బాలయ్యతో చేయడం లేదు, త్రిష వివరణ
తను ఈచిత్రంలో నటిస్తున్న వార్తలు రావడంతో త్రిష తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. 'ప్రస్తుతం తెలుగులో కానీ తమిళంలో కానీ ఎలాంటి కొత్త సినిమాలు సైన్ చేయలేదని, గతంలో కమిటైన సినిమాల ప్రాజెక్టులతోనే బిజీగా ఉన్నానని త్రిష చెప్పుకొచ్చింది. ఏదైనా కొత్త ప్రాజెక్టు సైన్ చేస్తే ముందు నేనే వెల్లడిస్తా' అని త్రిష స్పష్టం చేసింది.
త్రిష ప్రస్తుతం తెలుగులో 'రమ్' అనే చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తమిళంలో బూలోగం, ఎండ్రెడ్రుమ్ పున్నాగై, కన్నాలె కన్నన్ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఆమె చివరగా నటించిన తెలుగు చిత్రం 'దమ్ము'. జూ ఎన్టీఆర్ హీరోగా బోయపాటి దర్శకత్వం వహించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది.
ఇక బాలయ్య-బోయపాటి సినిమా వివాల్లోకి వెళితే...ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభం అయింది. నెక్ట్స్ దుబాయ్‌లో షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇక్కడ ఎడారిలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారాహి చలన చిత్రం సమర్పణలో 14రీల్స్ ఎంటర్టెన్మెంట్ పతాకంపై ఈచిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications












