నాదంతా రివర్స్ : త్రిష

అప్పట్లో అంటే త్రిష కాలేజీ రోజుల్లో... మాడలింగ్ చేస్తూండేదిట. సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండేదికాదట. సీరియస్ గా మోడలింగ్ నే కెరీర్ గా తీసుకుందామనే నిశ్చయంతో ఉందిట. ఆ రంగంలోనే కృషి చేస్తూ ఉందిట. అయితే అనుకోకుండా సినిమాల్లోకి రావల్సి వచ్చిందిట. ఒకసారి తెలిసినవాళ్లు సినిమాల్లో నటించమని త్రిషను అడిగితే అక్కడే ఉన్న వాళ్ల అమ్మ మా అమ్మాయి చెయ్యదు నువ్వు వెళ్ళ వద్దని చెప్పిందట. అదిగో అప్పుడే త్రిషకు తిక్క రేగిందిట. రివర్స్ లో సినిమాల్లో నటించాలనే కోరిక పెరిగిందట.
దాంతో సీరియస్‌గా ట్రై చేసి సినిమాల్లో ఆఫర్ పట్టేసిందిట.ఆ తర్వాత అదే సర్వస్వంగా భావించి ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఆరోజుల్లో తన అమ్మ సినిమాల్లోకి వెళ్లమని చెప్పుంటే తాను అంతగా పట్టించుకుని ఉండేదాన్ని కానని ఆమ్మ వద్దంది కాబట్టే సినిమాల్లో రాణించాలనే పట్టుదల తనలో పెరిగిందని త్రిష సెలవిస్తోందట.యోమో త్రిష రివర్స్ గొడవ తెల్సిన వాళ్ళ అమ్మ రివర్స్ లో ఆ ట్రిక్ ప్లే చేసి సినిమాల్లోకి పంపి ఉండవచ్చుగా అంటున్నారు ..ఇది విన్నవాళ్ళు.


Click it and Unblock the Notifications











