నిద్రపోని అర్థరాత్రిళ్ళే త్రిషకు బాగా ఇష్టం
త్రిష టేస్ట్ లన్నీ విచిత్రంగా ఉంటాయని ఆమె సన్నిహితులు అంటూంటారు. అందుకు తగ్గట్లుగా త్రిష కూడా డిఫెరెంట్ గా మాట్లాడుతూంటుంది. తాజాగా ఆమె మాట్లాడుతూ...ముంబై భలే బాగుంటుంది. అస్సలు నిద్రపోని నగరం ఇది. ఎంత అర్థరాత్రయినా ఏదో మూల అలికిడి ఉంటూ ఉంటుంది. అదే నాకు బాగా నచ్చింది అంది. ఇది విన్న ముంబై సినీ వాసులు కొంచెం షాక్ అయ్యారు. అర్ధరాత్రుళ్ళు నచ్చడమేంటి. అయినా నిద్రపోని ఈ నగరాన్ని అంతలా నిద్రపోకుండా గమనిస్తోందా అని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తన గురువు ప్రియదర్శకన్ దర్శకత్వంలో 'కట్టా-మీఠా' చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రం హిందీలో చేస్తూండటంతో ముంబైని పొగుడుతోంది అంటున్నారు.
కట్టా-మీటా చిత్రంలో త్రిష కలెక్టర్ పాత్రలో కనిపించనుంది. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ కామిడీ జూలై 23న రిలీజ్ అవుతోంది. ఇందులో అక్షయ్ పాత్ర సచిన్ టికులే అనే రోడ్ కాంట్రాక్టర్. లంచం ఇచ్చుకోలేక ఈ వ్యవస్ధలో బ్రతకలేక నలిగిపోతూంటాడు. ఇక ఈ చిత్రం మళయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 1989 రూపొంది సూపర్ హిట్ అయింది. ఆ చిత్రం పేరు..వెల్లం కులదే నాడు. మోహన్ లాల్, శోభన, నెరముడి వేణు నటించిన ఈ చిత్రానికి రచన మళయాళ కామిడీ రచయిత శ్రీనివాసన్ చేసారు. ఇక ఈ చిత్రం కథ మున్సిపల్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. బిల్డింగ్స్, పబ్లిక్ రోడ్స్ చుట్టూ తిరిగే ఈ కథ అప్పట్లో ఓ పొలిటికల్ సెటైర్ గా సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











