బీకినీపై త్రిష బొంకుడు!
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో మంచి అమ్మాయిలా మడికట్టుకున్న చెన్నయ్ సుందరి త్రిష...అవకాశాలు తగ్గే కొద్ది మెల్లి మెల్లిగా మడిని విప్పేసింది. బట్టల సైజును తగ్గిస్తూ ముద్దు సీన్లు చేయడానికి కూడా వెనకాడటం లేదు. అయితే త్రిష ఇప్పటి వరకు టూ పీస్ బికీనీ మాత్రం వేయలేదు. ఇదే విషయాన్ని ఆమె ప్రశ్నిస్తే....బొంకుడుగా సమాధానం ఇస్తోంది. హాట్ ట్రెండ్ అయినా ప్రస్తుతానికైతే తను ఆ పని చేయలేనని, భవిష్యత్ లో వేస్తాను, వేయను అనిఇప్పుడే చెప్పలేనంటూ గడుసుగా సమాధానం ఇస్తోంది. త్రిష మాటలు చేస్తుంటే ఇటీవల అవకాశాలు తగ్గి పోయిన నేపథ్యంలో బట్టల సైజును తగ్గించినట్లే..భవిష్యత్ లో మళ్లీ కెరీర్ కష్ట కాలంలో పడితే టూ పీస్ బికీనీ వేస్తుందేమో?
ఇక లేడీ ఓరియెంటెడ్ పాత్రల విషయానికొస్తే...ఇలాంటివి త్రిషకు అస్సలు నచ్చవట.ఒక వేళ చేసినా కమర్షియల్ పాయింట్స్ లేకుండా అలాంటి సినిమాలు చేయడం తన వల్ల కాదని అంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే హీరోలతో సమానంగా పాపులారిటీ వస్తుందని తపనపడే హీరోయిన్లు వున్న ఈ రోజుల్లో త్రిష ఇలా మాట్లాడటం గమనార్హం. అయితే ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా 'ఆకాశమంత" అనే క్లీన్ ఎంటర్‌టైనర్‌ను ఎలా చేశారని ఈ ముద్దుగుమ్మను ప్రశ్నిస్తే ఆ సినిమా పూర్తిగా ప్రయోగాత్మక చిత్రం కాదు. ఎందుకంటే ఆ చిత్రంలో 'సెంటిమెంట్" అనే కమర్షియల్ పాయింట్ వుందని తెలివిగా సమాధానం చెప్పింది త్రిష.


Click it and Unblock the Notifications











