బ్రేకప్: రానా-త్రిష‌ విడిపోయారంటూ వార్తలు హల్ చల్!

By Bojja Kumar

హైదరాబాద్ : దగ్గుబాటి యువ హీరో రానాపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సౌతిండియా పాపులర్ హీరోయిన్ త్రిషతో రానా డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని ఆ రూమర్స్ సారాంశం. అయితే చాలా సందర్భాల్లో ఈ వార్తలను ఇద్దరూ యాక్టర్లు ఖండించారు.

తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే, మా మధ్య అంతకు మించి ఇంకేమీ లేదని స్పష్టం చేసారు. వారు ఎన్ని సార్లు తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పినా వారిపై రూమర్స్ మాత్రం ఆగలేదు. అవార్డ్ ఫంక్షన్స్, క్రికెట్ మ్యాచులు, మూవీ ప్రీమియర్‌లు, ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలు ఇలా ఎక్కడ పలు సందర్భాల్లో వీరు కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ అంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి.

తాజాగా వీరిపై ఓ సరికొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇద్దరూ విడిపోయారని ఆ వార్తల సారాంశం. రానా ఇతర హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడనే నెపంతో అతనికి త్రిష బ్రేకప్ చెప్పేసిందట. వారి ట్వీట్స్ కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ‘ఓ కథకు ఎప్పుడూ మూడు కారణాలుంటాయి. నీ వైపు, ఎదుటి వారి తరుపున వాదనలుంటాయి. నిజమనేది ఈ రెండిటిక భిన్నంగా ఉంటుంది' అంటూ రానా ఇటీవల ట్వీట్ చేసాడు. ‘ఒక వ్యక్తిని మరిచి పోవడం చాలా సులభం. మళ్లీ అతన్ని నమ్మడం అంటూ ఉండదు' అని త్రిష ట్వీట్ చేసింది. ఒకరి పేర్లు ఒకరు పేర్లు ప్రస్తావించక పోయినా... ఒకరినుద్దేశించి ఒకరు చేసుకున్న వ్యాఖ్యలే అని, ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గతంలో త్రిష-రానా మధ్య ఎఫైర్ ఉందనే అనుమానాలు రేకెత్తించిన ఫోటోల స్లైడ్ షోలో....

ప్రవేట్ మూమెంట్

ప్రవేట్ మూమెంట్


రాణా-త్రిష చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. ఎక్కువ సేపు కలిసి గడిపారు. వీరి మధ్య స్నేహాన్ని మించిన ఇంకేదో బంధం ఉందని అప్పట్లో అనుకునే వారు.

ఒకరి కోసం ఒకరు నిరీక్షణ

ఒకరి కోసం ఒకరు నిరీక్షణ


ఏదైనా కార్యక్రమానికి కలిసి హాజరైనప్పుడు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసే వారు.

ఒకరికి తోడుగా ఒకరు

ఒకరికి తోడుగా ఒకరు


ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలోనూ రాణా త్రిష వెన్నంటే ఉన్నాడు.

తరచూ కలుసుకోవడం

తరచూ కలుసుకోవడం


ఇద్దరూ కలిసి తరచూ రెస్టారెంట్లు, హోటళ్లలో కలిసి దర్శనం ఇచ్చేవారు.

ఫన్నీ ఫ్రెండ్స్

ఫన్నీ ఫ్రెండ్స్


ఇద్దరూ అనేక సందర్భాల్లో కలిసి ఫన్నీగా గడుపుతుండేవారు.

క్రికెట్ మ్యాచ్

క్రికెట్ మ్యాచ్


ఆ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఇద్దరూ ఇలా కలిసి వీక్షించారు.

రొమాంటిక్ కపుల్!

రొమాంటిక్ కపుల్!


ఒక్కోసారి వీరి ప్రవర్తన చూస్తుంటే వీరు చాలా రొమాంటిక్ అనే భావన కలుగుతుంది ఎవరికైనా...

పార్టీలు..గట్రా

పార్టీలు..గట్రా


ఆ మధ్య ఒకసారి ఇద్దరూ తమ క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ చిక్కారు.

అనేక సందర్భాల్లో కలిసి

అనేక సందర్భాల్లో కలిసి


ఓ కార్యక్రమానికి కలిసి హాజరైన త్రిష-రాణా...పక్కనే లక్ష్మి మంచు

లవ్లీ కపుల్

లవ్లీ కపుల్


ఈ ఫోటో చూస్తుంటే ఇద్దరూ లవ్లీ కపులా కనిపిస్తున్నారిన చాలా మంది అభిప్రాయ పడ్డారు.

ఎంతో సౌకర్యవంతంగా

ఎంతో సౌకర్యవంతంగా


ఇతరులతో కలిసున్నప్పటికంటే ఈ ఇద్దరు కలిసి కనిపించినప్పుడు ఇద్దరూ ఎంతో సౌకర్యవంతంగా ఫీలవుతున్న విషయాన్ని గమనించవచ్చు.

ఫోటో షూట్లలోనూ..

ఫోటో షూట్లలోనూ..


ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నటించకపోయినా, ఇద్దరూ కలిసి పలు ఫోటో షూట్లలో పాల్గొన్నారు.

సంతోషంగా

సంతోషంగా


ఇద్దరూ కలిసారంటే...వారి మొహాల్లో సంతోషం తొనికిసలాడుతోంది

ఇద్దరూ ప్రేమలో పడ్డారా

ఇద్దరూ ప్రేమలో పడ్డారా


ఇద్దరి ప్రవర్తన, ఆటిట్యూడ్ చూస్తుంటే ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? అనే అనుమానం చూసిన వారకి కలుగక మానదు.

మ్యూచువల్ ఫ్రెండ్స్

మ్యూచువల్ ఫ్రెండ్స్


రాణా-త్రిష తాము ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పుకుంటారు. ఇద్దరికీ సేమ్ ఫ్రెండ్స్, సేమ్ సర్కిల్ కలిగి ఉండటం ఆసక్తికరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X