త్రిష కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయనుందనే వార్తలు వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే రెండు రోజుల పాటు ఛానెల్స్, పేపర్స్, వెబ్ సైట్స్ ఈ న్యూస్ ని హైప్ చేసాయి. అయితే ఏం జరిగిందో ఏమో కానీ త్రిష అటువంటిదేమీ లేదని ఖండిస్తోంది. తాను ఏ పార్టీకి ప్రచారం చేయటానికి ముందుకురావటంలేదంటూ వివరిస్తోంది. అలాగే తాను మొదటిసారిగా చేస్తున్న మళయాళ సినిమా షూటింగ్ లో ఒక్క రోజు కూడా ఖాళీ లేనంత బిజిగా ఉన్నానని స్పష్టం చేస్తోంది. అయినా ఉన్న ప్రాజెక్టు కంటిన్యూగా చేయటానికి డేట్స్ ఎడ్జెస్ట్ చేయటానికే సమయం సరిపోలేకుంటే పార్టీలు, ప్రచారాలు గురించి ఎక్కడ ఆలోచించగలను అని తెగేసి చెప్తోంది. అంటే త్రిష..కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తోందంటూ వచ్చిన వార్తలు రూమర్సా లేక త్రిషకి కాంగ్రెస్ కీ సరైన అవగాహన కుదరలేదనా అనేది ప్రశ్న.