హీరో నచ్చకపోతే త్రిష ‘నో’ చెప్పేస్తది
నాకు ముక్కుసూటిగా వ్యవహరించడం చాలా ఇష్టం అని త్రిష అంటోంది. అందుకే కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తదట. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా డోంట్ కేర్ అంటోంది త్రిష. అందుకే కాబోలు అటు బాలీవుడ్ లోను, కోలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ తెలివిగా బాగా పయనిస్తోంది. బాలీవుడ్ లో 'కట్టామీటా" చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న త్రిష, ఆ చిత్రం షూటింగ్ తో బిజీ, బిజీగా వుంటోంది. ఓ పక్క టాలీవుడ్లోనూ, ఇంకో ప్రక్క కోలీవుడ్, అదేసమయంలో బాలీవుడ్ ఇలా మూడు భాషల సినిమాల్నీ ఎంచక్కా త్రిష మేనేజ్ చేసేసుకుంటోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఒకేసారి మేనేజ్ చేసినప్పుడు, బాలీవుడ్ నాకేమన్న పెద్ద కష్టమా అంటోన్న త్రిష, బాలీవుడ్ లోనూ హీరోలు బాగా సహకరిస్తారని చెప్పుకొచ్చింది.
ఇటు సౌత్, అటు నార్త్ చక్కబెట్టలేకనే కదా, అసిన్ దక్షిణాది సినిమాలకి గుడ్ బై చెప్పేసిందని అడిగిగే, 'నాకు అలాంటి సమస్యేమీ లేదు, అయినా నా రూటే సెపరేటు అంటోంది త్రిష. ఓ ఇంటర్యూలో. అంతేకాదు, ఒకేసారి అక్షయ్ కుమార్ సరసన మూడు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన త్రిష, అక్షయ్ కుమార్ ని బీభత్సంగా ఇంప్రెస్ చేసిందట. ఇప్పటిదాకా తాను త్రిష అంత ఎక్సలెంట్ హీరోయిన్ ని చూడలేదని అక్షయ్ కుమార్ బాలీవుడో లో బోల్డంత హడావిడి చేస్తున్నాడు. అంత బాగా త్రిష, అక్షయ్ కుమార్ ని ఎలా మెప్పించేసిందో మరి !


Click it and Unblock the Notifications











