ఛ! ఆయనతో అలాంటి రిలేషన్ లేదు: త్రిష

By Srikanya

మేమిద్దరం కాస్త సన్నిహితంగా మెలగటం చూసి ముంబయి పత్రికల్లో రూమర్స్ మొదలయ్యాయి. నేను తనతో చెప్పి బాధపడితే.. ఇక్కడ ఇవన్నీ సహజమే. చూసినా చూడనట్టు, విన్నా విననట్టు ఉండమన్నాడు. ఆ పద్ధతిని కూడా అలవాటు చేసుకుంటున్నాన''ని చెప్పుకొచ్చింది త్రిష. లేటెస్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె అక్షయ్ కుమార్ కి దగ్గరైందంటూ ముంబయి పత్రికల్లో, ఛానెల్స్ లో వార్తలు కంటెన్యూగా వస్తున్నాయి. అందులోనూ అక్షయ్ కుమార్ కూడా అమ్మాయిలతో కొంచెం ఇదిగా మసిలే మనిషే నని ట్రాక్ రికార్డ్ ఉండటం కూడా ఈ వార్తలకు బలాన్నిస్తోంది. అందుకే త్రిష వెంటనే ఈ వార్తలను ఖండిస్తోంది. ప్రస్తుతం త్రిష,అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా-మీటా చిత్రం రూపొందుతోంది.

మరో ప్రక్క ఎట్లా అయినా బాలీవుడ్ లో బిజీ అవ్వాలన్నది త్రిష ప్లాన్ అనేది నిర్విదాంశం. ఈ నేపధ్యమే వారి మధ్య దూరాన్ని దగ్గరికి చేస్తోందంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అక్షయ్‌కుమార్‌ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని సన్నిహితులతో చెప్పుకొని సరదాపడిపోతోందని తెలుస్తోంది. ఆయనతో కలిసి వరుసగా మూడు చిత్రాలు చేయబోతోందని వినికిడి.

అయితే అందరిలాగే త్రిష మాత్రం అక్షయ్ గురించి చెపుతూ...అక్షయ్‌ కుమార్‌ అంటే మొదట్లో కాస్త భయపడ్డాను. చాలా సీరియస్‌గా ఉంటాడేమోననుకున్నాను. తను చాలా సరదా మనిషి. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. ఆయన సెట్లో ఉంటే చాలు.. అందరూ నవ్వుతూనే ఉంటారు. కెమెరా ముందుకు వెళ్తే మాత్రం అతను చేసే పాత్రే కనిపిస్తుంది. మరో ప్రక్క అక్షయ్ కుమార్ కూడా త్రిషను ఆకాశానికెత్తేస్తూ స్టేట్ మెంట్స్ ఇవ్వటం గమనార్హం. త్రిషకి విపరీతమైన ఎనర్జీ ఉంది..ఆమె ఎక్సప్రెషన్స్ చూస్తే అమోఘం..ఇంకో రెండు సినిమాలు చేస్తే కత్రినాకు పోటీ ఇస్తుందేమో..ఆమెకూ కత్రినా లాగే మొదట్లో హిందీ రాదు..ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది అంటూ విపరీతంగా పొగిడేస్తున్నాడు అక్షయ్ కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X