నా పేరుకి అర్దం అదే.. త్రిష
త్రిష అంటే అర్దం ఏమిటి అని ఆమె ఫ్యాన్స్ కే కాక ఆమెకీ చాలా కాలం నుంచి సందేహమేట. దాంతో ఆమె కష్టపడి తన పేరు వెనక ఉన్న అర్దాన్ని కనుక్కుందిట.ఈ విషయాన్ని ఆమె వివరిస్తూ..''మా నాయనమ్మకు నవలలు చదివే అలవాటుండేది. ఆమె చదివిన ఒక రష్యా నవలలోని ఓ పాత్ర పేరు త్రిష. తన పేరు ఎంతో నచ్చడంవల్ల నేను పుట్టగానే ఆ పేరు పెట్టిందట. అంతేకాదు నాకా పేరు పెట్టడానికి మరో కారణం కూడా ఉంది. నవలలో త్రిష పేరున్న అమ్మాయి అత్యంత ధైర్యవంతురాలట. తనపై ఎవరైనా కుట్ర చేస్తే.. అందులోంచి ఈజీగా బయటపడగల నేర్పున్న అమ్మాయి అట.
అంతటి సాహసవంతురాలి పేరు త్రిష కాబట్టి.. మా బామ్మ నాకా పేరు పెట్టింది. అంతేకానీ త్రిషకు అర్థం మా నాయనమ్మకు కూడా తెలియదు. నవలలోని త్రిష వీర వనిత కాబట్టి,అన్నింట్లోనూ విజయం సాధిస్తుంది కాబట్టి త్రిష అంటే 'విజయం"అని నాకు నేనుగా ఓ అర్థం కనిపెట్టా అంది. ప్రస్తుతం త్రిష తెలుగులో వెంకటేష్ సరసన బాడీగార్డ్ చిత్రంలో చేస్తోంది. ఆ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.అలాగే ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో చేస్తోంది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్. శృతి హాసన్ డేట్స్ ఎడ్జెస్ట్ కాక తప్పుకోవటంతో త్రిష ఆ ప్లేస్ లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











