త్రిష కొత్త హాబీ

అందాల హీరోయిన్ కొత్త హాబీని అలవర్చుకుంది. సమయం దొరికినప్పుడల్లా ఆమె పెయింటింగ్స్ వేస్తోంది. ఈ కొత్త హాబీ పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్రిష మాత్రం కూల్ గానే సమాధానం ఇస్తోంది. చిత్రకళ పట్ల ఆసక్తి పెరగడానికి స్ఫూర్తి ఏమిటని అడిగితే కొత్త హాబీని అలవర్చుకుంటే తప్పేమిటని అడుగుతోంది. మాటలతో కాలం వృధా చేసుకోవడం కన్నా ఇదెంతో నయమని ఆమె అంటోంది. అంతేకాదు, ఊహాగానాలు ప్రచారం చేసేవారి వైపు చూడడం కూడా దీనివల్ల తగ్గించుకోవచ్చునని ఆమె చెబుతోంది.


Click it and Unblock the Notifications











