ఎన్టీఆర్ 'దమ్ము' రూమర్ పై త్రిష ఖండన
ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న దమ్ము చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే చిత్రంలో చేస్తున్న కార్తీకతో ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ విషయమై మీడియా ఆమెను సంప్రదించి వివరాలు అడిగింది..దానికి ఆమె ఖండనతో స్పందిస్తూ...'అదంతా మీడియా క్రియోట్ చేసిన అసత్య ప్రచారం. నేను, కార్తిక మంచి స్నేహితులం. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది' అంది. ఇక తన పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని చెప్పుకొచ్చింది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ...నేను ఎన్టీఆర్ తో ఇంతకుముందు రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చింది కానీ అవి మెటీరియలైజ్ కాలేదు. ఎన్టీఆర్ తో పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే బోయపాటి శ్రీను తో కూడా. ఇక ఈ చిత్రం నా పాత్ర.. మూడు రకాలుగా విభిన్నంగా సాగుతుంది. అందులో ఒకటి నేను రెగ్యులర్ గా చేసేది అంది త్రిష.
దమ్ము చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలు కానుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము'ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రంలో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము'పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











