త్రిష బర్త్‌డే పార్టీ: నయనతార, అమల ఎంజాయ్(ఫోటోస్)
హైదరాబాద్: పార్టీలు, పబ్బుల్లో ఎక్కువగా కనిపించే హీరోయిన్‌గా త్రిషకు పేరుంది. చిన్నతనం నుండే ఆధునిక పార్టీ కల్చర్‌కు అలవాటు పడిన త్రిష....తన బర్త్ డే పార్టీని కూడా అదే విధంగా జరుపుకుంది. తన స్నేహితుల మధ్య ఎంతో సంతోషంగా గడిపింది. మే 4వ తేదీన 32వ వసంతంలోకి అడుగు పెడుతున్న త్రిష ఫ్రెండ్స్‌కి గ్రాండ్‌గా ట్రీట్ ఇచ్చింది.
ఈ పార్టీకి త్రిష క్లోజ్ ఫ్రెండ్స్ అయిన....నయనతార, అమలా పాల్ కూడా హాజరయ్యారు. అంతా కలిసి రాత్రంతా ఎంజాయ్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను త్రిష తన ట్విట్టర్ పేజీ ద్వారా బయట పెట్టింది. ఈ ఫోటోలు చూస్తుంటే త్రిష తన పుట్టినరోజున ఫుల్ జోష్‌తో, ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
త్రిష బర్త్ డే పార్టీకి సంబంధించినఫోటోలు స్లైడ్ షోలో....

త్రిష పార్టీ కల్చర్
త్రిష చాలా సరదా మనిషి. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసే తత్త్వం వంటబట్టించుకున్న అమ్మాయి. అందుకే, పబ్బులూ, పార్టీలలో ఎక్కువగా కనిపిస్తూవుంటుంది. ఇక, స్నేహితులతో కలిసి వుంటే చెప్పేక్కర్లేదు.

త్రిష
1983 మే 4న చెన్నయ్ లో జన్మించిన త్రిష మోడల్ గా రాణించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

వర్షం
మొదట తెలుగులో ప్రభాస్ తో కలిసి 'వర్షం' మూవీలో నటించింది. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు ప్రభాస్ కు, ఇటు త్రిషకు ఒకేసారి ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ తీసుకువచ్చింది.

స్టార్ హీరోయిన్‌గా...
దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస విజయాలు అందుకున్న త్రిష ఒకానొక సమయంలో నెం.1 హీరోయిన్‌గా వెలుగొందింది.

సుధీర్ఘ కెరీర్
దాదాపు 12 సంవత్సరాలుగా త్రిష హీరోయిన్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

ఇప్పటికీ...
కొత్త హీరోయిన్ల రాకతో త్రిష కాస్త వెనకబడినా....హీరోయిన్‌గా మాత్రం ఇప్పటికే అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.

తెలుగులో...
రిష ప్రస్తుతం తెలుగులో ‘రంభ ఊశ్వశి మేనక' అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో రెండు చిత్రాలు, కన్నడలో చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











