త్రిషా ఛాటింగ్...రవితేజ సిట్టింగ్!!!
బెజవాడ బుజ్జిలో రవితేజ సరసన హీరోయిన్ గా చేస్తున్న త్రిషా షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికితే చాలు ఛాటింగ్ చేస్తోందట. తన ల్యాప్ టాప్ తెరుస్తోందట ఛాటింగ్ మొదలెడుతోందట. ఆమెకు ఛాటింగ్ చేసే ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారట. ఇంతకు ఛాటింగ్ లో సమాచారం ఏమి పంపుతోందంటే కేవలం తన షూటింగ్ వివరాలేనట.
ఆమె ఛాటింగ్ చేయకుండా మాట్లాడదామంటే రవితేజకు ధైర్యం చాలడంలేదట. ఎందుకూ రవితేజ బాగానే మాట్లాడుతాడు కదా అనుకోవచ్చు. బాగానే మాట్లాడుతాడు కానీ తెలుగులో. త్రిషాకు తెలుగురాదాయే..ఇంగ్లీషే వచ్చాయే. ప్రస్తుతం వీరి షూటింగ్ బెంగుళూర్ లో జరుగుతోంది. త్రిషా ఛాటింగ్..రవితేజ సిట్టింగ్...సిట్టింగ్ అంటే మందు కొట్టడం అనుకోవద్దు.


Click it and Unblock the Notifications











