తెలుగుని తక్కువ చేసి మాట్లాడటం అవసరమా? త్రిష!!
ఇప్పటివరకూ నేను పది నుంచి పదిహేను తెలుగు సినిమాలు చేసినా తెలుగు నాకు తెలుగు భాష అర్ధం కాదంటే మీరు నమ్మరు అంటోంది త్రిష గొప్పగా. అలాగే తాను హిందీని రాయటం, చదవటం బాగా వచ్చని అయితే సౌత్ లో ఉండటం వల్ల హిందీ మాట్లాడలేకపోతున్నానని వాపోయింది. అదంతా బాలీవుడ్ లో సెటిలవటానికి ఇస్తున్న బిల్డప్పో మరేమో గానీ తెలుగు రాదనటం మాత్రం కాస్త ఇబ్బందికర అంశమే అంటున్నారు ఇది విన్నవారంతా. ఆమె తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో చేసిన తాజా చిత్రం కట్టా మీటా జూలై23 (శుక్రవారం) రిలీజు అవుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా హిందీ పై ప్రేమ ఒలకబోస్తూ..తెలుగుని చిన్నతనం చేసి మాట్లాడుతోంది.


Click it and Unblock the Notifications











