా అందుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగెట్టింది. అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుంది.

 పదహారేళ్లకే మొదలెట్టేసింది.. వాళ్ల కంట పడింది

పదహారేళ్లకే మొదలెట్టేసింది.. వాళ్ల కంట పడింది

మోడలింగ్‌లో సత్తా చాటిన త్రిష.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పదహారేళ్ల వయసులోనే ‘జోడీ' అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత 2002లో సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పెసియాదే' అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది.

 యూనిసెఫ్‌‌కు ప్రాతినిథ్యం.. వరల్డ్ ఫేమస్

యూనిసెఫ్‌‌కు ప్రాతినిథ్యం.. వరల్డ్ ఫేమస్

యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష నియమితురాలైన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్‌ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్‌ టీకా ఆవశ్యకతపై యాడ్‌ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్‌ తరఫున తమిళనాడు, కేరళ చిన్నారుల హక్కుల రాయబారిగా ఆమెను నియమించింది.

Recommended Video

Actress Trisha Krishnan Grand Entry Into Tik Tok, Here Is The First video
చిరంజీవిని కాదన్న త్రిష.. మెగా ఫ్యాన్స్ ఫైర్

చిరంజీవిని కాదన్న త్రిష.. మెగా ఫ్యాన్స్ ఫైర్

చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది త్రిష. ఈ క్రమంలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'లో అవకాశం వచ్చింది. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా నుంచి తప్పుకుందామె. దీంతో మెగా ఫ్యాన్స్ త్రిషపై ఫైర్ అయ్యారు. ఇక్కడ సినిమాలు చేయకున్నా.. ఆమె తమిళంలో పలు సినిమాలు ఒప్పుకుని ముందుకు సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X