ఆ స్టార్ హీరోతో కాస్త ఎక్కువ చనువుగానే త్రిష
త్రిషకి విపరీతమైన ఎనర్జీ ఉంది..ఆమె ఎక్సప్రెషన్స్ చూస్తే అమోఘం..ఇంకో రెండు సినిమాలు చేస్తే కత్రినాకు పోటీ ఇస్తుందేమో..ఆమెకూ కత్రినా లాగే మొదట్లో హిందీ రాదు..ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది అంటూ విపరీతంగా పొగిడేస్తున్నాడు అక్షయ్ కుమార్. వారిద్దరూ ప్రస్తుతం కట్టా-మీటా అనే చిత్రంలో కలిసి చేస్తున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ గత రెండు నెలలుగా కంటెన్యూ గా జరుగుతోంది. ఇక ఆమెను పొగడటానికి కత్రినాను అడ్డం పెట్టుకుంటున్నాడు. మాట్లాడితే ..కత్రినాలాగే..త్రిష కూడా ప్రొపిషనల్, కత్రినాలాగే..అంటూ హోరెత్తిచ్చేస్తున్నాడు. ఇక అక్షయ్ కుమార్ గురించి తెలిసిన వారు మాత్రం హీరోయిన్స్ పొగడి దువ్వటంలో అతని రూటే వేరు అని చెప్తున్నారు. ఇంతకు ముందు సింగ్ ఈజ్ కింగ్ టైంలో కత్రినాని ప్రశంసలతో ముంచెత్తి, ఆమె గురించి మీడియా ముందు పదే పదే మాట్లాడి ఆమెను ఆనంద పరిచాడు అంటున్నారు.అయితే త్రిష కూడా అక్షయ్ తో క్లోజ్ గానే మూవ్ అవుతోందిట. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్న టాప్ హీరో అతనే కాబట్టి. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











